Jump to content

కేసీఆర్ వి అన్నీ అబద్దాలే..ఇవే వాస్తవాలు - రేవంత్ రెడ్డి..


Gajji_maraja

Recommended Posts

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడారని, తాగి వచ్చి మాట్లాడారో తెలియదని పేర్కొన్నారు. శనివారం ఆయన టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకున్న విద్యుత్ ఉత్పత్తి గణాంకాలను వివరించారు. ఆయన మాటల్లోనే..
''138 రోజులకు సంబంధించి బొగ్గు ద్వారా 10, 717 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 5,031 మిలియన్ యూనిట్లు ఏపీ ఉపయోగించుకుంది. అంటే 46.9 శాతం. 5,686 మిలియన్ యూనిట్లు తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకుంది. అంటే 53.1 శాతం. నీటి ద్వారా 3,798 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1,571 మిలియన్ యూనిట్లు ఉపయోగించుకుంది. అంటే 41.4 శాతం. 2,226 మిలియన్ యూనిట్లు అంటే 58.6 శాతం తెలంగాణ ఉపయోగించుకుంది. కేంద్ర ప్రభుత్వం 14,515 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. ఇందులో 6,603 యూనిట్లు ఏపీకి 7,912మిలియన్ యూనిట్లు తెలంగాణకు వచ్చింది. మొత్తంగా 273 మిలియన్ యూనిట్లు విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం అదనంగా వాడుకుంది.
కేసీఆర్ తాగొచ్చిండా ?
కేసీఆర్ తాగి వచ్చి మాట్లాడిండా..లేక తాగకుండా మాట్లాడారో తెలియదు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయండి. అందరం కలిసికట్టుగా ఉండి కేంద్ర ప్రభుత్వం, పక్క రాష్ట్రాలతో కలిసి పోరాటం చేద్దామని చెప్పాం. కాని పెడచెవిన పెట్టారు. తాము విద్యుత్ ను కొనుగోలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎవడబ్బ సొమ్ము పెట్టి కొనుగోలు చేశారు ? అదంతా ప్రజల సొమ్ము కాదా ?
ప్రాజెక్టులు పూర్తి కాదు..
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరాల్లో 14వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక లేదు. పర్యావరణ అనుమతి లేదు. ఇవన్నీ లేనప్పుడు ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ? అక్టోబర్ 2015 నాటికి విద్యుత్ ఉత్పత్తి చేస్తే కేసీఆర్..ఆయన వారసులు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. ఒకవేళ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ముక్కు నేలకు రాయాలి. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు మేల్కోవాలి.'' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

అక్టోబర్ 2015 నాటికి విద్యుత్ ఉత్పత్తి చేస్తే కేసీఆర్..ఆయన వారసులు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. ఒకవేళ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ముక్కు నేలకు రాయాలి.

()>> ()>> ()>>

Link to comment
Share on other sites

×
×
  • Create New...