Jump to content

ఓకే బంగారం రివ్యూ


ye maaya chesave

Recommended Posts

నటీనటులు: దుల్కర్ సల్మాన్  , నిత్య మీనన్  ఇద్దరూ  ఒకరు ఎక్కువ తక్కువ  అనడానికి వీలు లేకుండా ఆ పాత్రల కు సరిపోయారు . ఇద్దరి కెమిస్ట్రీ ,పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ . ఇక మరో జంటగా నటించిన  ప్రకాష్ రాజ్ ,నీలా  శాంసన్ ల నటన కూడా ఆకట్టుకుంటుంది . మిగతా నటీనటులు ఓకే . 


కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : పూర్తిగా  ప్రేమకధ తీసినా , లేక వేరే ఏ జోనర్ సినిమా తీసినా రొమాన్స్  ని హేండిల్ చేయడం లో మణిరత్నం ది  అందే వేసిన చేయి . అయితే గత కొన్ని చిత్రాల్లో తనదైన ముద్ర వేయడం లో ఆయన ఫెయిల్ అవుతూ వచ్చాడు . మరోసారి తనకి అచ్చొచ్చిన జోనర్ తోనే మళ్ళి  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . 

హీరో, హీరోయిన్ పరిచయ  సన్నివేశాలు ,వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడడం  నుంచి,వాళ్ళ మద్య జరిగే చిన్న చిన్న సంఘర్షణల ని  క్లైమాక్స్ దాకా  సింపుల్ గానే చూపించాడు . వాళ్ళ ఇద్దరి ప్రయాణం లో తరువాత ఎం జరుగుతుందో మనకి ముందే తెలుసు,అంచనాలకి తగ్గట్టుగానే ,ప్రకాష్ రాజ్ ,నీలా  శాంసన్ ల ట్రాక్ ని హీరో,హీరోయిన్ లు రియలైజ్ అవడానికి ఉపయోగించుకున్నాడ�� �  . నటీనటుల నుంచి మంచి నటన రావట్టుకోవడం లో , కెమెరా వర్క్ /సంగీతం లో మణిరత్నం మార్క్ కనిపిస్తుంది . చాలా మామూలు గా  అనిపించే సంభాషణల తోనే  కధనాన్ని నడిపించినా ,అవే సన్నివేశాలు మళ్ళి మళ్ళి వచ్చినట్టు అనిపించినా తను అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించడం లో సక్సెస్ అయ్యాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా సన్నివేశాల్లో పెదాల  మీద నుంచి నవ్వు చెరగదు ,  హాస్పిటల్ సీన్ అద్దిరిపోయింది అలాగే హీరో అన్న ,వదినలు ఇంటికి వచ్చే సీన్ కూడా.   లీడ్ పెయిర్ మధ్య,ప్రకాష్ రాజ్ ,నీలా  శాంసన్ ల మద్య కూడా ఆ సందర్భానికి తగ్గట్టు హ్యూమర్  ని పండిస్తూనే  ఎమోషనల్ సీన్స్ ని కూడా సింపుల్ గా హేండిల్ చేసాడు . అయితే ఎంత ఎంజాయ్ చేసినా ఎక్కడో ఇంకా కావాల్సిన ఎమోషనల్ డెప్త్ అనేది మిస్ అయింది అనిపిస్తుంది . హీరో, హీరోయిన్ లు ఇద్దరు తమ రిలేషన్ పట్ల తమ లో వచ్చిన చేంజ్ ని గుర్తించడాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసాడు ,ముందుగానే చెప్పుకున్నట్టు వాళ్ళ ప్రయాణం లో మొదలు నుంచి చివరి వరకు జరిగేదంతా తెలుస్తూనే ఉంటుంది , కలవాలన్న ఆశ కూడా ప్రేక్షకుల్లో ఉంటుంది కానీ ఇంకా ఏదో మిస్ అయింది  అన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది . 


మాటలు : నేరేషన్ కి తగ్గట్టు  సింపుల్ గా చాలా బాగున్నాయి . 

కెమెరా : పి సి శ్రీరాం గారి పనితనం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, పైగా మణిరత్నం సినిమా లో ఐతే తన బెస్ట్ వర్క్ అందిస్తారు . 

సంగీతం : ఎ అర్ రెహమాన్ అందించిన పాటలు చాలా బాగున్నాయి ,అలాగే బ్యాక్ గ్రౌండ్  స్కోర్ కూడా సినిమా కి అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 


రేటింగ్ : 6.5/10

చివరిగా :  కావాల్సిన ఎమోషనల్ డెప్త్ మిస్ అవడం సినిమా కి  మైనస్ ఏ అయినా  "ఒకే బంగారం"మణిరత్నం మార్క్ ఉన్న ప్రేమకధ ,ఆయన అభిమానులని కచ్చితంగా ఆకట్టుకుంటుంది . 

Link to comment
Share on other sites

×
×
  • Create New...