Jump to content

పనిచేయలేదని చెయ్యి నరికేశారు... సౌదీలో ఘోరం


ParmQ

Recommended Posts

చెన్నై: ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లిన కస్తూరి అనే మహిళ సరిగ్గా పనిచెయ్యడంలేదంటూ ఆమె చెయ్యి నరికివేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఆ మహిళ కొడుకు ఎం.మోహన్ కలెక్టర్‌ను ఆశ్రయించాడు. ఇబ్బందులు పడుతున్న తన తల్లిని అక్కడి నుంచి విడిపించి తమకు అప్పగించాలని విన్నవించుకున్నాడు. వివరాల్లోకి వెళితే... వేలూరు జిల్లా కాట్పాడి తాలూకా పరిధిలోని విన్నంపల్లి సమీపాన ఉన్న ముంగిలేరి గ్రామానికి చెందిన కస్తూరి (58) గత రెండేళ్ల క్రితం సౌదీ అరేబియాలో ఇంటి పనుల కోసం చెన్నైకి చెందిన ఏజెంట్‌ షరీఫ్‌ ద్వారా వెళ్లారు. సెప్టెంబర్ 30వ తేదీన కస్తూరి కుమారుడు మోహన్‌కు ఏజెంట్ షరీఫ్‌ ఫోన్‌ చేసి ఆయన తల్లి జారిపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. దీంతో మోహన్‌ ఆదివారం వేలూరు కలెక్టర్‌ నందగోపాల్‌, జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమారిలను కలుసుకుని తన తల్లిని వెనక్కి రప్పించాల్సిందిగా కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సౌదీలో తన తల్లికి చికిత్స చేసిన ఆసుపత్రిలోని జోమిస అనే నర్సు ఫోన్‌ చేసినట్లు చెప్పారు. తన తల్లిని రియాద్‌‌లోని ఆసుపత్రికి బదిలీ చేశారని, ఆమె సరిగా పనిచేయపోవడంతో చేయి నరికివేశారని ఆ నర్సు చెప్పినట్లు మోహన్ ఆవేదనతో తెలిపారు. అప్పటి నుంచి తన తల్లితో మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదన్నారు. వెంటనే తన తల్లి పరిస్థితి తెలుసుకుని ఆమెను అక్కడి నుంచి విడిపించి అప్పగించాలని కలెక్టర్‌, ఎస్పీల వద్ద విన్నవించుకున్నట్లు తెలిపారు.
 
 

 
 
 

 

 

Link to comment
Share on other sites

Papam man money vunte emi ayina cheyochu Saudi manchi udharana akkada workers ni chala nichamga chustharu

 

peddhavida chala amayakamga undhi..choosthene chala jaali vesthundhi.

Link to comment
Share on other sites

brahmi24_0.gif?1403646236assala aa rules endhi vay...ee US vaadu paga pattaevaadu( petroleum kosam)...aa edava chinna desala meedha kakunda..ituvanti extreme thuraka desala meedha baamb lagadengae chaesthae baguntadi..daridram vadilipothadi...!!

Link to comment
Share on other sites

chi asalu chesina valla gurinchi matladadam kuda papam

58 years lo asalu antha duram pani cheyadaniki pampinchina family ni chuste kuda chirakestundi ..papam ame.. 

Link to comment
Share on other sites

×
×
  • Create New...