Sign in to follow this  
AdaraboinaShrikanth

Karnataka Polls: BJP Shocks to Congress,JD(S) Parties,కాంగ్రెస్,జెడి(యస్) లకు షాకిచ్చిన బిజెపి

Recommended Posts

AdaraboinaShrikanth

 

కర్ణాటక ఎన్నికల ఫలితాలలో వచ్చిన అనిశ్చితి, అక్కడ పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, కాంగ్రెస్ జేడీఎస్ శిబిరాలలో ఆందోళన  రేపుతోంది. 104 సీట్లతో అగ్రస్థానాన ఉన్న బీజేపీకి , అధికార పీఠం ఎక్కడానికి సరిపడా బలం లేకపోవడంతో, ఇతర పార్టీల వారికి గాలం వేస్తుంది. దీంతో తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, కాంగ్రెస్, జేడీఎస్ లు తంటాలు పడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ శాసనసభా పక్ష నేతగా, యడ్యూరప్ప ఎన్నికయ్యారు. బలం నిరూపించుకునేందుకు, గవర్నర్ వారికి ఏడు రోజుల సమయం కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో, ఈ రోజు, జేడీఎస్ శాసనసభా పక్షం సమావేశం అయింది. అయితే ఈ సమావేశానికి జేడీఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ పార్టీకి చెందిన రాజా వెంకటప్ప నాయక్, వెంకట రావు గౌడలు కనిపించకుండాపోయారు. ఇప్పటికే జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి, కుమారస్వామికి, ఆయన తమ్ముడు  రేవణ్ణ, పక్కలో బల్లెంలా తయారయ్యాడు. ఆయన బీజేపీకి మద్దతు ఇస్తారని,అందుకు  ఆయనకు బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవి అఫర్ చేసిందని తెలుస్తుంది. ఈ పరిస్థితులలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాకపోవడం జేడీఎస్ శిబిరంలో ఆందోళన రేపుతోంది.

బీజేపీ అధికారంలోకి రాకుడదన్న  లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు సంపూర్ణ మద్దతు తెలిపింది. అయితే ఒక్కళిగ వర్గానికి చెందిన, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేందుకు, ఎంత మాత్రం ఒప్పుకోమని, కాంగ్రెస్ లోని లింగాయత్ ఎమ్మెల్యేలు అంటున్నారు. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించిన నేపథ్యంలో, తమ తమ పార్టీలలోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ,కాంగ్రెస్ జేడీఎస్ లకు కత్తి మీద సాములా మారింది. ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేది తెల్సుకోవాలంటే మరి కొన్ని  రోజులు ఆగాల్సిందే 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this