Jump to content

Jayalalitha alias Amma Revenge Stories


turtle

Recommended Posts

Jaya lalitha alia amma revenge story for andhrafriends.....time unte read seyyandi...

 

‘అమ్మ’ విజయం వెనుక...


19brk241a.jpg

 

ఎగ్జిట్‌పోల్స్‌ ఆమె తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలు దూరమయ్యాయి.ప్రభుత్వ వ్యతిరేకత మళ్లీ అధికారంలోకి రానివ్వదన్నారు చాలామంది.ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చాయి... చాలామంది అధికారులూ నేతలూ ఆమె నివాసం వైపు చూడనే లేదు. ‘జయ అధికారం కోల్పోయిందిక’ అన్నట్టే వ్యవహరించారు. ఈ అంచనాలన్నిటినీ పటాపంచలు చేస్తూ వరుసగా రెండోసారి తమిళనాడు పీఠం సాధించుకుని చరిత్ర సృష్టించారు జయలలిత.

ఆమె గతం పరిశీలిస్తే... ఇలాంటి పట్టించుకోకపోవడాలూ, పక్కన పెట్టడాలూ మామూలేనని... అలాంటివి ఎదురైన ప్రతిసారీ ఆమె పడి లేచిన కెరటమే అయిందనీ అర్థమవుతుంది. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల్ని విశ్లేషిస్తే... ఒకే మనిషిలో ఎంత వైరుధ్యమో అనిపిస్తుంది!అవమానాల్ని దాటి విజయాల్ని అందుకున్న వైనం కళ్లకు కడుతుంది.

జయను మొదటి నుంచీ ఆమె చుట్టూ ఉన్నవారు చాలా తక్కువగా అంచనా వేశారు. ఎంజీఆర్‌ అండ లేనినాడు ఎండుటాకులా ఆమె ఎగిరిపోతుందనుకున్నారు. 1987లో ఎంజీ రామచంద్రన్‌ మరణించినప్పుడు ‘ఇక ఆమె పని ముగిసిందిలే...’ అని ఈసడించారు.

అంతిమ దర్శనానికి ఇంటికి వెళ్తే దుర్భాషలాడారు. ఎంజీఆర్‌ శవయాత్రలో ఆమెను వాహనంమీద నుంచి చేయిపట్టుకుని ఈడ్చిపారేశారు. అయినా ఆమె చెదరలేదు, బెదరలేదు. ‘ఎంజీఆర్‌కు వారసురాలిగా ఎదగాలనే ఉద్దేశంతో నేను వెళ్లలేదు. కాలిబూడిదయ్యేదాకా ఆయన పక్కనుండాలనే ఆర్తి నన్ను లాక్కెళ్లింది. అక్కడ నాకు ఎదురైన అవమానాలు చూశాక వారి భయాలే నిజం చేద్దామనిపించింది. అంతే... ఇక వెనక్కి చూసుకోలేదు’ అని చెప్పారు జయ ఓ ఇంటర్వ్యూలో.

తీరా 1989లో ఎన్నికలు జరిగి కరుణానిధి ఎన్నికయ్యాక ఆమెకు జరిగిన పరాభవం తమిళనాడు రాజకీయచరిత్రలోనే ఒక చీకటికోణం. నిండుసభలో తన చీర పట్టుకుని గుంజగల్గిన అపరదుశ్శాసనులను పదవుల నుంచి తప్పించనిదే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనని ఆమె శపథం చేశారు.

కరడుకట్టిన పురుషాహంకారం ఆమె శపథాన్ని లెక్కచేయలేదు. ‘ఇక్కడితో ఈమె చరిత్ర ముగిసింది’ అని ప్రత్యర్థులు వూపిరి పీల్చుకున్నారు. పగబట్టిన పాంచాలి ఏం చేసిందో చెప్పడానికి ఓ కావ్యమంత కథైంది. జయ పనుపున పగతీర్చుకునేందుకు పాండవులెవరూ రాలేదు.

అదీ పట్టుదలంటే..


1991లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌పై ఒత్తిడి తెచ్చి మళ్లీ ఎన్నికలు ప్రకటింపజేసేంత వరకూ ఆమె నిద్రపోలేదు. గెలిచి విజయశంఖం పూరించేదాకా శాంతించలేదు. సభలో ఒంటిగాడిగా నిలిచిన తనను జయ ఎంత అవమానించగలదో వూహించిన కరుణ, పార్టీ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తదుపరి ఎన్నికల్లో ఆయన గెలిచారు. జయపై లెక్కలేనన్ని అవినీతి కేసులు మోపి 28 రోజులపాటు సెంట్రల్‌ జైల్లో నిర్బంధించారు. రెండు అవమానాలు తన ఖాతాలో జమచేసుకున్న జయలలిత పాములా బుసకొట్టారు. తరుణం కోసం వేచిచూసి, వృద్ధుడన్న జాలి కూడా లేకుండా కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టుచేయించి సెంట్రల్‌ జైల్లో పెట్టించి కసి తీర్చుకున్నారు. ఎవరేమన్నా, మీడియా తెగనాడినా ఇసుమంతైనా లెక్కచేయలేదు. అలాంటిది ఆమె పట్టుదల! భయమంటూ ఎరుగని ఆ మొండితనం ఆమె తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేసే ప్రతిపనిలోనూ ‘ఇదిగో నే’నంటూ తొంగిచూస్తుంది. మంచిచెడుల మీమాంస పక్కనబెడితే... వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటున్నారనే వాదనలు కాసేపు మర్చిపోతే... ఆ మొండితనమేలేని పక్షంలో ప్రత్యర్థుల కుతంత్రాలకు ఆమె ఎప్పుడో మాడి మసైపోయేదన్న మాట మాత్రం తిరుగులేని వాస్తవం.

 

అసలు లెక్కేలేదు!


కక్ష సాధింపులోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా ఆమె ఎలాంటి విమర్శలనూ లెక్కచేయరు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లని వాదించే జయ వైఖరి, చూసే వాళ్లందరికీ ఎప్పటికప్పుడు ఒక పజిల్‌ను సృష్టిస్తుంది. ప్రధానమంత్రి హోదాలో వాజ్‌పేయి చెన్నైని సందర్శించినప్పుడు రెండుసార్లు ఆమె ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో అన్నా ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ రెండో ఫేజ్‌ను వాజ్‌పేయి ప్రారంభించే సందర్భంలోనూ ఆమె హాజరు కాలేదు. ప్రధాని అంతటివాడు అతిథిగా విచ్చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాకపోవడం చూసి అందరూ నోళ్లు నొక్కుకున్నారు. దానికి జయలలిత చెప్పిన కారణం ‘నాకు ప్రధాని పక్కనే సీటు కేటాయిస్తే పద్ధతిగా ఉండేది. వేదిక మీద ఒక కార్నర్‌ సీటు ఇచ్చి కూర్చోమంటే నెనెలా కూర్చుంటాను?’.

జయలలిత స్థానంలో వేరెవరైనా ఉంటే మనసులో ఏమనుకున్నా, బయటపడేవారు కాదు. ఆమె మాత్రం ధిక్కారాన్ని సహించకపోవడమే కాకుండా ఎందుకు సహించదో స్పష్టంగా చెప్పగల ఘటికురాలు.

 

‘ఒక వ్యక్తిగా నాకు గౌరవాన్నివ్వకపోయినా ఏమీ అనుకునేదాన్ని కాదు. కానీ ముఖ్యమంత్రి పదవిని కూడా అగౌరవపరిచారు. నాకు అందుకే కోపం వచ్చింది’ అని చెప్పారామె. ముందు అనుకున్నట్టుగా ఆ టెర్మినల్‌కు ఎంజీఆర్‌ పేరు పెట్టకపోవడం కూడా ఆమె ఆగ్రహానికి కారణమేనని చెప్పుకుంటారు.

‘హిందూ’ పత్రిక 125వ వార్షికోత్సవాల సందర్భంలో మరోసారి వాజ్‌పేయి ప్రధాని హోదాలో చెన్నై వచ్చినప్పుడు జయలలిత ఆయనను రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లలేదు. ఆ సమయంలో ఆమె వూటీలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రధానిని ఆహ్వానించడంలో సీఎం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మీడియా దుమ్మెత్తి పోసింది. వాజ్‌పేయి మాత్రం నోరు మెదపలేదు. ఆమె స్వభావం ఎలాంటిదో ఆయనకు ప్రత్యక్షంగా అనుభవమే.

19brk241b.jpg

 

ఉద్యోగులతో కఠిన వైఖరి...


ఇవన్నీ ఒక ఎత్తయితే సమ్మెచేస్తున్న ప్రభుత్వోద్యోగులతో 2003లో ఆమె వ్యవహరించిన తీరు అనితర సాధ్యం. నిలిపివేసిన డీఏ, బోనస్‌, గ్రాట్యుటీల చెల్లింపు వంటి 15 డిమాండ్లతో సమ్మెకు దిగిన ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూపుతూ నయాన హెచ్చరించారామె. కొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం తరఫున దిగివచ్చారు కూడా. అయితే, డిమాండ్లన్నింటినీ తీర్చేవరకూ సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పిన ఉద్యోగులపై ఆమె కొరడా ఝళిపించారు. ఒక్క కలంపోటుతో రెండు లక్షల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించి దిక్కున్నచోట చెప్పుకోమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం చవిచూసేదాకా ఉద్యోగులు ఎంతగా ప్రాధేయపడినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. తమ హక్కుల్ని నెరవేర్చుకునేందుకు సమ్మెకు దిగిన ఉద్యోగులపై ఆమె తీసుకున్న కఠిన చర్య ఎంతవరకు సబబన్నది చర్చనీయాంశమే. అయితే అంత తెగింపుతో నిర్ణయాలు తీసుకోగల నేత ఇందిర తర్వాత తానేనని జయ నిరూపించుకున్నారు.

మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం తెచ్చే ధైర్యం, ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానించినందుకు పోప్‌ జాన్‌పాల్‌ను కూడా నోరుమూసుకోమని చెప్పగలిగిన తెగువ కేవలం ఆమెకే సొంతం.

ఔదార్యం ఆమెలో రెండో సగం!
వజ్రసన్నిభమైన స్వభావం వెనుక వేడి తగిలితే కరిగిపోయే నవనీత హృదయం ఉందని జయను దగ్గర్నుంచి చూసినవారు చెబుతారు. రెండేళ్ల వయసులోనే తండ్రినీ, ఇరవై ఏళ్లకే తల్లినీ కోల్పోయిన జయ, ఒంటరి ఆడపిల్లగా ప్రపంచాన్ని ఎదుర్కొనాల్సి రావడమే ఆ కఠిన స్వభావానికి కారణం కావచ్చు. చిన్నవయసులోనే తల్లి సంధ్యకు సంపాదనలో చేదోడుగా మారాల్సి రావడం వల్ల అసమాన ప్రతిభ ఉండి కూడా ఆమె ఉన్నత విద్యాభ్యాసం చేయలేకపోయారు. ఇప్పటికీ పొయెస్‌ గార్డెన్స్‌లోని ఆమె భవంతిలో మూడు వేలకు పైగా పుస్తకాలతో పెద్ద లైబ్రరీ ఉంటుంది. స్కూల్లో ఆమెను చూసి అసూయపడే క్లాస్‌మేట్స్‌ ‘నటి కూతురు’ అని వెక్కిరించేవారట. ఇది ఆమెలో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను పెంచి పోషించింది. తల్లి మరణించిన తర్వాత జయ జీవితాన్ని అత్యంత కర్కశమైన రూపంలో చూశారు. తనను ఉపయోగించుకోవాలని చూసే బంధువులు, ప్రొడ్యూసర్ల నుంచి దూరంగా ఒంటరిగా కుమిలిపోతూ దాదాపు నాలుగేళ్లు గడిపానని ఆమె చెబుతారు. ప్రేమరాహిత్యంతో కుమిలిపోతున్న మానసిక స్థితి నుంచి ఆమెను కాస్తో కూస్తో బయటికి లాగింది ఎంజీఆర్‌తో సాన్నిహిత్యమే. ఆయన సహాయంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని కూడా చాలామంది సహించలేకపోయారు. సీనియర్లందరినీ కాదని పార్టీ ప్రచార కార్యదర్శి హోదాను ఆమెకు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేక ఎన్నోరకాలుగా ఆమెను చిన్నబుచ్చడానికి ప్రయత్నించేవారు. ఎంజీఆర్‌ చివరి దశలో ఉన్నప్పుడు వారసత్వ పోరు నుంచి తప్పుకోమని జయకు అసంఖ్యాకంగా బెదిరింపులు వచ్చాయట. కానీ అణిచిపెట్టిన కొద్దీ ఎగసిపడే జయ స్వభావం ఆమెను వూరుకోనివ్వలేదు. పుట్టిననాటి నుంచీ పురుషాహంకారాన్ని ఎదుర్కొంటున్న జయ, మగవాడి అవసరం లేకుండానే ఎదగాలని నిర్ణయించుకున్నారు. తన రథాన్ని అడ్డగించిన వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే తత్వం ఆమెకు అక్కడినుంచే అలవడింది.

19brk241c.jpg

 

ఆదుకునే హస్తం...


జయలలితలో రెండో సగాన్ని చూసే అవకాశం ఎందుచేతనో ప్రపంచానికి లభించలేదు. కష్టాన్ని చూసి కరిగిపోయే వెన్నలాంటి హృదయం ఆమెది. జయ సెక్రటేరియట్‌ లేదా ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె దృష్టిలో పడేందుకు వందలాది మంది ప్రయత్నిస్తూ ఉంటారట. తమ కష్టాలను చూసి ‘అమ్మ’ చలిస్తే దరిద్రం వదిలిపోతుందని వారి నమ్మకం. ఆ నమ్మకం నిజమైన దాఖలాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. వీధులు చిమ్మే వికలాంగుడికి గవర్నమెంటు పోస్టింగ్‌ ఇప్పించారామె ఒకసారి. పార్టీ వర్కర్స్‌ ఎవరైనా మరణిస్తే వెంటనే ఆమె చేతులమీద లక్ష రూపాయలు వారి కుటుంబానికి అందుతాయి. వారు ఆమెను మేరిమాతతో, జగన్మాతతో పోలుస్తూ కొలుస్తారు. నవజాత శిశువులను ఆమె పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు అడుగుతారు. ఆమె వారికి ఓ చిరుముద్దిచ్చి, ఉన్నపళంగా పేరుపెట్టి పంపిస్తారట. వీరప్పన్‌ను హతమార్చడంలో కీలకపాత్ర వహించిన సుమారు 700 మంది పోలీసు శాఖ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల బహుమతిని అందించారామె. ఇల్లు కట్టుకోవడానికి కోరిన చోట స్థలం, ఒక ప్రొమోషన్‌ కూడా ఇచ్చి విమర్శలకు తెరలేపారు. ‘నేను మామూలుగా ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా బదులే లేదు. సినీపరిశ్రమకు చెందిన వాడిననీ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాననీ ఒక లేఖ రాయగానే వెంటనే రూ.లక్ష చెక్కు అందింది’ అని నటుడు పార్తీబన్‌ చెప్పడం ఈ ఉదారతకే గీటురాయి. ఒకప్పటి గాయని జిక్కీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు జయ ఎంతో సహాయం చేశారు. పొందడానికి అర్హులని తోస్తే చాలు.. రూ.లక్షకు తక్కువకాకుండా ఆమె నుంచి సాయం లభిస్తుంది. పాలనాపరమైన నిర్ణయాల్లో కూడా ఆమె వివేకం, విచక్షణ కొట్టొచ్చినట్లు కన్పిస్తూఉంటాయి. తల్లిదండ్రులకు అక్కర్లేని శిశువులను నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో కాకుండా ఆస్పత్రుల బయట ఉన్న ఉయ్యాళ్లలో వదిలెయ్యమంటూ ‘క్రెడిల్‌ బేబీ స్కీమ్‌’ను ప్రవేశపెట్టారు. ఆలయాల్లో నిత్యాన్న దానం స్కీమ్‌ను ప్రవేశపెట్టి బీదసాదల ఆకలి తీర్చారు. వీడియో పైరసీకి పాల్పడే వాళ్లను గూండా చట్టం కింద శిక్షిస్తానని హుంకారించే ధైర్యం ఆమెకుతప్ప మరెవరికీ లేదు. మహిళా సాధికారత కోసం లెక్కలేనన్ని పథకాలు రూపొందించారు. దేశంలోనే ప్రప్రథమంగా ఫైర్‌ స్టేషన్‌లలో ఆఫీసర్లుగా స్త్రీలను నియమించారు. పోలీసుల్లో మహిళా కమెండోలనూ మహిళా బెటాలియన్‌నూ తయారుచేసిన ఘనత కూడా అమ్మదే.

 

కావాలి ఆ గుండె ధైర్యం


నాయకత్వం వహించే సామర్థ్యం మహిళలకు తక్కువనీ తమకు లభించిన విశేషాధికారాలను జయలలితలా, ఇందిరలా దుర్వినియోగం చేసేవారే స్త్రీలలో ఎక్కువనీ వాదించే పురుషాహంకారులకు మన సమాజంలో కరవు లేదు. అయితే, ఎత్తులూ పైయెత్తుల రాజకీయ రంగంలో రాణించేందుకు పురుషుడి కంటే స్త్రీ రెండింతలు కష్టపడాల్సి వస్తుంది. అదీ మగతోడులేని ఒక ఒంటరి మహిళకు సమాజంలో ఎదురయ్యే అవహేళన, అడ్డంకులు సామాన్యమైనవి కాదు. వాటన్నింటినీ అధిగమించే ప్రయత్నంలో గుండె ధైర్యంతో వ్యవహరించకపోతే, కాటువేసే కాలనాగులు అడుగడుగునా ఉంటాయి. జయస్థానంలో మరెవరున్నా ఆ కాటుకు బలయ్యేవారేననేది నిర్వివాదాంశం. తృణీకారాన్ని సహించలేని స్వభావం కొంత... చిన్ననాటి నుంచి చవిచూసిన ఆశాభంగాలూ అవమానాలూ ఇంకొంత.. ఆమెలో ప్రేమరాహిత్యాన్నీ ప్రతీకారేచ్ఛను కలిగించాయి.

 

‘అమ్మ’ జ్ఞాపకాలు...


* బెదిరించడం, భయపెట్టడం ద్వారా నాతో ఏ పనీ చేయించలేరు. అలాంటి ప్రవర్తన నా పట్టుదలను పెంచి మరీ మొండికెత్తేలా చేస్తుంది. బలవంతంగా లొంగదీయాలనుకుంటే కాస్త కూడా వంగను. నాతో మంచిగా ఉండి, సౌమ్యంగా వ్యవహరిస్తూ, మెత్తగా మాట్లాడటం ద్వారా మాత్రమే నా సహకారాన్ని పొందగలరు.

 

* నా తొలి బాల్య జ్ఞాపకానికి 66 ఏళ్లు. అప్పుడు నేను రెండున్నరేళ్ల పసిపిల్లను. మైసూర్‌లోని మా తాతగారి ఇంట్లో మా అమ్మ చంకలో ఉన్నాను. ఆమె ఎర్రటి కాటన్‌ చీర కట్టుకుంది. మా నాన్న చనిపోయారు. శవాన్ని కారులోంచి దింపుతున్నారో, ఎక్కిస్తున్నారో... సరిగ్గా గుర్తులేదు. ఇల్లంతా చీకటిగా, దిగులుగా ఉంది. మా వెనక నౌకరు లాంతరు పుచ్చుకుని నిల్చున్నాడు. నాన్న చనిపోయే నాటికి మా అమ్మ వేదకు ఇరవై ఏళ్లు. జీవితంలో చాలా సంఘర్షణను ఎదుర్కొందామె. సంప్రదాయ అయ్యంగార్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెందీ, సినిమాల్లోకి ప్రవేశించడంతో ఆమెను అందరూ తక్కువగా చూసేవారు. చిన్నప్పుడు ఒకామె నన్ను ఉద్దేశించి, ‘నటి కూతురువి... ఎన్ని చేతులు మారాలో ఏమిటో..’ అంది. ఆ మాటలకు అర్థం తెలియలేదు కానీ ఇంటికొచ్చి అమ్మకు చెబితే బాగా ఏడ్చింది.

 

* నేను చిన్నప్పట్నుంచి చదువులో చురుగ్గా ఉండేదాన్ని. నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. క్లాస్‌లో నాకు ఫ్రెండ్స్‌ ఎవరూలేరు. చదువులో, ఆటపాటల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ కొట్టేసేదాన్నని అందరికీ అసూయగా ఉండేది. వాళ్ల స్నేహం సంపాదించుకోవాలంటే ఫస్ట్‌ర్యాంక్‌ను వదులుకోవాలి. కానీ ర్యాంక్‌ కోసం నేను పెద్దగా కష్టపడేదాన్ని కాదు... అదే వచ్చేది. మెట్రిక్యులేషన్‌లో స్టేట్‌ఫస్ట్‌ వచ్చింది. కాలేజీలో చేరడానికి కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌ కూడా వచ్చింది. ఇంగ్లిష్‌ సాహిత్యంలో పీహెచ్‌డీ చేయాలనుకునేదాన్ని. లాయర్‌ని కావాలనీ ఉండేది. మా అమ్మ వెంట ఒక సినిమా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు నన్ను చూసి ఎందరో ప్రొడ్యూసర్లు వెంటపడ్డారు. ఇంటికొచ్చాక నేను యుద్ధమే చేశానో... ప్రళయాన్నే సృష్టించానో... అవేవీ మా అమ్మ ముందు నిలవలేదు. నేను సినిమాల్లో నటించి తీరాలని అమ్మ నిర్ణయించింది. నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇంటి పరిస్థితిని విడమర్చి, సినిమాల్లో నటించడం తప్ప వేరే దారి లేదని చెప్పేసిందామె!

 

* సినిమాల్లో చేరడం ఇష్టం లేకపోయినా నేను ఆ లోపాన్ని నా నటనలో చూపలేదు. ఏది చేసినా పర్‌ఫెక్ట్‌గా చేయడం నాకు అలవాటు. సినిమాల్లోనూ దాన్నే ఆచరణలో పెట్టాను. నా వ్యవహారాలన్నీ అమ్మే చూసేది. ఆమె కాంట్రాక్టు ఒప్పుకుందంటే నేను చేసితీరాలి. చాలాసార్లు నేను పోట్లాడేదాన్ని. ఓసారి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాను కూడా. మా అమ్మ చేసింది న్యాయమో అన్యాయమో... కానీ ఆమె ఏది చేసినా నా కోసమే చేసింది. ప్రపంచంలో నా గురించి పట్టించుకున్నది ఆమె ఒక్కతే. కొన్నాళ్లు నేను సినిమాల్లో బాగా కూడబెట్టి, ఆ తర్వాత మానేసి పెళ్లిచేసుకుని స్థిరపడాలన్నది ఆమె ఆలోచన కావచ్చు. పొయెస్‌ గార్డెన్స్‌లో పెద్ద ఎత్తున ‘వేద నిలయాన్ని నిర్మించడం అమ్మే మొదలెట్టింది. ఆ ఇల్లు పూర్తికాకుండానే ఈ నిర్దయలోకంలో నన్ను వదిలేసి ఆమె శాశ్వతంగా వెళ్లిపోయింది. అప్పుడు నాకు 12 ఏళ్లు.

 

* అమ్మ పోయేనాటికి నాకు ఏమీ తెలియదు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అంటే తెలీదు.. నేను ఎంత సంపాదిస్తున్నానో తెలీదు.. ప్రొడ్యూసర్లు నాకు ఎంతివ్వాలో తెలీదు... చివరికి ఇంట్లో ఇందరు పనివాళ్లున్నారో వాళ్లకు జీతాలెంతో కూడా తెలీదు. మా అమ్మ చనిపోయాక ప్రపంచమంతా నా నుంచి లాభం పొందాలనే ప్రయత్నించింది. ప్రొడ్యూసర్లు, బంధువులు... అందరూ! లోకజ్ఞానం సంపాదించడానికి బోలెడు ఢక్కామొక్కీలు తిన్నాను... ఎంతో మోసపోయాను. ఇలా 1975 వరకూ గడిచింది. చివరకు ఒకరోజు బంధువులందర్నీ ఇంట్లోంచి వెళ్లగొట్టేశాను. వాళ్లకు నేను అవసరంలేదు.. నా డబ్బు కావాలి.

 

* సెల్ఫ్‌ పిటీ నాకు ఇష్టం ఉండదు. నిరాశావాదం అసలేగిట్టదు. కానీ నిజం చెప్పాలంటే జీవితంలో నాకు ఆనందకరమైన క్షణమే లేదు. ఎన్నో కష్టాలు చవిచూశాను. నేను నమ్మిన వారందరూ నన్ను వంచించారు. నేనేదో ఒంటిస్తంభం మేడలో ఉంటున్నానని కాదు. కానీ ఎవరినీ కావాలనుకునే స్థితిలో లేను. నేను ప్రయత్నించలేదని చెప్పడంలేదు... లెక్కలేనన్ని సార్లు ప్రయత్నించాను. ప్రతిసారీ తిరిగి కోలుకోలేనేమోనన్నంతగా దెబ్బతిన్నాను. ఇక ఎవరికోసమూ, దేనికోసమూ ప్రయత్నించను. నా దగ్గరకు వచ్చిన వాళ్లనే స్వీకరిస్తాను.

 

* 1975 నుంచి నాలుగేళ్లపాటు అంతా అంధకారమే. అమ్మపోవడం, ప్రపంచంలోని దౌష్ట్యాన్ని కట్టెదుట చూడాల్సి రావడం నాలో నిరాశను పెంచాయి. నన్ను నేను గృహ నిర్బంధంలో ఉంచుకున్నాను. బయటకు వెళ్లేదాన్ని కాదు. ఫోన్‌ ఎత్తేదాన్ని కాదు. ఎటుచూసినా చీకటే కనిపించింది. కాస్త కోలుకున్నాక 1979లో ఒకటి రెండు సినిమాల్లో నటించాను కానీ అవి ఫ్లాపయ్యాయి. నటించడం ద్వారా కూడా సంతృప్తి పొందలేనని నిశ్చయించుకుని అదీ మానేశాను. రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుని ఎంజీఆర్‌ను సంప్రదించాను. ఆయన తొందరపడవద్దు నిదానంగా ఆలోచించుకొమ్మని సలహా ఇచ్చారు. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను.

 

* నేను నా భావోద్వేగాల్ని బయటకు చూపను. ఏడవాలన్నా తలుపులేసుకుని ఏడుస్తాను. నాయకురాలిని... నేనే బేలగా మారిపోతే ఎవరు దారి చూపుతారు? నా బలహీనతను ఇతరులకు ఎలా చూపగలను? నేను కోపంగా ఉన్నా, ఎప్పుడూ మాట తూలను. పత్రికా సమావేశాల్లో 40, 50 మంది విలేకర్లు ఏకమొత్తంగా ప్రశ్నలు సంధించినా కాస్త కూడా తడుముకోను... చెప్పదలచుకోని విషయాన్ని హరిహరాదులు దిగివచ్చినా చెప్పను.

 

* ఇందిరాగాంధీని ‘పార్టీలో ఏకైక పురుషుడు’గా కీర్తించే వాళ్లున్నారు. మగవాళ్లనే శక్తిమంతులుగా ఎందుకు భావిస్తారో నాకు అర్థం కాదు. నిజానికి ఆమె స్త్రీత్వానికి ప్రతిరూపంలా ఉంటుంది. చక్కని చీరలు కట్టుకునేది. చూడటానికి కూడా ఎంతో అందంగా ఉండేది. పిరికితనం, చేతగానితనం మూర్తీభవించిన మగవాళ్లను బోలెడు మందిని చూశాను. వాళ్లను శక్తిమంతులుగా భావించగలమా? శక్తిని కలిగి ఉండటానికి స్త్రీ పురుషులన్న తేడా లేదు.

 

* కాలం నాలో ఎంతో మార్పు తెచ్చింది. ఇప్పుడు నేను ఎంత అవమానించినా నోరుమూసుకునే జయను కాను. పొట్లాటకు నేనై ఏనాడూ దారులు వెతకను. అలా అని కయ్యానికి కాలు దువ్వితే ప్రత్యర్థి ఎంతటివారైనా సరే, మౌనంగా వూరుకోను.

Link to comment
Share on other sites

One of the photos released in 1997 when karunanidhi govt. launched disproportionate of assets case on jayalalitha.

The diamond jewellery is part of the disproportionate case launched in 1997 and went for trial till 2015 in banglore. in 2015, she was aquitted from this case coincidently after modi govt. came into power in 2015. @3$%

 

జయ మొత్తం ఆస్తి 66 కోట్లని..అందులో దాదాపు 40 కోట్ల అక్రమాస్తులను కలిగి ఉన్నారన్నది జయలలితపై అభియోగం. అయితే.. వీటిలో నిర్మాణ వ్యయం 28 కోట్లు, ఆమె కొడుకు పెళ్లి ఖర్చు ఆరున్నర కోట్లని జడ్జి లెక్కలో నుంచి తీసేశారు.  జయలలిత ఆస్తుల విలువ దాదాపు 35 కోట్లు.. అంటే ఆమె అక్రమంగా కలిగి ఉన్న ఆస్తి దాదాపు 3 కోట్లు. ఐతే.. నిబంధనల ప్రకారం ఒక్క పైసా అక్రమ సొమ్మున్నా.. అది నేరమే 

 

CS11.jpg

 

jaya8.jpg

Link to comment
Share on other sites

NTR saved jayalalitha from disproportionate Case:

 

 

When Justice Kumarasamy announced the verdict of an 18 year long Disproportionate Asset case, it’s a huge relief and landmark in Jayalalithaa’s Political career. She might even describe the verdict as her best victory against any odds to date. But is the verdict really a victory for Honesty and Trustworthiness the people have on Indian Judiciary? It will be a big no.

Jayalalithaa Sasikala

I am not here to criticize any judgement, but just going to analyze the verdict pronounced. All excerpts will be from theJudgement copy available and made public.

The 10% Path

  • “It can be stated without any fear of contradiction that corruption is not to be judged by degree, for corruption mothers disorder, destroys societal will to progress, accelerates undeserved ambitions, kills the conscience, jettisons the glory of the institutions, paralyses the economic health of a country, corrodes the sense of civility and mars the marrows of governance.”
  • This is what the Supreme Court of India has statement in its Judgement in the corruption case of Niranjan Hemchandra Sashittal in the year 2013.
  • Krishnanand Agnihotri, an Income Tax officer during the period 1949-1962 was charged with Disproportionate Asset and corruption case. In the year 1976, the Supreme Court of India acquitted him stating the excess asset when compared to the declared earnings is comparatively small (Less than 10%).
    • But before looking at the 10% we need to look at the values.
    • His total declared annual Income was Rs. 1,27,715.43 and his total assets worth to that date was Rs. 55,732.25.
    • Court stated clearly that there is possibility of ups and downs on daily accounting of the central government employee and considering the amount of assets to be less and negligible he is acquitted.

Jayalalithaa’s verdict is based on this Krishnanand Agnihotri verdict. But where is Rs. 55,000 and where Crores that’s being declared in this case is.

The Andhra Formula

  • Judge Kumarasamy Judgement states an example of Andhra Pradesh Government Circular. The circular states that Andhra Pradesh Government employees can hold wealth beyond upto 10 to 20% of their earnings.
  • For Kumarasamy to use this circular as an example, this circular should have been by Tamil Nadu government, or by Karnataka Government where the case is held or at least by the Central Government.
  • Tomorrow the new government can increase of decrease this value in their circulars. In that case why do we need Anti-Corruption Department?
  • Judge Kumarasamy failed to understand that Circulars and Government Laws and Acts are different altogether.
  • A law is framed by Legislation. If individual state governments issue circulars against a law and that is being used by Judiciary for their judgements why do we need those spineless laws?

Gifts and Recommendations

  • Judge Kumarasamy has stated gifts given to leaders in TamilNadu is a customary affair. With this reason he has considered all the gifts and recommendations received by Jayalalithaa & Co as their declared income.
  • My question is will the court accept all customary practices as correct and use and give that as a verdict.
    • Jallikattu is a customary practice in TamilNadu
    • Multiple marriages by a person is a custom in early days
    • Child marriages are a customary practice in India
    • Dowry is a customary practice in India
  • Can the IAS and IPS officers receive Cars and Diamonds as gifts and give the same reason and make an escape?
  • It is a law that a government servant should return the gifts and recommendations received during his tenure to the government treasury. Guess Judge Kumarasamy skipped that page during his studies and practice.

Bride’s Family and the Dowry

  • Judge Kumarasamy has again taken the Custom scale in his verdict.
  • He has stated that in TamilNadu it’s a customary practice for Bride’s family to conduct and spend for the marriage. And he has rejected all the amount in that expense even without considering the proof and witness statements.
  • If that’s the case, every state or even every village has their own marriage rituals. Can the Judiciary recommend Indian Legislation to frame individual laws for individual tribes?

Loans are Income

  • Judge Kumarasamy has considered all loans taken by Jayalalithaa & Co as their loans.
  • Even in this he has failed to consider the Actual loan amount received. He has just considered the sanctioned amount.
    • Considering this, if Suppose I take a 50L Home loan. Will the home loan be added up to my income? Then what about the house which I bought? Meaning my income calculation is doubled?
    • Considering this, if Suppose I take a 5L Personal loan. When this PL is added to my income, what about the Tax about supposed to pay? Does that increase?
    • What about the Interest I pay on these loans? My expense. This is totally a reverse of actual financial procedures followed till date. I firmly believe Judge Kumarasamy is not a finance graduate.
  • Judge has also not considered the fact of to what purpose the loan amount is being used. Will I be able to take a business loan, not do any business, but repay the loan with interest after six months? What exactly am I doing with that money? How am I supposed to declare it to the Income Tax? No answer what so ever in the judgement.

Political Vendetta

  • Judge Kumarasamy has stated this case to be the one of political vendetta.
  • We can agree Kalaignar Karunanidhi and Anbhazhagan are front runners in making this case possible. But not to forget it was first filed by Subramanian Swamy. Also who else could file a case then? Only DMK was in power that time and only they are supposed to do it.
  • This judgement could set a bad example. Meaning even ADMK cannot file a case against DMK cadres during their rule. That too would be considered as political vendetta.
  • Supreme Court has clearly stated on 18.11.2003 that opposition parties need to act as watch dogs and should keep a check on unlawful activities of the ruling party. That was what being done by DMK in this case.

 

Link to comment
Share on other sites

 

4 minutes ago, turtle said:

One of the photos released in 1997 when karunanidhi govt. launched disproportionate of assets case on jayalalitha.

The diamond jewellery is part of the disproportionate case launched in 1997 and went for trial till 2015 in banglore. in 2015, she was aquitted from this case coincidently after modi govt. came into power in 2015. @3$%

 

She was not acquitted initially. K'taka lo jail lo undhi kadha. It was Arun Jaitely. Yeah you can say Modi.

Link to comment
Share on other sites

1 minute ago, ParmQ said:

 

She was not acquitted initially. K'taka lo jail lo undhi kadha. It was Arun Jaitely. Yeah you can say Modi.

it was strategic plant to use andhra 10% excess assets than income circular to release her from jail by BJP. the reason to release her is that they made deal so that she will give full support in rajya sabha and lok sabha for bills. 

Link to comment
Share on other sites

4 minutes ago, BabuRa0 said:

TN election results ni CBN baga study cheyali chesina promises anni isthe middle class will bring him back to power 

Anthaga study chese goppa points emunnay man? AIDMK always provides better Governance. And DMK always wins due to the alliance they form. In one of the elections they have contested only 133 seats out of 234. But this time Vijyakanth played a spoiler for DMK by not aligning with DMK and also by taking all the smaller parties like PMK and MDMK along with him. In except a few elections, AIDMK always used to go alone. And their number of seats when the lost are better than DMK's when it lost the power.

AP lo alliance work out kaadhu, at least in next elections. Both BJP and Congress are equally hated. It is YSRCP Vs TDP. BCs and Naidus play big role as always. My guess is that PK will support CBN again and most of the kaapu leaders are with TDP. It would be easy win. CBN entha kasta padina, AP lo caste (kaapus and BCs) play a big role.

Link to comment
Share on other sites

Just now, ParmQ said:

Anthaga study chese goppa points emunnay man? AIDMK always provides better Governance. And DMK always wins due to the alliance they form. In one of the elections they have contested only 133 seats out of 234. But this time Vijyakanth played a spoiler for DMK by not aligning with DMK and also by taking all the smaller parties like PMK and MDMK along with him. In except a few elections, AIDMK always used to go alone. And their number of seats when the lost are better than DMK's when it lost the power.

AP lo alliance work out kaadhu, at least in next elections. Both BJP and Congress are equally hated. It is YSRCP Vs TDP. BCs and Naidus play big role as always. My guess is that PK will support CBN again and most of the kaapu leaders are with TDP. It would be easy win. CBN entha kasta padina, AP lo caste (kaapus and BCs) play a big role.

ee tokka lo support lu alliance lu pakana pedithe people are not stupid to give power to a fool ysr 2 times gelisadu ante masses and BCs ki emi kavalo chusi correct ga set chesadu so eedu entha dochukunna acare anadu so CBN kooda runamafi and other schemes correct ga isthe easy win daham esinodiki glass water isthe chalu coke lu Pepsi lu akarla.. of course Jaffa gadu oka advantage anuko AP lo @3$%

Link to comment
Share on other sites

1 minute ago, BabuRa0 said:

ee tokka lo support lu alliance lu pakana pedithe people are not stupid to give power to a fool ysr 2 times gelisadu ante masses and BCs ki emi kavalo chusi correct ga set chesadu so eedu entha dochukunna acare anadu so CBN kooda runamafi and other schemes correct ga isthe easy win daham esinodiki glass water isthe chalu coke lu Pepsi lu akarla.. of course Jaffa gadu oka advantage anuko AP lo @3$%

YSR chesindhi Governance kaadhu. Literally looted and bought the votes through his dubious schemes. PRP and LS  kooda played some role. CBN, YSR la addamga cheyyadu le. YSR la chesthe iddharaki peddha theda em ledhu adhikaaram lo unna. YSR ni ruling lo unnanni rojule nadichindhi. Poyaka andharu thittukune valle.

Link to comment
Share on other sites

Just now, ParmQ said:

YSR chesindhi Governance kaadhu. Literally looted and bought the votes through his dubious schemes. PRP and LS  kooda played some role. CBN, YSR la addamga cheyyadu le. YSR la chesthe iddharaki peddha theda em ledhu adhikaaram lo unna. YSR ni ruling lo unnanni rojule nadichindhi. Poyaka andharu thittukune valle.

Adhe cheptunna aadu entha dochukunna masses ki kavalsina free food and free liquor ichadu so aa roju evadu mana kadupu ki annam pedithe aade mana hero ee Logic ysr baga catch chesadu8VwYbDh.gif

Link to comment
Share on other sites

4 hours ago, BabuRa0 said:

TN election results ni CBN baga study cheyali chesina promises anni isthe middle class will bring him back to power 

Antha study seyaniki emi ledu akkada. Main ga karunanidhi defeat avvadaniki reason 'alaghiri'. vaadi valla total 20 constituencies lo DMK poyindi. DMDK (Vijaya kanth party) tho alliance lekapovadam valla inko 20 constituencies lo winning vote percentage raaka poyayi.

Lekunte karaunandihi ki cake walk ayyedi. Ippudu AIADMK anni constituencies lo votes raavadaniki reason 'liquor ban' and some freebies, 1000 Rs per vote, liquor drinking etc. 

:compu18:

Link to comment
Share on other sites

5 minutes ago, turtle said:

Antha study seyaniki emi ledu akkada. Main ga karunanidhi defeat avvadaniki reason 'alaghiri'. vaadi valla total 20 constituencies lo DMK poyindi. DMDK (Vijaya kanth party) tho alliance lekapovadam valla inko 20 constituencies lo winning vote percentage raaka poyayi.

Lekunte karaunandihi ki cake walk ayyedi. Ippudu AIADMK anni constituencies lo votes raavadaniki reason 'liquor ban' and some freebies, 1000 Rs per vote, liquor drinking etc. 

:compu18:

Aa last para chalu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...