Jump to content

నన్ను క్షమించండి: రోజా


rajurocking50

Recommended Posts

వైకాపా ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పింది. ఏపీ అసెంబ్లీ కమిటీహాలులో జరిగిన ప్రివిలేజ్ కమిటీ విచారణ కొద్ది సేపటి క్రితం ముగిసింది. టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి సూర్యారావు ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన ప్రివిలైజ్ క‌మిటీ ముందు రోజా హాజ‌రై త‌న వాద‌న‌లు వినిపించారు. టీడీపీ నేత‌లు త‌న‌ను స‌భ‌లో టార్గెట్ చేసి మాట్లాడార‌ని చెప్పిన రోజా…త‌న మాట‌లు టీడీపీ ఎమ్మెల్యే అనిత‌ను బాధించి ఉంటే క్ష‌మించాల‌ని కోరారు.

అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లో రోజా త‌న ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా మాట్లాడార‌ని టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఆమెపై ఏడాది కాలం పాటు అనర్హత వేటు వేసింది. రోజాపై ఏకంగా యేడాది పాటు స‌స్పెన్ష‌న్ విధించ‌డంతో వైకాపా అసెంబ్లీలోను బ‌య‌ట ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్టింది. చివ‌ర‌కు త‌న స‌స్పెన్ష‌న్‌తో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డుతోంద‌ని… త‌న‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు – సుప్రీంకోర్టులో పోరాటం చేశారు.

శాసనసభ – న్యాయస్థానాల మధ్య ఉన్న పరిధుల మేరకు రోజా సస్పెన్షన్ విషయంలో ఆదేశాలు ఇవ్వడం సబబు కాదని కోర్టులు తేల్చాయి. ఈ నేపథ్యంలో రోజా క్షమాపణ చెప్పే అవకాశం కల్పించగా…ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై రోజా వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పింది. ప్రివిలైజ్ క‌మిటీ ముందు రోజా మాట్లాడుతూ తాను సభలో చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పానని ఆమె తెలిపారు. అదే సమయంలో అసెంబ్లీ టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నానన్న అక్కసుతో తనపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆమె అడిగారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...