Jump to content

చంద్రబాబు కంటతడి


Navyandhra

Recommended Posts

636565625171978453.jpg

అమరావతి: పీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగంతో కంటతడిపెట్టారు. రాజధాని నిర్మాణంపై మాట్లాడుతూ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. "రాజధాని అంటే డ్రీమ్‌ సిటీ అని హేళన చేస్తారా?. రాజధానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?. ఆర్థికంగా బలంగా ఉన్న బెంగళూరు మెట్రోకు రూ.17వేల కోట్లు ఇచ్చారు. ముంబై, బెంగళూరుకు నిధులిచ్చి ఏపీకి ఎందుకివ్వడం లేదు?. రాజధాని నిర్మాణం పూర్తయితే కేంద్రానికే ఎక్కువ ఆదాయం. పొరుగు రాష్ట్రాల కంటే గొప్పగా రాజధాని నిర్మించాలన్నది నా కల" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
 
 
ఎందుకు సాధ్యం కాదు..!
"2018లోగా దుగరాజపట్నం పోర్టు పూర్తి చేయాలని చట్టంలో ఉంది. నాలుగేళ్ల తర్వాత మరో ప్రాంతం చూపించమంటున్నారు. సంస్థల విభజన ఆలస్యం వల్ల 3820 కోట్ల ఆదాయం తెలంగాణకే పోతోంది. విశాఖలో మెట్రోరైలు ఎందుకు సాధ్యం కాదు. కేంద్రం వల్లే విజయవాడ ఫ్లైఓవర్‌ నిర్మాణం ఆలస్యం అవుతోంది. రోడ్లు వేసి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

  • Replies 104
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Navyandhra

    18

  • futureofandhra

    14

  • TensionNahiLeneka

    12

  • TampaChinnodu

    9

Top Posters In This Topic

భాజపా అన్యాయంగా మాట్లాడుతోంది

40ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. రాష్ట్రానికి ఏం కావాలో నాకు తెలీదా?

రైల్వేజోన్‌ ఇవ్వలేమని ఓ రైల్వే అధికారి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

నాకు వ్యక్తిగతంగా పదవులు కావాలని అడిగానా? రాష్ట్రం కోసమే నా పోరాటం

శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

05143013BRK117A.JPG

అమరావతి: సెంటిమెంటుతో డబ్బులు రావని చెబుతున్న కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీకి.. సెంటిమెంటుతోనే రాష్ట్రాన్ని విభజించిన సంగతి గుర్తులేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రత్యేక హోదాకు వచ్చే ప్రయోజనాలన్నీ ఇస్తామని హామీ ఇస్తేనే ఆనాడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. నాకు భాజపా నేతలు రాజకీయాలు నేర్పుతున్నారు. నేను 1995లోనే ముఖ్యమంత్రిని అయ్యాను. తొమ్మిదేళ్లు ఆ పదవిలో ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. మళ్లీ నాలుగేళ్ల నుంచి సీఎంగా ఉన్నాను. రాష్ట్రానికి సంబంధించి నా కంటే ఎక్కవగా ఎవరికీ తెలియదు. దేశంలోనే సీనియర్‌ రాజకీయ నేతల్లో నేనూ ఒకడిని. ఆర్థిక సంస్కరణల వల్ల లాభాలు వస్తాయని మొదటిసారిగా చెప్పింది నేనే. అలాంటి నాకు రాష్ట్ర ప్రయోజనాల గురించి తెలియదా?. విభజన హామీలపై భాజపా నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారు. 60ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తి వేరెవరికో వెళ్తే భాజపా నేతలకు బాధ కలగదా?. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ది అదే పరిస్థితి. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వారు చెప్పడం సరికాదు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఏటా రాయితీలు, నిధులు ఇస్తు్న్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అవి అవసరం లేదని భాజపా నేతలు అనుకుంటున్నారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

‘ఆంధ్రప్రదేశ్‌ పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోమని కేంద్రాన్ని కోరుతున్నా. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని భాజపా నేతలు అంటున్నారు. మరి భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదు? మేము కష్టపడుతున్నాము కాబట్టే అభివృద్ధి సాధించగలుగుతున్నాం. రాష్ట్రం విభజన జరిగినప్పుడు మోదీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసింది. మేం అధికారంలో ఉంటే రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేసేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు. మరి మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు?. విభజన తర్వాత రెవెన్యూ లోటు 16వేల కోట్లుగా కాగ్‌, ఆర్థిక సంఘం నిర్ధరించాయి. 2014-15 బడ్జెట్‌లోనే ఆ నిధులు కేటాయించాలని ఆర్థిక సంఘం సూచించింది. మరి ఆ ఏడాది బడ్జెట్‌లోనే నిధులు ఎందుకు మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో భాజపా మంత్రులు, కేంద్రంలో మా మంత్రులు రాజీనామా చేసిన సందర్భంలోనే విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వలేమని ఓ రైల్వే అధికారి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?. కేంద్రానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ విధానం ఉందా?. అధికారుల నిర్ణయాలే కాదు.. రాజకీయంగా విధాన నిర్ణయాలు కూడా పాలనలో ప్రధానం. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను ప్రజలు తుడిచిపెట్టేశారు. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. అప్పటి ప్రధానమంత్రి ఏం చెప్పారో.. తర్వాత ప్రధాని అయిన మోదీ ఏం హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నా.’

విభజన చట్టం, ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు. ఎన్టీఆర్‌ ఆంధ్రులకు ఆత్మగౌరవం ఇస్తే.. నేను ఆత్మవిశ్వాసం ఇచ్చా. నాకు భయం లేదు. ఎలాంటి లాబీయింగ్‌కు పాల్పడలేదు. కేంద్రాన్ని గవర్నర్‌ పదవి అడిగానా?మంత్రి పదవి, కార్పోరేషన్‌ పదవి అడిగానా?. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర భాజపా నేతలకు మొహమాటం ఉందేమో? నాకు లేదు. సీమాంధ్ర రెవెన్యూ లోటును తప్పకుండా భర్తీ చేయాలని రాజ్యసభలో ఆనాడు ప్రతిపక్ష నేతగా జైట్లీ ప్రకటన చేశారు. ఇప్పడు ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

Link to comment
Share on other sites

ఏపీకి న్యాయం జరిగేవరకూ పోరాటం

పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

10034813BRK60A.JPG

అమరావతి : దిల్లీలో ఎంపీల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రంలో  స్థానికంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని, అక్కడ, ఇక్కడ ఆందోళనలు నిర్మాణాత్మకంగానే జరగాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగించాలని ఆయన స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో లోక్ సభ,రాజ్యసభ సభ్యులు,అసెంబ్లీ వ్యూహకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పునర్వవస్థీకరణ చట్టం, హామీల అమలుపై ఈ రోజు శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేయనున్నట్లు సీఎం తెలిపారు.

ప్రజల తరఫునే ప్రతినిధులు నిలబడాలని...,ప్రజల గొంతు పార్లమెంటులో ప్రతిధ్వనించాలని సీఎం  దిశానిర్దేశం చేశారు. 5 కోట్ల ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత భావ్యంకాదన్న ముఖ్యమంత్రి ....అభివృద్ధి ఆగిపోకుండా పోరాటం నిర్మాణాత్మకంగా జరగాలన్నారు. మన హక్కులలో రాజీలేదని, ప్రత్యేక హోదా తమ హక్కు.. ఎందుకివ్వరు? అని ప్రజలు భావిస్తున్నారని సీఎం తెలిపారు.

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెదేపా ఎంపీల పోరాటం ఉండాలని... శాసన సభ, శాసన మండలి విప్‌లు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు.  పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆ రోజు సెంటిమెంటుకు ప్రత్యేక రాష్ట్రమే ఇచ్చారన్నా ముఖ్యమంత్రి.. ఈ రోజు సెంటిమెంటు చూసి డబ్బులు ఇవ్వలేమంటారా? అని ప్రశ్నించారు. ఇదేం న్యాయం.. అని మండిపడ్డారు. ఆ రోజు సెంటిమెంటు చూసి ఒక ప్రాంత ప్రజలను నడిరోడ్డుపైకి నెట్టారన్న సీఎం ఈ రోజు సెంటిమెంటును ఎందుకు పట్టించుకోవడం లేదాని నిలదిశారు. తమ డిమాండ్లు హేతుబద్దమైనవని.. విభజన చట్టం, పార్లమెంటు హామీలు అమలు చేయాలనడం అహేతుకమా అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్థులు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా అని వైకాపాపై మండిపడ్డారు. పీఎంవో చుట్టూ ఏ2 నిందితుడి ప్రదక్షిణలు ఏం సంకేతాలు పంపిస్తున్నాయని ప్రశ్నించారు. ఒకవైపు విశ్వాసం ఉందంటారు,మరోవైపు అవిశ్వాసం పెడతామంటారా అని  ఆయన ఆగ్రహాం వ్యక్తంచేశారు. ఎందుకీ  డ్రామాలు...?నాటకాలు...అని ప్రశ్నించారు.  

ప్రజలు వైకాపాను అసహ్యించుకునే రోజు దగ్గరలోనే  ఉందన్నారు. తెదేపా ఎంపీలు కలిసికట్టుగా ఉండి..చిత్తశుద్ధితో పోరాటం చేయాలని హితవు పలికారు. ఇది కీలక సమయమని...సభకు ఎవరూ గైర్హాజరు కావొద్దని కోరారు. కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఇంకా ఎంత రావాలి అనే వివరాలను ఆన్ లైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ సమాచారాన్ని ఎంపీలు వినియోగించుకోవాలన్నారు. 

సభనుంచి సస్పెండ్ చేస్తే బయట నుంచి పోరాటం ఉధృతం చేయాలని... విభజన చట్టం, హామీలపై సమీక్ష చేయాలని, ప్రజలకు చెప్పడంతోపాటు  దేశం మొత్తానికి తెలియాలన్నారు. ఏ సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు  అన్యాయం జరిగిందో... అక్కడే న్యాయం జరగలన్నారు. ఏ పార్టీలైతే రాష్ట్రానికి అన్యాయం చేశాయో అవే న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

Link to comment
Share on other sites

cbnamaravati 13032018 1

Eppudu Navvuthu unde meeru endhuku edusthunnaru babu garu..

Maa Kondantha balam meere.. Maa gundello Ramudu Meeru 

Link to comment
Share on other sites

 

Link to comment
Share on other sites

ediche video vunte veyyi...adi kuda non-andhrajyothi and non-eenadu video...

anthekani, kandla emana padithe naluputunna screenshot esi chandrigadu edustunadu ani already pichollu aina yellow batch gallani inka fichollani cheyaku

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

ediche video vunte veyyi...adi kuda non-andhrajyothi and non-eenadu video...

anthekani, kandla emana padithe naluputunna screenshot esi chandrigadu edustunadu ani already pichollu aina yellow batch gallani inka fichollani cheyaku

@3$% ABN , eenadu ayithe emayina morphing chestharaa samaraaa...

adhi assembly nunchi live session .. avi kuda nammakapothe ela _%~

Link to comment
Share on other sites

Just now, Navyandhra said:

@3$% ABN , eenadu ayithe emayina morphing chestharaa samaraaa...

adhi assembly nunchi live session .. avi kuda nammakapothe ela _%~

hehe...poi poi evadanna chandriganni nammutada samara ?

 

Link to comment
Share on other sites

I think modi is taking personally ... ekkado edho chedindhi -that we will never know unless years later cbn himself mentions it ( like roshaiah did on tg decision from centre)

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...