Jump to content

Devineni Nehru Targets Lokesh


Tadika

Recommended Posts

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అవినీతి వ్యవహారాల బండారం బయటపెడతామని కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ అన్నారు. అనంతపురం నగరంలో గురువారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. లోకేష్ రూ. 2 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. వీటన్నింటినీ రికార్డులతో రుజువుచేస్తామన్నారు.

ఒకే వ్యక్తి నుంచి 125 ఎకరాల భూమి కొన్నట్లు రికార్డులు కూడా ఉన్నాయన్నారు. వీటన్నింటి రికార్డులు సేకరిస్తున్నామని, త్వరలో రుజువులతో సహా విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేసి బయటపెడతామన్నారు. నిపుణులు లేకుండా తాబేదార్లతో రాజధాని కమిటి ఏర్పాటుచేసి రోజుకోదగ్గర రాజధాని అంటూ నాటకాలాడారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. రాజధాని కమిటీలో ఒక్కరైనా నిపుణుడు ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం నలుగురు కార్పొరేట్ల చెప్పుచేతుల్లో ఉందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. బ్యాంకులను మోసం చేసిన ఆ నలుగురు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటే అంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదన్నారు. పేరుకు ముఖ్యమంత్రి చంద్రబాబే అయినా పాలనంతా వారు చెప్పినట్లే జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజనలో చంద్రబాబు పెద్ద విలన్ అని అన్నారు. చంద్రబాబు మాటమీద నిలబడే వ్యక్తి కాదన్నారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నారు.

రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నరు. పాలకుల మోసాలను ఎండగట్టడానికి ప్రజల పక్షాన పోరాడేందుకే మీ ముందుకొచ్చామన్నారు. టిడిపి హామీలపై నిలదీస్తామని, వారి మెడలు వంచుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అయినా ప్రజల కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

తమ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేశామన్నారు. టిడిపి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమంలో 12 లక్షల పింఛన్లపై కోత విధించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరాల్సిందేనని అంతవరకూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. అక్కచెళ్లెళ్లను అడ్డం పెట్టుకుని ఇసుక మాఫియాను నడిపించాలని టిడిపి నాయకులు భావిస్తున్నారని ధ్వజమెత్తారు.

 
 


కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా మంజూరు చేశామని మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం బీమా, ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు కొత్త రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంచివి మాట్లాడుతూ తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు ఒకరినొకరు దూషించుకోవడంలో పోటీపడుతున్నారన్నారు. గవర్నర్ సమక్షంలో, ఏకాంత సమయంలో మిత్రుల్లా వ్యవహరిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.

రాజధాని కోసం పచ్చని భూములపై కనే్నసిన టిడిపి నేతలు ప్రజాగ్రహానికి గురి కావాల్సిందేనన్నారు. ప్రజలతోమమేకమై సమస్యల పరిష్కారం కోసం వారితో లసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన బాబు అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపించారన్నారు.

కార్పొరేట్ల చెప్పుచేతల్లో పనిచేస్తున్న ప్రభుత్వం మెడలు వంచి పని చేయించేందుకే మీముందుకు వచ్చామని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు జెడి శీలం, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కెవిపి రామచంద్రరావు, మాజీ మంత్రులు అహ్మదుల్లా, సాకే శైలజానాథ్ పాల్గొన్నారు.

 

 

ippudu konthamandi vachi 

Brahmi-2.gif

Link to comment
Share on other sites

  • Replies 59
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    19

  • ChandraSekharCherukuri

    8

  • StuartBinny

    7

  • Rendu

    5

Top Posters In This Topic

×
×
  • Create New...