Jump to content

ఇది కేవలం ట్రైలరే..ముందుంది సినిమా


TampaChinnodu

Recommended Posts

ఇది కేవలం ట్రైలరే..ముందుంది సినిమా 
మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్య 
మంగళగిరిలో పైకేర్‌ ఐటీ కంపెనీ ప్రారంభం 
21ap-state1a.jpg

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటివరకు ట్రైలర్‌ మాత్రమే చూశారని, త్వరలోనే సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో ‘పైకేర్‌’ హెల్త్‌కేర్‌ సొల్యూషన్‌ ఐటీ సంస్థను శుక్రవారం మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు. 80వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటయింది. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ ఎలాంటి సదుపాయాలు లేని చోట ఇక్కడ ఐటీ కార్యాలయం ఏర్పాటుచేయడం మామూలు విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే ఇక్కడికి ఐటీ సంస్థలు విరివిగా వస్తున్నాయని తెలిపారు. మంగళగిరిలో 120 ఎకరాలలో ఐటీ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దీనివల్ల పది వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. పైకేర్‌ సంస్థ తొలిదశలో ఇక్కడ 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని, తరువాత దశలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు. పైకేర్‌ సంస్థ ఉపాధ్యక్షురాలు సుధా పెంట్యాల, ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య, ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్‌ రవి వేమూరి, సీఈఓ కోగంటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

‘సెల్‌కాన్‌’ సెల్‌ఫోనును విడుదల చేసిన మంత్రి లోకేశ్‌ 
చిత్తూరు జిల్లాలో గత నెలలో ప్రారంభమైన ‘సెల్‌కాన్‌’ పరిశ్రమ నుంచి సెల్‌ఫోన్ల తయారీ ప్రారంభం కావడం రాష్ట్ర అభివృద్ధికి శుభ సంకేతమని మంత్రి లోకేశ్‌ అభివర్ణించారు. సచివాలయంలో ‘సెల్‌కాన్‌ క్లిక్‌ స్మార్ట్‌ఫోన్‌’ను మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో సెల్‌ఫోన్ల తయారీకి సంబంధించిన అన్ని రకాల ముడి పరికరాలను ఇక్కడే తయారుచేయనున్నారని వివరించారు. ‘కార్బన్‌’ సంస్థ కూడా రాష్ట్రంలో యూనిట్‌ను స్థాపించేందుకు సంప్రదిస్తోందని, చైనాకు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ కూడా ఇక్కడినుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని వివరించారు. సెల్‌కాన్‌ సంస్థ అధినేత వై.గురు పాల్గొన్నారు.

చట్టం తనపని తాను చేస్తుంది 
రాష్ట్రంలో డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి లోకేష్‌ మంగళగిరి వద్ద విలేకరులతో అన్నారు. ‘నేను తప్పు చేసినా ముఖ్యమంత్రి వదలరు, నన్ను జైల్లో పెడతారు’ అని పేర్కొన్నారు. అన్ని కేసులు ఒకేసారి విచారించాలని జగన్‌ వేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంపై వ్యాఖ్యానిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని, వారు జైలుకు వెళ్లక తప్పదని వివరించారు.

* ఈ ఏడాది ఉపాధి హామీ నిధుల ఏకీకరణ ద్వారా రూ.9వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. పథకం తీరుతెన్నులపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు.

* విద్యాలయాల్లో ర్యాగింగ్‌ నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలని లోకేశ్‌ అన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రూపొందించిన ర్యాగింగ్‌ నిరోధక గోడపత్రికలను సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు.

గోవిందమ్మ అనే మహిళ లోకేశ్‌ సమావేశ గది ముందు వింతగా ప్రవర్తించింది. తన పిల్లలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారని, ఆర్థిక సాయం చేయాలంటూ మంత్రికి విన్నపాన్ని అందించేందుకు ఆమె వచ్చింది. అందుకు అవకాశం కల్పించలేదన్న ఉద్దేశంతో పెద్దపెద్దగా అరుస్తూ నేలపై కూర్చుంది. పోలీసులు ఆమెను పక్కకు తీసుకువెళ్లారు.

Link to comment
Share on other sites

Oracle, Microsft, Amazon etc companies CBN ni choosi Hyd vochayikada (during 2000s) mari ippudu yendhuku Amaravathi/Vijayawada ki raavatleedhu?

Link to comment
Share on other sites

5 hours ago, worstandhra said:

Oracle, Microsft, Amazon etc companies CBN ni choosi Hyd vochayikada (during 2000s) mari ippudu yendhuku Amaravathi/Vijayawada ki raavatleedhu?

avanni hyd lo unna vijayawada ki malli ravala?? great thinking man

  • Upvote 2
Link to comment
Share on other sites

8 hours ago, worstandhra said:

Oracle, Microsft, Amazon etc companies CBN ni choosi Hyd vochayikada (during 2000s) mari ippudu yendhuku Amaravathi/Vijayawada ki raavatleedhu?

appati time ki ippati time ki compare sesthe ela man. Appudu IT booming period. Those companies didn't had much presence in India.  Ippudu vunna jobs ne laying off. 

Link to comment
Share on other sites

37 minutes ago, TampaChinnodu said:

appati time ki ippati time ki compare sesthe ela man. Appudu IT booming period. Those companies didn't had much presence in India.  Ippudu vunna jobs ne laying off. 

So Chandrababu Naidu garu strip-tease chesthe companies raledhu antaav, anthena?

Link to comment
Share on other sites

1 hour ago, reality said:

So Chandrababu Naidu garu strip-tease chesthe companies raledhu antaav, anthena?

It hyd la ela chestaru adi possible kaadu. atleast manufacturing sector lo invest cheste better

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...