Jump to content

తప్పంతా ఏపీదే... బోర్డు నిర్ణయాన్ని ఏపీ ప్రభావితం చేసింది: హరీష్ రావు


timmy

Recommended Posts

తప్పంతా ఏపీదే... బోర్డు నిర్ణయాన్ని ఏపీ ప్రభావితం చేసింది: హరీష్ రావు      08:57 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తీర్పు ఇప్పించిందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కృష్ణా బోర్డు తన పరిథిని దాటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. నీటి వాటాలు నిర్ణయించాల్సిన అధికారం ట్రైబ్యునల్ కే ఉందని, బోర్డుకు లేదని ఆయన స్పష్టం చేశారు. 

శ్రీశైలం జలవివాదంపై కృష్ణా బోర్డు ప్రకటించిన నిర్ణయం అనైతికం, ఏకపక్షమని ఆయన ధ్వజమెత్తారు. బోర్డు నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిడి ఉన్నట్టు అనుమానం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ హక్కుల సాధనకు న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బోర్డు నిర్ణయానికి తమ ప్రభుత్వం బెదరదని చెప్పిన ఆయన, ఎంత ఖర్చు చేసైనా తమ రైతులకు విద్యుత్ కొనుగోలు చేస్తామని అన్నారు.

తెలంగాణ రైతులను కష్టాల్లోకి నెట్టేందుకు ఏపీ సీఎంతో కలసి కేంద్రం కుయుక్తులు పన్నుతోందని ఆయన మండిపడ్డారు. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ రాకపోయినా కేంద్రం చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణకు స్థానం లేకపోవడం వల్లే తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Link to comment
Share on other sites

 
శ్రీశైలం జలవివాదంపై బోర్డు నిర్ణయం ఇదే     videoview.png 05:40 PM
శ్రీశైలం జలవివాదంపై బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 వరకు శ్రీశైలం డ్యాం నుంచి తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు బోర్డు అనుమతించింది. అందుకుగాను 3 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ వివాదంపై నవంబర్ 15న మరోసారి సమీక్షించనున్నారు. శ్రీశైలం జలవినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

 

Link to comment
Share on other sites

 
TS Govt can use 3 TMC water for power generation - KWB - Tv9
    Krishna Water Management Board has decided to provide 3 TMC of water to Telangana after its meeting with the chief secretaries of the two states. The board has granted permission to Telangana government to continue power generation in Srisailam till November 2. 
The AP government is reportedly happy about the decision whereas its counterpart is not happy as there is a severe scarcity of power in Telangana.

 

Link to comment
Share on other sites

Irrigation minister, Harish Rao clarified that Telangana government wrote a number of letters to the central ministers regarding various issues of the state. He told that central ministers saying that there have been no representations from Telangana government is riduculous in the wake of Telangana Telugu Desam Party leaders's visit to Delhi. He informed that the file related to civil services officers is still pending for the last five months.
He questioned the central government for not responding to all the activities of Chandrababu causing injustice to Telangana.

Link to comment
Share on other sites

×
×
  • Create New...