Jump to content

బిట్‌ కాయిన్లను నిషేధిస్తారా?


TampaChinnodu

Recommended Posts

బిట్‌ కాయిన్లను నిషేధిస్తారా?
పన్ను విధిస్తారా?
08360318BUDNEWS149.JPG

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘భారత్‌లో బిట్‌కాయిన్‌ చట్టపరమైనది కాదు.. దీనిపై నిపుణుల నివేదిక రాగానే పరిశీలించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది’’... ఇది ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ 2018 సందర్భంగా బిట్‌కాయిన్ల వాడకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల డీఎంకే సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో మాట్లాడుతూ ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో భారత్‌ వాటా దాదాపు 11శాతం అనీ.. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనీ ప్రశ్నించారు. దీనికి రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం బదులిచ్చే అవకాశం ఉంది. అదీకాక ఆర్‌బీఐ బిట్‌కాయిన్లు దేశంలో చెల్లుబాటు అవుతాయని ఇప్పటి వరకు చెప్పలేదు. దీనికి తగ్గట్టే బిట్‌ కాయిన్‌ విలువ ఈ మధ్యకాలంలోనే భారీగా పతనమైంది.

ప్రభుత్వం దృష్టి సారించడానికి కారణాలు..

ఇటీవల కాలంలో దేశంలో బిట్‌కాయిన్ల ట్రేడింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. బిట్‌కాయిన్ల కొనుగోళ్లకు ప్రత్యేక ట్రేడర్లు తయారయ్యారు. వీటి కొనుగోళ్లు, అమ్మకాలపై చట్టబద్ధమైన నిబంధనలు ఏవీ లేవు. బిట్‌కాయిన్లను కొనుగోలు చేస్తే రోజుల్లో కుబేరులైపోవచ్చు అనే భ్రమలను ఈ ట్రేడర్లు కల్పిస్తున్నారు. సాధారణగా ఆర్థిక వ్యవస్థలో మోసపూరిత పథకాలను ప్రచారం చేసేందుకు ఇటువంటి వ్యవహారాలు చేస్తుంటారు. దాదాపు ఏడాది కాలంలో భారత్‌లో బిట్‌కాయిన్ల మార్కెట్‌ 2,000 రెట్లు పెరిగింది. ప్రజలు కూడా బాగానే సంపాదించారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలితే పెట్టుబడి దారులు విపరీతంగా నష్టపోయే ప్రమాదముంది.

* బిట్‌కాయిన్లను చీకటి మార్గాల్లో చెల్లింపులకు వాహకంగా చేసుకోవడం కూడా ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది. కిడ్నాపులు, బెదిరింపులు, హవాలు ఇతర దందాలకు బిట్‌కాయిన్లే మూలంగా మారుతున్నాయి.

 

* బిట్‌కాయిన్లతో చేసే వ్యాపారాలపై చట్ట పర్యవేక్షణ లేకుండా పోతోంది. సేవారంగం వంటి వాటిల్లో బిట్‌కాయిన్లను వినియోగిస్తే ఇక ఆ లెక్కలు ఎవరికీ తెలియని పరిస్థితి. దీంతో ఆ మేరకు ప్రభుత్వం పన్ను నష్టపోవాల్సిందే.

* బిట్‌కాయిన్లలో పెట్టబడి పెడితే ఎటువంటి పన్ను విధించాలనే విషయంపైనా స్పష్టత లేదు. క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణించాలో, ఆదాయ పన్ను విభాగంలో పరిశీలించాలో అధికారులకు తెలియని పరిస్థితి. ఇక జీఎస్‌టీ విధింపుపైనా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్లను నిషేధించడమో.. లేక పన్ను పరిధిలోకి తీసుకురావడమో త్వరలో జరగుతుంది. అది బహుశా ఈ బడ్జెట్‌లో తేలిపోతుంది!! 

Link to comment
Share on other sites

Quote

ఇటీవల డీఎంకే సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో మాట్లాడుతూ ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో భారత్‌ వాటా దాదాపు 11శాతం అనీ.. 

11%  share aa India di j&*

baane peduthunnaru manollu. NRI's ni kooda add sesthe 20 avuddi emo.

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:

11%  share aa India di j&*

baane peduthunnaru manollu. NRI's ni kooda add sesthe 20 avuddi emo.

Naa love da 1 percent kuda vundadu vilu vila over actions 

USA 40 

japan 30 

uk and eu 7 to 11 

rest Asian countries chala vunayi 

Link to comment
Share on other sites

4 minutes ago, Raithu_bidda_ said:

Naa love da 1 percent kuda vundadu vilu vila over actions 

USA 40 

japan 30 

uk and eu 7 to 11 

rest Asian countries chala vunayi 

South Korea kooda major ee kada

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

South Korea kooda major ee kada

Rest Asian countries lo South Korea 

and don’t forget South America they are going to key role in future

Link to comment
Share on other sites

1 hour ago, Raithu_bidda_ said:

Naa love da 1 percent kuda vundadu vilu vila over actions 

USA 40 

japan 30 

uk and eu 7 to 11 

rest Asian countries chala vunayi 

It will be more than 1% man. Naaku thelisina vallu saala mandi doing.

Check the download counts of those india exchange apps. very high.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...