Jump to content

ఐఫోన్‌6ఎస్‌.. ఇక మేడిన్‌ ఇండియా


TampaChinnodu

Recommended Posts

ఐఫోన్‌6ఎస్‌.. ఇక మేడిన్‌ ఇండియా

04153313BRK-APPLE107AA.JPG

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా మొబైల్స్‌ రంగంలో దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీ పెంచడంతో మొబైల్‌ కంపెనీలు భారత్‌లోనే తమ ప్రొడక్టులను ఉత్పత్తి చేసేందుకు మొగ్గు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖ చైనా మొబైల్స్‌ తయారీ సంస్థ షియోమీ మరో మూడు ఉత్పత్తి యూనిట్లను భారత్‌లో నెలకొల్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యాపిల్‌ సంస్థ సైతం తన ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలన్న నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు మరో ముందడుగు వేసింది.

భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్‌ అయిన ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ఫోన్లను భారత్‌లోనే తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా టెస్ట్‌ ప్రొడక్షన్‌ను ప్రారంభించింది. బెంగళూరులోని ఉత్పత్తి కేంద్రంలో కాంట్రాక్ట్‌ మ్యానుఫ్యాక్చరర్‌‌ విస్ట్రోన్‌తో కలిసి టెస్ట్ ప్రొడక్షన్‌ను ఇప్పటికే ఆరంభించిందని.. మరికొద్ది రోజుల్లో కమర్షియల్‌ ప్రొడక్షన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. భారత్‌లోనే తయారీ ప్రారంభించడం వల్ల మొబైల్స్‌ ధరల్లోనూ మార్పు ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

5 నుంచి 7 శాతం దాకా ధర తగ్గే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఇది జరిగితే ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ‘మిడ్‌-బడ్జెట్‌ సెగ్మెంట్’‌ ఫోన్లలో ఓ మంచి ఎంపిక కాగలదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.  అయితే ధరల్లో మార్పులు ఇప్పటికిప్పుడే సాధ్యపడకపోవచ్చని.. అవసరమైన వాటన్నింటినీ భారత్‌లోనే విస్ట్రోన్ సమకూర్చుకునే అవకాశం ఉండదని దీంతో చైనా నుంచి దిగుమతి చేసుకోవడం మరికొన్నాళ్లు తప్పదని పరిశ్రమకు చెందిన ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Just now, iPhoneX said:

6S aa .  @3$%

 

inka nayam 4S cheyyamanu baga ammudupotayi

India lo ave selling anta.

latest models elagu mana NRI theejalu insurance claim sesi pampistharu kada. latest models sell kaavu india lo. 

Link to comment
Share on other sites

7 hours ago, TampaChinnodu said:

India lo ave selling anta.

latest models elagu mana NRI theejalu insurance claim sesi pampistharu kada. latest models sell kaavu india lo. 

nuuvu eanni phones pampinchav eandi ? pfdb_brahmi38.gif?1377272905

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...