Jump to content

Godavari lo boat munigindi- 60 people on board


nenunanu

Recommended Posts

జలసమాధి! 
ఈదురు గాలులకు గోదావరిలో లాంచీ బోల్తా 
బాధితులు తూ.గో. వారు... ప్రమాదం ప.గోదావరిలో 
గల్లంతైన వారి సంఖ్యపై గందరగోళం 
34 మంది గల్లంతయ్యారని అర్ధరాత్రి అధికారుల వెల్లడి 
లాంచీ బయలుదేరవద్దని కాళ్లవేళ్లా పడ్డా వినని సరంగి 
మూడు గదుల్లో చిక్కుకున్న గిరిజనులు 
సిమెంట్‌ బస్తాలే కొంప ముంచాయా? 
న్యూస్‌టుడే - దేవీపట్నం, పోలవరం, ఈనాడు - అమరావతి 
15ap-main3a.jpg

గోదావరిలో మరో పెద్ద ప్రమాదం సంభవించింది. పాపికొండలకు వెళ్తున్న పర్యాటక బోటు అగ్ని ప్రమాదంలో గురైన ఘటన మరవక ముందే తాజా దుర్ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు... పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ బోల్తా పడింది. ఆ సమయంలో తీవ్రమైన ఈదురుగాలులు వీచడంతో ప్రమాదం సంభవించింది.  దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడటంతో 40 మందికి పైగా గల్లంతయ్యారని కొందరు చెబుతుంటే పదిమంది వరకే జలసమాధి అయి ఉంటారని మరికొందరు చెప్పడంతో ప్రమాద తీవ్రత అంచనాలకు అందనిదిగా తయారైంది. ఎన్నో కుటుంబాలను ఆందోళనలోకి నెట్టేసింది. అసలు తమ వారు క్షేమమేనా లేదా అనేది తెలీని స్థితిలో అంతులేని ఆవేదనచెందుతున్నారు. లాంచీలో ప్రయాణిస్తున్న వారు ఇంతమంది అనిగానీ, ఇంతమంది గల్లతయ్యారని గానీ ఎవరి వద్ద స్పష్టమైన సమాచారం లేదు. ఈదురుగాలులు, భారీ వర్షానికి లాంచీలో నింపిన సిమెంట్‌ బస్తాలు తడిసిపోతున్నాయని సిబ్బంది లాంచీ మూడు గదుల తలుపులు వేసేయడంతో  గోదావరిలో లాంచి మునక ప్రమాదంలో తీవ్రత పెరిగింది. లాంచీపైన మరో అంతస్తులా ఉండగా దానిపై టెంట్లు వేసి ప్రయాణికులను కూర్చోబెట్టారు. ఈదురు గాలులకు టెంటుకూడా ఊగిపోయి లాంచీ అదుపు తప్పడానికి అదీ కొంత కారణమైంది. లోపల ఉన్న వారిలో చాలా మందికి ఈత వచ్చినా, లాంచీ తలుపులు మూసివేయడంతో బయటకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. లాంచీలో పిల్లలు, మహిళలు, పెద్దలు సయితం ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని తూర్పుగోదావరి జిల్లా ముంటూరుకు చేరుకున్న ప్రత్యక్ష సాక్షులు దేవీపట్నం ‘న్యూస్‌టుడే’ విలేకరికి ఈ వివరాలు అందించారు. లాంచీ సరంగి (డ్రైవర్‌తో) పాటు సుమారు పదిమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారిలో తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనులే ఎక్కువ మంది ఉన్నారని దేవీపట్నం మండలం కె.కొండూరు, కచ్చులూరు, తాళ్లూరు, కొండమొదలు గ్రామాలకు చెందిన వారని తెలుస్తోంది. వీరంతా వివిధ పనుల నిమిత్తం రంపచోడవరం, దేవీపట్నం ప్రాంతాలకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. కొందరు రంపచోడవరం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం, మరికొందరు ఆధార్‌ సమస్య పరిష్కరించుకునేందుకు, బియ్యం కొనుగోలుకు, ఇంకొందరు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దేవీపట్నం వెళ్లారు. తిరిగి వారి ఊళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన ప్రాంతం రెండు కొండల మధ్య ఉంది. దాదాపు రెండు తాడి చెట్ల లోతులో నీరుంది. ఆ సమయంలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడా ఉంది. ఈ ప్రమాదంలో రాముడు, లక్ష్మణుడు అనే కవలలతో పాటు వారి తల్లిదండ్రులు సయితం గల్లంతయ్యారు.

15ap-main3b.jpg

బయటపడిన వారు... 
ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది బయటపడ్డట్లు సమాచారం అందింది. కొందరు పశ్చిమగోదావరి జిల్లా వైపు చేరగా...మరికొందరు తూర్పుగోదావరి జిల్లా వైపు చేరారు. లాంచీ డ్రైవర్‌ దేవీపట్నం పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతణ్ని పోలీసులు బయట ఎవరికీ అందుబాటులో ఉంచలేదు. ఎవరితోను మాట్లాడకుండా నియంత్రించారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరుకు చెందిన తండ్రీ కొడుకులు వెంకటేశ్వరరావు, పుల్లయ్య, కొండ మొదలు గ్రామానికి చెందిన అశ్విని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బ్యాంకులో రుణంగా తీసుకున్న రూ.లక్ష నగదు సయితం లాంచీలోనే ఉండిపోయిందని పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పట్టం గణేష్‌ తోకల రవిబాబు, తోకల పోశమ్మ, కొణితల చిరంజీవి, ఈళ్ల శిరీషలు తూర్పుగోదావరి వైపు చేరుకున్నారు.

15ap-main3d.jpg

సహాయచర్యలకు ఆటంకాలు.. 
ఈ ప్రమాద ప్రదేశం తూర్పుగోదావరి జిల్లా అటవీప్రాంతంలో ఉంది. సమీప గ్రామమైన మంటూరు సమీపానికి చేరడమే చాలా కష్టంగా ఉంది. ఆ మార్గం ఏ మాత్రం సహకరించడం లేదు. ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ప్రమాద ప్రాంత సమీప గిరిజన గ్రామానికి చేరుకున్నారు. వర్షం కూడా ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు వాతావరణం సహకరించడం లేదు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ప్రమాద ప్రాంతాలకు అటు, ఇటూ చేరుకున్నారు

సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ 
లాంచీ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఘటనా స్థలానికి తరలించే చర్యలు చేపట్టింది. ముందుగా కాకినాడలోని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందానికి చెందిన 60 మంది సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా విజయవాడ, విశాఖపట్నంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను కూడా అక్కడకు తరలించారు. ఒక్కో బృందంలో 35 మంది చొప్పున మొత్తం 70 మందిని సహాయ చర్యల కోసం పంపారు. వీరు రాత్రి వేళల్లోనూ నదిలో ఈదుతూ సహాయ చర్యల్లో పాల్గొంటారు.

లాంచీకి అనుమతి ఉందా..! 
ప్రమాదానికి గురైన లక్ష్మీ వెంకటేశ్వర బోట్‌ సర్వీస్‌కి అనుమతి ఉందా లేదా అనే విషయమై అధికారుల వద్ద స్పష్టత లేదు. జలవనరుల ఉన్నతాధికారులు తాము అన్ని బోట్లకు అనుమతులు రద్దు చేశామని స్థానిక అధికారులు ఏమైనా ఇచ్చారేమో తెలియదని అంటున్నారు. పోర్టు అధికారులు కూడా ఇదే తరహాలో చెబుతున్నారు. ప్రస్తుతం తామేమీ అనుమతులివ్వలేదని పేర్కొన్నారు.


గల్లంతైన వారి సంఖ్యపై భిన్న కథనాలు!

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: గోదావరిలో మంగళవారం సాయంత్రం లాంచి బోల్తా ప్రమాదంలో గల్లంతైన వారి అంకెపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ అంకె 10 నుంచి 40 వరకు ఉంది. లాంచీలో బయలుదేరిన వారి సంఖ్యపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పడవలో 25 మంది మాత్రమే బయలుదేరారని కొందరు దిగిపోయారని, మరో 10 మంది వరకు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని ఇక పడవలో 10 మంది మాత్రమే ఉండిపోయారని లాంచీ డ్రైవర్‌ చెబుతున్నాడు. ప్రత్యక్ష సాక్షులు కొందరు ఈ వాదనతో విభేదిస్తున్నారు. కొండమొదలు నుంచి 25 మందితో బయలుదేరినా సాయంత్రం దేవీపట్నం నుంచి తిరుగు ప్రయాణంలో 50 మంది వరకు లాంచీలో ఎక్కారని చెబుతున్నారు. పడవ ప్రమాద సమయంలో 10 మంది వరకు తప్పించుకున్నారని దాదాపు 40 మంది తలుపులు మూసేసిన లాంచీలో ఉండిపోయరాని చెబుతున్నారు. వారు గల్లంతయ్యారని వివరిస్తున్నారు. ఈ సంఘటనలో 34 మంది గల్లంతయ్యారని 16మంది ఒడ్డుకు వచ్చారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మంగళవారం అర్ధరాత్రి  తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌, ఎస్పీ రవిప్రకాష్‌లు ప్రమాద ప్రాంతానికి చేరుకున్నారు. కలెక్టర్‌ భాస్కర్‌ ప్రత్యక్ష సాక్షులు తమకు తెలిపిన వివరాల ప్రకారం లాంచీలో ఇంకా 30 మంది వరకు గల్లంతయ్యారని చెబుతున్నట్లు ‘ఈనాడు’కు వివరించారు. దీంతో అసలు ప్రమాద బాధితులు, గల్లంతైన వారు, బతికి బయటపడ్డ వారి వివరాలు బుధవారమే స్పష్టంగా వెలుగులోకి రానున్నాయి.



ఉదయం 7 గంటలకు కొండమొదలులో ప్రారంభం... 
దేవీపట్నం, న్యూస్‌టుడే: దేవీపట్నం మండలం కొండమొదలు తదితర గ్రామాల వారు మంగళవారం ఉదయమే 7 గంటలకు వివిధ పనులపై కొండమొదలు నుంచి లాంచీలో బయలుదేరారు. 10.30 గంటలకు దేవీపట్నం చేరుకున్నారు. వీరంతా వేర్వేరు చోట్ల తమ పనులన్నీ ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దేవీపట్నం చేరుకున్నారు. దేవీపట్నం పోలీసుస్టేషన్‌ వద్ద కొంత సేపు ఆగి తర్వాత బయల్దేరింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది.

15ap-main3c.jpg

ప్రమాద ప్రాంతాన్ని గుర్తించాం 
- పశ్చిమగోదావరి అధికారుల వెల్లడి 
ఈనాడు డిజిటల్‌-ఏలూరు: గోదావరిలో పడవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌, ఎస్పీ రవిప్రకాష్‌లు మంగళవారం రాత్రి ఈనాడుతో చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలకు మధ్యలో ఈ ప్రాంతం ఉందన్నారు. కొక్కేలతో ఆ పడవను గుర్తించామని ఎస్పీ వివరించారు. ప్రమాద ప్రాంతానికి రోడ్డు అనుసంధానం పశ్చిమగోదావరి వైపు ఉన్నందున ఇటు నుంచే సహాయ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి జనరేటర్లు, లైట్లు తీసుకువెళ్తున్నామని అధికారులు వివరించారు. కలెక్టర్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ఈదురుగాలుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈదురుగాలుల సమాచారం వచ్చే సరికి లాంచీ లోపలికి వెళ్లిపోయిందని ఆ సమాచారం వారికి అందించే అవకాశం లేకుపోయిందని వివరించారు.

రక్షణ చర్యల్లో పాల్గొనండి: జగన్‌ 
ఈనాడు అమరావతి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు వద్ద మంగళవారం జరిగిన పడవ ప్రమాదంపై వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితుల రక్షణ చర్యల్లో వెంటనే పాల్గొనాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోడానికి సీనియర్‌ నాయకులతో కమిటీని నియమించారు. బాధితులకు అండగా నిలిచేలా శ్రేణుల్ని సమాయత్తం చేసే బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వం తరఫున సత్వర సాయం అందేలా చూడాలని చెప్పారు.

Link to comment
Share on other sites

లాంచీ ప్రమాదంలో 22మంది మృతి 
16break100a.jpg

రాజమహేంద్రవరం: గోదావరిలో లాంచీ మునక పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 22 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 12 మంది మృతదేహాలను వెలికి తీయగా .. మరో 10 మృతదేహాల కోసం నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. లాంచీలో ఉన్న తమవారి ఆచూకీ కోసం నిన్నటి నుంచి ఎదురుచూసిన స్థానికులు మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.అక్కడే పోస్టుమార్టం చేసి స్వస్థలాలకు తరలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ప్రమాదం జరగ్గా.. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. లాంచీ నదిలో 45 అడుగుల లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది నదిలో గాలించి లాంచీని గుర్తించారు. అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. లాంచీ తలుపులు తెరచుకోలేదు. ఫలితంగా తాళ్లు కట్టి ఇతర బోట్లు, క్రేన్ల సాయంతో బోటును బయటకు లాగారు.

మధ్యాహ్నం నుంచీ ఘటనా స్థలంలోనే సీఎం 
ఘటనా స్థలానికి స్వయంగా వెళ్లిన సీఎం చంద్రబాబు మృతదేహాల వెలికితీతను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది మొత్తం 126 మంది సహాయక చర్యలు చేపట్టారని ముఖ్యమంత్రి వెల్లడించారు. నిన్న రాత్రి సమయంలో చీకటి నెలకొనడంతో ఏమీ చేయలేకపోయారన్నారు. ఈ ఉదయం నుంచి ఆపరేషన్‌ ఉద్ధృతం చేసి చేసి అన్నివిధాలా ప్రయత్నం చేసి ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఆ బాధిత కుటుంబ సభ్యుల్ని చూస్తుంటే బాధేస్తోందని సీఎం అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. బోటు నిర్వాహకుల తప్పిదం వల్లే ఈ ఘోరం చోటుచేసుకుందని సీఎం అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి వద్ద లాంచీ ప్రమాదానికి గురికావడంతో ఘోర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

21 hours ago, futureofandhra said:

Thanks cbn for leaving gov employees for corruption

For power this is disgrace 

I hate to see this 

For God sake stop corruption in safety related things 

Worls class raajadhani tarvatha kaka mundu janalu vaalla life gurinchi alochinchamanu..Okasari jarigithe porapatu ika ade malli malli ade jarigithe yemanalo mee chanakya ke vadilesthunnam.};_

Link to comment
Share on other sites

On 5/15/2018 at 9:11 AM, SeemaLekka said:

erri p news channels chupinchatledu mari

TV9 bhairava gadu adhe pani ga graphics visualization tho chupinchadu ga..,ela sink ayyindho..,

Link to comment
Share on other sites

20 minutes ago, reality said:

TV9 bhairava gadu adhe pani ga graphics visualization tho chupinchadu ga..,ela sink ayyindho..,

ninna thread padinapudu open chesa new channels annitlo KA solle aa time lo

Link to comment
Share on other sites

2 hours ago, argadorn said:

life jackets vesukoney undlai ani rules pettali .....appudu gani mana india lo kastam 

 over crowd ekkodhu ra antene vinadam la life jackets ante inka ardam chesko 

Link to comment
Share on other sites

58 minutes ago, SeemaLekka said:

 over crowd ekkodhu ra antene vinadam la life jackets ante inka ardam chesko 

urgent ga vellalayya memu. avathala 10c deal meeda sign chestunam.

Link to comment
Share on other sites

5 hours ago, SeemaLekka said:

 over crowd ekkodhu ra antene vinadam la life jackets ante inka ardam chesko 

Sendral sir state motham world class level lo roads vepinchina kooda ee pichi public boats lo enduku velthunnaru , So public mistake ee idi ani @psycopk briefed

Link to comment
Share on other sites

On 5/15/2018 at 7:11 AM, SeemaLekka said:

erri p news channels chupinchatledu mari

yellow media enduku spupistar sri reddy vi katti gadivi ite supistar

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...