ARYA Posted March 13, 2018 Report Share Posted March 13, 2018 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పోషకాహార సమస్యను అధిగమించి, వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. బడి బయట పిల్లలను పాఠశాల బాట పట్టించడమే కాకుండా విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. మొదట్లో గుడ్లు లేకుండా కేవలం కాయగూర భోజనం పెట్టేవారు. ఆ తరువాత కొన్నాళ్లకు వారానికి ఒక గుడ్డు పెట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లకు వారానికి రెండు గుడ్లు అమలు చేయగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి మూడు గుడ్లు వడ్డించే పక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు గుడ్ల సరఫరా చేయడానికి ఏజెన్సీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీటి ద్వారా పాఠశాలలకు ఒక్కో రంగు ముద్రలు వేసిన గుడ్లను పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది ఆగస్తు 1నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్లు అందుతున్నాయి. తాజాగా వారానికి అయిదు గుడ్లు పెట్టడానికి 2018-19 బడ్జెట్లో రూ.266.72 కోట్లు నిధులు కేటాయించడం నిరుపేద కుటుంబాల బాలలకు నిజంగా వరం. పిల్లల్లో పోషకాహారలోపం నివారణకు, ఎదుగుదలకు ఉపకరించడం మాత్రమే కాకుండా అక్షరాస్యతా పెంపునకు కూడా ఇది దోహదం చేస్తుంది. Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted March 13, 2018 Report Share Posted March 13, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Bitcoin_Baba Posted March 13, 2018 Report Share Posted March 13, 2018 TDP - PPT - Vaaraniki 3 kadu 5 gudlu Desham lo gudlu pette ekaika CM ani raaskunnaru emo anukunna title choosi Quote Link to comment Share on other sites More sharing options...
kiraak_poradu Posted March 13, 2018 Report Share Posted March 13, 2018 Guddulu peetadaniki mandu add anukunna title chusi poragallaku manchi food pedithe manchide jayeebhava Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.