Jump to content

జగన్‌పై కేసుల్ని కొట్టేస్తారేమో!


TampaChinnodu

Recommended Posts

జగన్‌పై కేసుల్ని కొట్టేస్తారేమో! 
ప్రధాని కార్యాలయంలో వైకాపా నాయకుల తిష్ఠ 
అందుకే కేసుల్లో ఈ సడలింపులు 
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని ఎంపీలకు సూచన 
కేంద్రం కుతంత్రాల్ని తిప్పికొట్టిన చరిత్ర తమదని వ్యాఖ్య 
ఏపీతో చెలగాటమాడితే పరాభవం తప్పదు: చంద్రబాబు హెచ్చరిక 
ఈనాడు - అమరావతి 
18ap-main1a.jpg

వైకాపా అధ్యక్షుడు జగన్‌ అనుచరులు ప్రధాని కార్యాలయంలోనే ఉంటున్నారని, దానికి బదులుగానే ఆయనపై కేసుల్లో సడలింపులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇదంతా కుట్ర రాజకీయాల్లో భాగమేనని, రేపోమాపో జగన్‌పై ఉన్న కేసులన్నీ కొట్టేస్తారన్న ప్రచారమూ జరుగుతోందని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం తెదేపా ఎంపీలు, శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైకాపాను ఎవరూ నమ్మడం లేదని, అందుకే ఆ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి స్పందన రాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానం పెట్టిన గంటలోనే పలు పార్టీలు సానుకూలంగా స్పందించాయని, జాతీయ స్థాయిలో తెదేపాకు ఉన్న విశ్వసనీయతకు ఇదే నిదర్శనమని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో సోమవారం ఓటింగ్‌కు పట్టుబట్టాలని, డివిజన్‌ అడగాలని సభ్యులకు సూచించారు. ఆరుగురు సభ్యుల ఎంపీల బృందం ఈ రెండు రోజులు దిల్లీలోనే ఉండాలని, అన్ని పార్టీల నేతలనూ వ్యక్తిగతంగా కలవాలని, తెదేపా ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలని సూచించారు. ‘ఇది అత్యంత కీలకమైన సమయం. ఎంపీలంతా మరింత చురుగ్గా, ఉత్సాహంగా పనిచేయాలి. అవిశ్వాసంపై మనం సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నామని, మూడు పార్టీల మహాకుట్రను బయట పెట్టామని ప్రజల్లో చర్చ జరుగుతోంది’ అని తెలిపారు. ‘కేంద్రాన్ని ప్రశ్నించకుండా జగన్‌, పవన్‌ నన్ను విమర్శిస్తున్నారు. ఈ సమయంలో నన్ను బలహీనపరిచి ఎవరికి లాభం చేకూరుస్తున్నారు? దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌వైపే చూస్తోంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రజల గొంతు వినిపించాం. మనకు కావలసింది రాజకీయం కాదు. రాష్ట్రానికి న్యాయమే లక్ష్యం’ అని తెలిపారు. కేసుల మాఫీకే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని, కేంద్ర పెద్దలకు పాదాభివందనాలు, ప్రదక్షిణలు దానిలో భాగమేనని ఆరోపించారు. లోక్‌సభలో అశోక్‌గజపతిరాజు, రాజ్యసభలో వై.ఎస్‌.చౌదరి సమర్థంగా మన వాదన వినిపించారని, ఆ స్ఫూర్తిని కొనసాగించాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని ఆదేశించారు. దిల్లీలో ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిశామని, వారంతా మద్దతు ప్రకటించారని, రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అభిప్రాయపడుతున్నారని తెదేపా లోక్‌సభా పక్ష నేత తోట నరసింహం తెలిపారు. జాతీయ టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చనూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రస్తావించారు. ప్రధాని మోదీని విమర్శించకుండా.. చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు ఆరోపణలు చేశారని ఒక టీవీ యాంకర్‌ పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించగా సమాధానం దాటవేశారని తెలిపారు. లోకేష్‌పై చేసిన ఆరోపణలకు రుజువులు చూపాలని అడిగినా జవాబివ్వలేదని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘ఆరోపణలు చేసిన మర్నాడే వాటి గురించి పవన్‌కల్యాణ్‌ వద్ద విలేకరులు ప్రస్తావించగా... అందరూ అంటున్నారు కాబట్టే తానూ అన్నానని బదులిచ్చారు. గతంలో సాక్షి పత్రికలో వచ్చిన పసలేని ఆరోపణల్నే పవన్‌ చేశారు. ప్రజలు వాటిని గమనిస్తున్నారు’ అని పేర్కొన్నారు. తెదేపా జాతీయ రాజకీయాల్లోకి వస్తోందని, ఫ్రంట్‌ ఏర్పాటుచేస్తోందంటూ జాతీయ ఛానళ్లు సమస్యను పక్కదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నాయని సీఎం రమేష్‌ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ‘రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా.. జాతీయ రాజకీయాలపై మీడియా దృష్టి పెట్టడం సరికాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాతీయ మీడియాలో చర్చ జరిగేలా ఎంపీలు దృష్టి పెట్టాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

ఏపీతో చెలగాటమాడితే పరాభవమే 
ఆంధ్రప్రదేశ్‌తో చెలగాటమాడితే ఎంతటివారికైనా పరాభవం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, అశాస్త్రీయంగా విభజించిన కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. రాష్ట్ర సుస్థిరతను దెబ్బతీయాలని చూస్తున్న శక్తుల ఆటలు సాగనివ్వబోమని ఆయన పేర్కొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ కుట్రల్ని, కుతంత్రాల్ని తిప్పికొట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉందని తెలిపారు. నాడు ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాగ్రహానికి తలవంచి మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపే ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు

Link to comment
Share on other sites

Quote

కేంద్రం కుతంత్రాల్ని తిప్పికొట్టిన చరిత్ర తమదని వ్యాఖ్య 

need more details flease. when where what ?

Link to comment
Share on other sites

A total of 11 cases, as per ED, investments are recorded at 1300 crores which is everything white and taxes are being paid for the returns on the said capital. 

Ippativaraku 3 cases lo acquittal, inkoka 6 cases are of low significance and and pedaga faraq padavu...

migilindi inkoka 3 cases...emaar, sandur power and penna cevents quid pro...vetillo kuda acquittal ae...

TDP power lo vundadam valla at least cases slow ga sagateainaru. Now TDP is nothing and have no power with them. Already result chesusinaru...3 cases lo acquittal...election code vache varaku migita cases kuda acquittal...

ie sangati CBN ki baaga ardam ayipoindi...anduke ie defense games. 

Link to comment
Share on other sites

Aina, laksha kotlu dobbesindu ani roju lolli pette chandrababu ...case file chesindi matram 1300 crores..adi kuda vere vallA paisal...

mari jagan dochukunnA a laksha kotlu emainayi ? 

Link to comment
Share on other sites

Ee pulkas lachha kotlu lacha kotlu antuntaru ga.. so far cbi pettina cases allegationvalue atu itu 1k untadhemo.. remaining 99k crores corruption meedha state CID ki appaginchoxhu kadha .. central tho pani lekunda?? Isn’t that possible ? @psycopk @Android_Halwa @Spartan @tom bhayya - jagananna ni jail lo chudalani undhi

Link to comment
Share on other sites

42 minutes ago, TOM_BHAYYA said:

Ee pulkas lachha kotlu lacha kotlu antuntaru ga.. so far cbi pettina cases allegationvalue atu itu 1k untadhemo.. remaining 99k crores corruption meedha state CID ki appaginchoxhu kadha .. central tho pani lekunda?? Isn’t that possible ? @psycopk @Android_Halwa @Spartan @tom bhayya - jagananna ni jail lo chudalani undhi

vunte kada appaginchanike....jaggadu dochukunna paisal anni safe...smart criminal, okka time stamp ledu, proof ledu..

ipudu pettina cases anni kuda legal ga register chesina vati mida pettinaru cases...anthe kani, asalu paisal eppatiki dorakavu...

1300 crores mida cases...adi kuda jebu lo vesukunnavi kaavu, veedi peru mida vere vallu invest chesinavi in return for the favours granted...case nilabadu, political interference lekapothey kotteyadame cases..

Link to comment
Share on other sites

pulka gallani pilichi endi vaya, edaki poinayi a lachala kotlu ani adigithe....tuesday stories cheptaru...

Infact, Pulkas are actually helping Jagan...public are now fully convinced that jagan amassed one lakh crores....which implies he can spend so much amount on elections and this will influence voters positively....

CBN gadi lachala kotla jagan paisal will eventually misfire by the time of elections.

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

vunte kada appaginchanike....jaggadu dochukunna paisal anni safe...smart criminal, okka time stamp ledu, proof ledu..

ipudu pettina cases anni kuda legal ga register chesina vati mida pettinaru cases...anthe kani, asalu paisal eppatiki dorakavu...

1300 crores mida cases...adi kuda jebu lo vesukunnavi kaavu, veedi peru mida vere vallu invest chesinavi in return for the favours granted...case nilabadu, political interference lekapothey kotteyadame cases..

Kaka India la unnav....manchigaa Ugadi pachadi tini pandaga chesko....time untey recording dance lu soodu

pandaga roju ee case la panchanga sravanam kaikoo....chill ...evadoo bokkalo koosodu...evari tamboolam vallu teesukuntaaru...JD Laxman lekka

Link to comment
Share on other sites

1 hour ago, Raasko said:

Kaka India la unnav....manchigaa Ugadi pachadi tini pandaga chesko....time untey recording dance lu soodu

pandaga roju ee case la panchanga sravanam kaikoo....chill ...evadoo bokkalo koosodu...evari tamboolam vallu teesukuntaaru...JD Laxman lekka

manam eda vunna...mata matram okate

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...