Jump to content

రామ్‌దేవ్‌ బాబాలో కొత్త యాంగిల్‌ --- Romantic Angle


ARYA

Recommended Posts

gallery_8818_5_297354.gif

  రామ్‌దేవ్‌ బాబాలో కొత్త యాంగిల్‌

ram-dev-baba-about-women.jpgదేశ వ్యాప్తంగా తన యోగాసనాలతో ప్రాచుర్యం పొందిన రామ్‌దేవ్‌ బాబా తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాను శారీరక సుఖాలను విడిచి పెట్టి సన్యాసిగా జీవిస్తున్నాను అని అన్నాడు. అయితే తనను మాత్రం ఎంతో మంది ఆడవారు కావాలని కోరుకున్నారు అంటూ ఆ ఇంటర్వ్యూలో రామ్‌ దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక బాలీవుడ్‌ హీరోయిన్‌ తనను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ తన మనస్సులోని కోరికను చెప్పిందని, అయితే తాను మాత్రం అందుకు ఒప్పుకోలేదు అన్నాడు.

కొన్నాళ్ల క్రితం అమెరికా వెళ్లిన సందర్బంగా ఒక యువతి తన సర్వస్వం అర్పించేందుకు ముందుకు వచ్చిందని, కాని తాను అలాంటి వాడిని కాదు అంటూ ఆమెను తిప్పి కొట్టాను అన్నాడు. అలాగే తనతో ఎంతో మంది ఏకాంతంగా మాట్లాడాలని కోరుతుంటారు అని, కాని తాను మాత్రం ఆడవారితో ఏకాంతాన్ని కోరుకోను అంటూ రామ్‌ దేవ్‌ బాబా చెప్పుకొచ్చాడు. రామ్‌ దేవ్‌బాబా యోగాకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ప్రాచుర్యం ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బాబా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...