Jump to content

Commission ivvakunda ఇల్లు కడతావా.. ఎంత ధైర్యం!?


ParmQ

Recommended Posts

రూ.10 లక్షలు ఇస్తేనే అనుమతి ఇస్తా
తెరాస కార్పొరేటర్‌ హుకుం.. రాళ్ల దాడి
దౌర్జన్యకాండపై పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
hyd-top1a.jpg

‘నా అనుమతి లేకుండా ఇల్లెలా కడతావ్‌..? నీకెంత ధైర్యం. నాకు రూ.10 లక్షలు ఇవ్వకపోతే పని జరగనివ్వను. కాదూకూడదంటే నీ అంతు చూస్తా..’ కొత్తగా ఇల్లు కట్టుకొంటున్న ఓ ప్రైవేటు పాఠశాల యజమానికి అధికార తెరాస పార్టీ కార్పొరేటర్‌ ఇచ్చిన అల్టిమేటం ఇది.

 

న హెచ్చరికను బేఖాతరు చేయడంతో రెచ్చిపోయిన సదరు కార్పొరేటర్‌.. అనుచరులతో కలిసి వెళ్లి పని చేస్తున్న కూలీలపై ఏకంగా రాళ్ల దాడికి పాల్పడ్డ సంఘటన నగరంలో చర్చనీయాంశమైంది. ఇటీవలే ఈ ప్రాంతానికి చెందిన కొందరు కార్పొరేటర్లు, అధికారపార్టీ నేతలు స్థిరాస్తి వ్యాపారులతో వాటాల కోసం బేరసారాలు పెట్టడం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో తెరాసకే చెందిన కార్పొరేటర్‌ ఏకంగా కమీషన్‌ కోసం దౌర్జన్యకాండకు తెగబడటం విస్మయపరుస్తోంది. చైతన్యపురి కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి అనుచరగణం శుక్రవారం రాత్రి సాగించిన ఈ దౌర్జన్యకాండపై విమర్శలు చెలరేగుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. చైతన్యపురి హనుమాన్‌నగర్‌కు చెందిన విక్రాంత్‌ గడ్డిఅన్నారంలో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నారు. హనుమాన్‌నగర్‌లో సొంత ఇంటి నిర్మాణం కోసం ఇటీవలే పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న విఠల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ తులసీదాస్‌ తమ అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నిర్మాణ స్థలం వద్దకు వెళ్లారు. తొలుత అక్కడ పనిచేస్తున్న కూలీలపై తిట్లపురాణం లంకించుకున్నారు. ‘మా అనుమతి లేకుండా పనులెలా చేస్తార్రా..?’ అంటూ పరుషపదజాలంతో దూషించారు. వారి ధాటికి భయపడిన కూలీలు విక్రాంత్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న విక్రాంత్‌తోనూ విఠల్‌రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నానని.. కమీషన్‌ ఇచ్చేది లేదని విఠల్‌రెడ్డికి తెగేసి చెప్పారు. వాదనలు తారస్థాయికి చేరుకోవడంతో విక్రాంత్‌పైనా రాళ్లు రువ్వారు. ఈలోగా పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం బాధితుడు చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశారు. గొడవ జరుగుతుండటంతో ఆపేందుకు మాత్రమే తాను అక్కడికి వెళ్లానని.. అకారణంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారంటూ విఠల్‌రెడ్డి ప్రతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Link to comment
Share on other sites

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    10

  • TampaChinnodu

    6

  • ParmQ

    3

  • reality

    3

Top Posters In This Topic

Hey Givanni..maaku thelvad....jai XXXXX...jai Doraaa...jai patelaaaa....

Inkemaina antey 1950-1960 kaalam andhra telangana movement nundi  ippati varaku jariginai etc etc...

Ingaa emi maatladalekapothey....castes meedha padathaaaru....

.

Link to comment
Share on other sites

9 minutes ago, DiscoKing said:

desam lone no1 state :P 

AP lo ilantivi avvatlevu ana nee feeling ? Land and Real Estate mafia exists in both TG and AP. And unfortunately both wont take any serious action on them. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

AP lo ilantivi avvatlevu ana nee feeling ? Land and Real Estate mafia exists in both TG and AP. And unfortunately both wont take any serious action on them. 

AP no1 state ani dappu kotale chinnu

Link to comment
Share on other sites

12 minutes ago, DiscoKing said:

desam lone no1 state :P 

Cancer vunna kid ni kooda vadili pettale kabja kosam Vijayawada lo . marchipoyava. 

Assalu case address lekunda poyindi. no hope they will ever get justice also.

Link to comment
Share on other sites

1 minute ago, DiscoKing said:

AP no1 state ani dappu kotale chinnu

I just posted the article from eenadu. Even I dont care if TG comes first or not. I never care about these rankings which are always manipulated to one's favor.

KCR rule has so many drawbacks. But I appreciate him for proving all the people wrong who predicted TG and Hyderabad will go to dogs if state get divided.That doesn't mean I am supporting him in all issues. I wish for strong opposition in TG which can question on issues. 

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

Cancer vunna kid ni kooda vadili pettale kabja kosam Vijayawada lo . marchipoyava. 

Assalu case address lekunda poyindi. no hope they will ever get justice also.

Aadu eppudu chusina state meedha padi edusthadu....

TRS and KCR and co gallani anukunte prblem ledhu...,on this matter....

brainless felllows state ni curse chesthe emosthadho...

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

Cancer vunna kid ni kooda vadili pettale kabja kosam Vijayawada lo . marchipoyava. 

Assalu case address lekunda poyindi. no hope they will ever get justice also.

lol hardcore Jaffa fan la unav ga.. ycp valla sava rajakeyam lo idhi kooda oka bagam bonda uma gadu already explanation kooda ichukundadu 

Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

Aadu eppudu chusina state meedha padi edusthadu....

TRS and KCR and co gallani anukunte prblem ledhu...,on this matter....

brainless felllows state ni curse chesthe emosthadho...

as usual modhu post 

Link to comment
Share on other sites

Trs MLA Srisailam goud gadu Na ofc meda ki rowdies ni pampadu 2 yrs back. 5 lacs demanded , 3 lacs icha last ki 😱😡 all Telangana hyd settlement batchs valla Chala small n mid company lu suffer avtunnay. Pani chesi brathakaleru e na kondegallu eppudu okadi meda padi tinudu tagadu . Pandi brathukuthundi e trs telangana politicians brathukutunnaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...