Jump to content

ఎర్రబెల్లికి అత్యంత ఘాటుగా సమాధానమిచ్చిన రేవంత్...'దొర'మాటకు వివరణ


timmy

Recommended Posts

నిజాం నవాబుకు కప్పం కడుతూ... ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ, వారిని హింసిస్తూ, గడీలలో ఉంటూ పాలన కొనసాగించే వారిని దొరలు అనే పిలుస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'దొర' అంటే ఒక్క వెలమ కులం వారే కాదని, నిజాం నవాబు హయాంలో వెలమలతో పాటు రెడ్లు, దేశ్ ముఖ్ లు, ఆఖరికి ముస్లింలు కూడా దొరలుగా వ్యవహరించే వారని అన్నారు. స్థూలంగా చెప్పాలంటే నిజాం కాలంలో దొర అనేది దోపిడీకి పర్యాయపదమని, ప్రజల సొమ్మును ఎవరైతే కొల్లగొడుతున్నారో వారిని తెలంగాణలో బడుగు ప్రజలు 'దొర' అని పిలుచే వారని పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుతం ప్రజల సొమ్మును ఎవరైతే అన్యాయంగా దోచుకుంటున్నారో వారిపైన మాత్రమే తాను 'దొర' పదాన్ని ఉపయోగించానని ఆయన స్పష్టం చేశారు. దొర అనే మాట ఒక్క వెలమ కులానికే సొంతం కాదని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.

'దొర' అన్న మాటకు ఎర్రబెల్లి ఎందుకు అంత బాధపడుతున్నారో తనకు అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. కర్నాటకలో గాలి జనార్థన్ రెడ్డి అండ్ కో కుంభకోణాలు గురించి స్టోరీలు వేసినప్పడు నేషనల్ మీడియాతో పాటు లోకల్ మీడియా కూడా 'రెడ్డి బ్రదర్స్' అంటూ పాయింట్ అవుట్ చేసి కథనాలు ప్రసారం చేసారని, 'రెడ్డి బ్రదర్స్' అంటూ మీడియాలో కథనాలు వస్తే... దేశంలోని రెడ్లందరినీ అన్నట్టు కాదు కదా? అని అన్నారు. 

మైహోమ్స్ రామేశ్వర్ రావు బంధువు కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన చెప్పింది నమ్ముతున్నాడని ఆయన అన్నారు. సామాజిక వర్గం పేరు చెప్పి రామేశ్వరరావు, కేసీఆర్ లు దయాకర్ రావును (వీరు ముగ్గురు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే) ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా మంచివాడని, అమాయకుడిని... ఆయన అమయాకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేసీఆర్, రామేశ్వరరావులు ఆయనను మభ్యపెడుతున్నారని రేవంత్ ఆరోపించారు.

మైహోమ్స్ అధినేత రామేశ్వరరావుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా 2,000కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టిందని... దీనికి సంబంధించి తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని రేవంత్ చెప్పారు. తాను ఆరోపణలు చేసిన మరుసటి రోజే రామేశ్వరరావు తనపై పరువు నష్టం దావా వేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చాడని కానీ, ఇప్పటివరకు దావా వేయలేదని రేవంత్ చెప్పారు. అక్రమంగా భూమిని ఆర్జించాడు కాబట్టే, తనపై దావా వేస్తే కోర్టులో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెనకడుగు వేశాడని రేవంత్ అన్నారు.

రాజకీయాలు వేరు, బంధుత్వం వేరని రేవంత్ అన్నారు. రాజకీయాలతో బంధుత్వాలను ముడిపెడితే ప్రజలకు అన్యాయం చేసినట్టేనని ఆయన స్పష్టం చేశారు. తప్పు చేసినప్పుడు సొంతవారైనా వెనకేసుకు రాకూడదని ఆయన ఎర్రబెల్లికి సూచించారు. అక్రమాలకు పాల్పడినా, తమకు బంధువని వదిలివేయాలనుకుంటే రాజకీయాల్లో ఇక పోరాటం చేయలేమని రేవంత్ స్పష్టం చేశారు.

'దొర' అన్నందుకు ఎర్రబెల్లి ఇంతగా బాధపడుతున్నారని, కానీ, చంద్రబాబునాయుడును, తనను టీఆర్ఎస్ నేతలు రోజూ అడ్డమైన తిట్లు, భూతులు తిడుతుంటే ఆయనకు బాధ కలగలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు ఇచ్చి, గెలిచిన తర్వాత శాసనసభా పక్ష నేత పదవి ఇచ్చి ఎర్రబెల్లిని గౌరవించిన చంద్రబాబును టీఆర్ఎస్ నాయకులు పరుష పదజాలంతో రోజూ దూషిస్తూ ఉంటే ఎర్రబెల్లి ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు.

ఎర్రబెల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయన తెలంగాణలో తమకు నాయకుడని రేవంత్ అన్నారు. ఎర్రబెల్లిని శాసనసభా పక్ష నేతగా నియమించాలని తానే ప్రతిపాదించానని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్, రామేశ్వరరావుల మాయలో పడొద్దని ఆయన ఎర్రబెల్లిని హెచ్చరించారు. మెట్రో భూముల విషయంలో అఖిల పక్షం ఏర్పాటు చేసి వివరాలు తమ ముందు పెట్టాలని ఎర్రబెల్లితో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేశారని, అయినా, ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. మెట్రోభూముల విషయంలో పారదర్శకత లేదు కాబట్టే, ప్రభుత్వం అఖిలపక్షం ఊసెత్తడం లేదన్నారు.

మై హోమ్స్ రామేశ్వరరావుపై తన ఆరోపణలు తప్పైతే, తాను ఎర్రబెల్లి సహా టీఆర్ఎస్ నాయకులందరికీ భేషరతు క్షమాపణలు చెబుతానని, ఒకవేళ తన ఆరోపణలు నిజమైతే టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు క్షమాపణలు చెప్పనక్కర్లేదని... కేవలం మై హోమ్స్ రామేశ్వరరావుకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటే చాలని రేవంత్ అన్నారు. ఈ విషయంలో, తాను ఏమాత్రం తగ్గనని, మెట్రో విషయంలో ప్రభుత్వం ఇలాగే అక్రమ వ్యవహారాలను కొనసాగిస్తే శాసనసభా సమావేశాలను రచ్చ రచ్చ చేస్తానని ఆయన హెచ్చరించారు.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...