Jump to content

As Ravikumar Evaro Hero Gurinchi


athapurbaba

Recommended Posts

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    20

  • athapurbaba

    16

  • loveindia

    3

  • SeemaLekka

    2

Popular Days

silver acchu veyinchukunnappudu. akkada nunchi request tho ikkada vesaa..

 

Based on Silver's experience, dedicate this to all 
 
రోజువారి కార్యాలయపు బాధ్యతలు ప్రక్కన పెట్టి 
భారముతో కూడుకున్న భావోద్వేగపు భావనలతో 
విమానము ఎక్కిన "సిల్వర్" మదిలో వేలకొలది ప్రశ్నలు.
జట్టు సభ్యులు, నాయకుడు, ఇత్యాది మొదలగువారు శుభము కోరినను,
తన మది మాత్రము " ఒకరు" కొరకు పరితపించిపొయింది.
తాను ప్రక్కన ఉన్నచో ఎంతటి  ఆనందము కలిగిఉండెనో    అని 
పదే పదే  గురుతులను యోచిస్తూ  ప్రయాసపడెను 
 
జరిగిన గతము గూర్చి జాగరిస్తూ 
జరుగబోవు భవిష్యత్ గూర్చి తర్కిస్తూ 
ఊసుల సయ్యాట నడుమ  సాగిన  ప్రయాణము,
కాల్గరి ని చేరిన వానికి   శీతల ఉష్ణము వొణుకు పుట్టించగా 
విడిది గృహమునకేగి  సేదతీరెను అలసి సొలసెను.
 
మరునాడు తారసపడబోవు క్షణములు గూర్చి 
మరల మరల తనమునకలై యోచిస్తూ, రేతిరిని గడిపాడు నిడురపట్టక
విజయము సిద్ధించగలదని విశ్వసిస్తూ,
మరునాడు ఉదయం దౌత్యకార్యాలయుము చేరెను,
వరుస లో నిలబడి వేచెను క్షణమొక యుగముగా.
సమస్త మస్తిష్క మండలి మొద్దుబారిపోయెలే 
సమరసమయం  ఆసన్నమైన తరుణం ,
తత్తరపాటు తరంగాలు మదిని ముంచెను 
 
కార్యనిర్వాహణాధికారి చిరునవ్వుతో స్వాగతిస్తూ 
"సిల్వర్ "ని సువచనంతో పలకరించెను 
విజయుడవు రా సిల్వేరా అని పలుకుతూ 
ప్రయాణ పత్రము ను స్వీకరిశ్తూ 
మూడు దినముల పిదప  ముద్రణ సిద్డంపగలదని 
శుభవార్త చల్లగా పలికెను. 
కృతజ్నభావంతో మనస్ఫూర్తిగా ధన్యవాదము తెలిపి
మూడు రోజులు ఎవ్విదముగ గడువలేనో అని 
సంసయిస్తూ సందిగ్దతతో కూడుకున్న ఆనందం అతడిని ముంచెను 
 
అది వారాంతపు సమయము 
ఎటు చూసినా హిమమయం 
శీతల ఉధృతి ని  ఒక్కడిని ఎటుల గడిపెదనో అంతో కొంటె ఆలోచన 
తేరుకుని చక్కని "కారు" ని అద్దెకు పైకం చెల్లించి 
గగనాన్ని పోలిన "కేల్గరి" ని, చుట్ట్టురా ప్రాంతాల్ని 
తనివి తీరా, తనువు బడలినా, మనసు అలువక చిందులేసెను 
"ఔరా ఇట్టి సుందర ప్రదేశమును ఎన్నడూ కానలేదే " అనుచూ
తనని తాను కొత్తగా ఆవిష్కరిస్తూ ముందుకు సాగెను మన సిల్వర్ 
 
క్షణము క్షణమును అక్షయచంద్రుని వలె 
సాంసారిక విషయములను విసర్జించి రమిస్తూ తరించేనతడు 
అలసిన అతడు ఆకలితో భోజన  శాల వైపు పరుగిడే
సంప్రదాయము రీత్యా భారతీయ శైలి కి చెందినదా ఆ భోజన శాల
నానారకముల ఒడిదుడుకులను ఒద్దికగా ఓర్చుకున్న తాను 
విరామ విశ్రాంత  భరితుడై, భోజనపదార్ధములను మెల్లగా భుజించే.
 
ఆ సమయమున తటస్థించే ఓ నవయవ్వన రాసి అచట 
చిరు నగవుతో, మిడిసిపడే మేని సొగసుతో
 వచ్చినవారి బాగోగులు చూచుచూ పనిచేసేను అచట 
సిల్వేరుడి గుండె "డప్ డప్" మని మోగే  
"మా ఆతిధ్యము నచ్చినదని విశ్వసిస్తున్నా"అని ఆమె పలకగా
" ఆతిధ్యము బాగు బాగు, మీ చిరు నవ్వు బహు బాగు " అని చిలిపి చలోక్తు విసిరి 
ఇరువురు పేర్లను ఒకరికొకరు తెలిపిరి. 
చిరునగవుతో సంభాషణ ను ముగించి, 
వచ్చిన కార్యము జయముగా  పూర్తిచేసి విజయపతాకము ఎగురవేసేను .
 
నవరస భరితమైన ఈ ప్రయాణ ఘట్టము సిల్వర్ దే ఐనా,
ప్రయాసపడి దేశసరిహద్దుని దాటుకు వెళ్లి 
వ్యయప్రయాసల కోర్చి, శ్రమించి,
 తెగించి ప్రయాణము చేసేడు వారందరిదీ దాదాపు ఇదే స్థితి
అందరికి విజయం సిద్ధింపగలదని, సిద్దించవలెనని 
ముద్రణ గావించుకున్న, మరియు గాంచెడువారకును అంకితం 
 
Link to comment
Share on other sites

Cheyy bhayya....naakasale telugu basha anna telugu literature anna chala abhimaaanam


nee interest choothunte. inka share cheyalanundhi.. ee year sankranthappudu vesaa..


1td09%20%281%29.gif?1370670563సంక్రాంతి శుభాకాంక్షలు


[font='times new roman']సంక్రాంతి తెచ్చిన పండుగ వాతావరణం [/font]
[font='times new roman']సంబరం అంబరాన్ని తాకినట్టు [/font]
[font='times new roman']సంక్రాంతి వేళ యేతెంచిన రవి కిరణం [/font]
[font='times new roman']సకల జీవకోటికి ప్రాణధాతువు ఒసగెను [/font]
[font='times new roman']సంక్రాంతి వేకువ జాము హరిదాసుని గానం [/font]
[font='times new roman']హరిలో రంగ హరి మార్మోగే వాడవాడలా [/font]
[font='times new roman']సంక్రాంతి వాకిట ముగ్గుల కోలాహలం [/font]
[font='times new roman']రంగురంగుల తారలు చక్కనైన చుక్కల్లో కొలువుతీరగా [/font]
[font='times new roman']సంక్రాంతి కళ, సిరులదారను తోడ్కొని వచ్చెను [/font]
[font='times new roman']కల్లాపి గొబ్బెమ్మల వైభవంతో కొంగొత్త అందాలకు నాంది పలికే [/font]
[font='times new roman']సంక్రాంతి ఘడియలు వర్ణనాతీతం [/font]
[font='times new roman']పసివాని నుంచి ముదుసలి వరకు సర్వత్రా హర్శపువర్షమే [/font]
[font='times new roman']సంక్రాంతి కి పులకించిన పాడి పంటల ఘుం ఘుం నాదం [/font]
[font='times new roman']అందొచ్చిన పంటను చూసి రైతన్న హర్షించు సమయం [/font]
[font='times new roman']సంక్రాంతి కి మార్మోగిన వర్తకుల అంగళ్లు[/font]
[font='times new roman']కొలువుతీరిన కొనుగోళ్ళు తెచ్చిపెట్టే లాభం పలురెట్లు[/font]
[font='times new roman']సంక్రాంతి పండుగ వలన కలిగే సర్వులకు సుఖ శాంతి [/font]
[font='times new roman']పిల్లల కేరింతలు, బావా మరదళ్ల సరసాలు, వియ్యంకుల భాగోగులతో గడిచిన క్షణములు [/font]
[font='times new roman']సంక్రాంతికి మునుపు ధూపదీపముల పోలినట్టు ఎగసిన నిప్పు కణికలు[/font]
[font='times new roman']భోగి మంటలో చలి కాచుకున్న పురములు, పులకిస్తూ పొగమంచులో తెల్లబోయే[/font]
[font='times new roman']సంక్రాంతి వేళ ఐశ్వర్యలక్ష్మి నడిచొచ్చే డోలు సన్నాయి చప్పుళ్ళతో [/font]
[font='times new roman']అందాల డూడూ బసవన్న రాకతో ఇంటిల్లిపాది ఆనందం లో ఆదిపాడెను [/font]
[font='times new roman']సంక్రాంతికి కొత్త సొగసులతో పశుశాల శోభరిల్లెను [/font]
[font='times new roman']సర్వాలంకృతమైన గోవులు కనుమ ముక్కనుమలకు కళ తెచ్చే [/font]
[font='times new roman']సంక్రాంతి పండుగ వేళ ఉత్సాహంతో ఉరకలెత్తిన పందెం రాయళ్ళ కోలాహలం [/font]
[font='times new roman']కోడి పందేలు కొక్కొరొకోళ్ళతో కిక్కిరిసిన మేళ తాళాలు మార్మోగే [/font]
[font='times new roman']సంక్రాంతి కి చిందులేసేను చిన్న పెద్ద [/font]
[font='times new roman']వేలకొలది గాలి పటములు గాలిలో తేలియాడెను దారపు అంచులతో [/font]

Link to comment
Share on other sites

×
×
  • Create New...