Jump to content

కొడుకు ఫెయిల్‌..పార్టీ ఇచ్చిన తండ్రి!


JANASENA

Recommended Posts

భోపాల్‌: పరీక్షల్లో తమ పిల్లలు ఉత్తీర్ణులైతే చుట్టుపక్కల వాళ్లని, బంధువులను ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చే తల్లిదండ్రులను చూశాం. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ తండ్రి తన కుమారుడు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు పార్టీ ఇచ్చాడు. ఆ తండ్రి అలా చేయడానికీ ఓ కారణం ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భోపాల్‌కు చెందిన సురేంద్ర కుమార్ కుమారుడు అశు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాడు.

అందుకు ఆయన తన కుమారుడిని తిట్టి, కొట్టకుండా వినూత్నంగా ఇంటి ముందు టెంటు వేసి ఘనంగా పార్టీ ఇచ్చాడు. స్నేహితులు, బంధువులను పిలిపించి స్వీట్లు పంచి వారితో కలిసి టపాసులు పేల్చాడు. ఈ విషయం స్థానిక మీడియా వర్గాలకు తెలియడంతో వారంతా సురేంద్ర ఇంటికి పరుగులు తీశారు. కొడుకు ఫెయిల్‌ అయితే పార్టీ ఎందుకు ఇస్తున్నారు? అని అడిగితే..‘ఫలితాలు అంత ముఖ్యం కాదు. మా అబ్బాయి చదవనందుకు ఫెయిల్‌ అవ్వలేదు. వాడు చాలా కష్టపడ్డాడు. పరీక్షలకు మించి జీవితంలో ఇంకా ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. వాడు ఫెయిల్‌ అయ్యాడని నేను కొడితే అది మనసులో పెట్టుకుని ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే తట్టుకోలేను. దాని బదులు ఇలా పార్టీ ఇచ్చి వాడిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నా. ఈ మధ్యకాలంలో పిల్లలు పరీక్షల్లో ఫెయిల్‌ అయితే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మొన్న జరిగిన బోర్డు పరీక్షలే ఆఖరి పరీక్షలు అనుకోవద్దు. అంతకంటే జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది. మా అబ్బాయి ఈ ఏడాది ఫెయిల్‌ అయ్యాడు. వచ్చే ఏడాది ఉత్తీర్ణుడవుతాడు.’

సురేంద్ర కుమార్ భోపాల్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమారుడి విషయంలో అతను తీసుకున్న వినూత్న నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తున్నారు. ఈ సందర్భంగా సురేంద్ర కుమారుడు అశు మాట్లాడుతూ..‘నన్ను ఏమీ అననందుకు మా నాన్నకు కృతజ్ఞతలు. వచ్చే ఏడాది బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని నాన్నకు మాటిస్తున్నాను.’ అని పేర్కొన్నాడు.

Link to comment
Share on other sites

Throwing a party on getting good results is the norm. But a father in Madhya Pradesh had other ideas. A father threw a lavish party after his son failed in the board exams.

8ff82876-2dd1-4cd7-8fc1-3fa76324e979.jpg Source: Indian Express
 

According to report by the TOI, a man from Sagar, Madhya Pradesh, held an impromptu party after his son, Ashu failed in Class 10 board examination, the results of which were announced on Monday.

The celebration had everything from firecrackers and sweets to a shamiyana and friends and neighbours came in large numbers to attend this odd celebration.

 
3bca2ba3-3669-412a-addb-ab34daf70853.jpg Source: Indiamart

Surendra Kumar Vyas, a civil contractor, expressed his intention behind throwing this party was to motivate his son. 

After failing in exams, children go into depression and some of them even take the extreme step of ending their lives. I want to tell such children that boards are not the last exams. There is much more to come in life. My son can reappear in the exam again next year.
8c254909-d6ed-49d3-8639-21ff666a9bad.jpg Source: Gofood

Not many parents think like that and this outlook of his father has had a positive impact on Ashu.

I appreciate my father. I promise to study more in the next academic session to pass with excellent marks.

Hope this incident gives a message to many other parents as several students await their results this month.

Link to comment
Share on other sites

masth pani chesadu kani mari party ichudu too much... vadini deggera kurchobetti explain chesthe saripoyedi... publiclo yedavani chesindu anipinchindi...

Link to comment
Share on other sites

He did good thing it’s a eye opener for many students ee vidanga sensation create cheste padi mandi pillalaki reach aindi. Intlo kusoni chepte aa abbai ki okkanike gnanam vastadi ila cheste urantha desham antha telisindi. Good job sir

Link to comment
Share on other sites

52 minutes ago, Ara_Tenkai said:

masth pani chesadu kani mari party ichudu too much... vadini deggera kurchobetti explain chesthe saripoyedi... publiclo yedavani chesindu anipinchindi...

adey chesadu.. media ki cover drive ichadu... 

nobody want to celebrate failures that too with outsiders... 

intlo vallu/ sontha valla odarpu is more than enough than this BS 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Ara_Tenkai said:

masth pani chesadu kani mari party ichudu too much... vadini deggera kurchobetti explain chesthe saripoyedi... publiclo yedavani chesindu anipinchindi...

exactly @3$%

 

Link to comment
Share on other sites

naku edo movie lo scene gurthochindi 

jagapathi babu kota srinivasa rao untaru dantlo..... fail ayyadu ani andariki teliyali apppudina siggostadi ani party istadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...