Jump to content

సైరస్ మిస్ట్రీకి టాటా టాటా- Ratan Tata back to lead . Time to buy Jag


kiladi bullodu

Recommended Posts

సైరస్ మిస్ట్రీకి టాటా టాటా

నాలుగేళ్ల క్రితం ఏరికోరి తెచ్చుకున్నారు. చిన్నవయసులోనే వ్యాపార మెలకువలు వంట బట్టించుకున్నాడని కితాబిచ్చారు. ఓ రకంగా ఆయన ఎంపిక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో ఆశ్చర్యం కలిగించింది. ఎంత ఆకస్మికంగా టాటా ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారో.. అంతే సడెన్ గా ఉద్వాసకూ గురయ్యారు. ఆయన మరెవరో కాదు సైరస్ మిస్త్రీ. సైరస్ మిస్త్రీ అల్లాటప్పా వ్యక్తి కాదు. దేశంలోనే రియల్ ఎస్టేట్ దిగ్జం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడు. టాటా గ్రూప్ లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు షాపూర్జీనే. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తిని ఉన్నపళంగా తొలగించారంటే చాలా బలమైన కారణం ఉండాలి. కారణం ఏంటో పైకి చెప్పకపోయినా.. ఇన్ సైడర్లు మాత్రం షాకింగ్ నిజాలు చెబుతున్నారు.

ఎప్పటిలాగే ప్రశాంతంగా టాటా సన్స్ బోర్డు మీటింగ్ మొదలైంది. అజెండాలో కూడా పెట్టకుండా ఉన్నట్లుండి సైరస్ మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని అదనపు అంశంగా చేర్చారు. దీనిపై షాక్ కు గురైన సైరస్.. నిబంధనల ప్రకారం 15 రోజుల ముందే నోటీసివ్వాలన్నారు. అయితే న్యాయసలహా తీసుకున్నామన్న బోర్డు.. ఆ కాపీ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. సైరస్ ను తప్పించి, నాలుగు నెలలకు తాత్కాలిక సారథిగా రతన్ టాటాను నియమించింది. సైరస్ ను తప్పించడానికి ఆయన టాటాయేతర వ్యక్తి కావడమే ప్రధాన కారణమని ఊహాగానాలు హల్చల్ చేసినా అది నిజం కాదంటున్నారు ఇన్ సైడర్లు. కేవలం సైరస్ చూస్తున్న రెండు కంపెనీలు లాభాల్లో ఉండి, మిగతా గ్రూప్ కంపెనీలు నష్టాల్లో ఉండటం, లాభాపేక్ష రహిత వ్యాపారాల విక్రయించాలన్న మిస్త్రీ నిర్ణయాలే కొంపముంచాయని చెబుతున్నారు. ఏడాది నుంచి రతన్, సైరస్ మధ్య ఉన్న విభేదాలు.. ఇప్పుడు మిస్ట్రీ ఉద్వాసనతో ఓ రూపం తీసుకున్నాయి. అయితే తన తొలగింపుపై బాంబే హైకోర్టుకు వెళ్లాలని సైరస్ నిర్ణయించడంతో.. ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...