Jump to content

NITI Aayog Meet: Chandrababu Rises Revenue Deficit, Polavaram Issues


psycopk

Recommended Posts

 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఎదుట ఏపీ సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. నీతి అయోగ్ సమావేశం ప్రారంభంలోనే చంద్రబాబు తాను చెప్పాల్సింది చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెల్చిచెప్పారు. సమావేశం ప్రారంభమయ్యాక చంద్రబాబు 13 పేజీల ప్రసంగాన్ని 20 నిముషాలపాటు ప్రస్తావించారు. నీతిఅయోగ్ అంశాలపై ప్రస్తావనకు ముందే ఏపీ విభజన హామీల అమలులో కేంద్రం తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజనను కోరుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాల్సిన నిధుల గురించి ఆయన మాట్లాడారు. విభజనతో ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, కానీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. విభజనతో ఆర్థికంగా ఏపీ నష్టపోయిందని, రెవెన్యూలోటును భర్తీ చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

ముఖ్యమంత్రులకు 7 నిముషాల సమయం కేటాయించినప్పటికీ... ఏపీ ప్రత్యేక రాష్ట్రమని, విభజన జరిగిన తర్వాత ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, కాబట్టి తన స్పీచ్‌ను ప్రత్యేకంగా చూడాలంటూ సుమారు 20 నిముసాల పాటు చంద్రబాబు ప్రసంగించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తదితర వాటిపై ఆయన ప్రసంగించారు. ఈ అంశాలను బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని, తర్వాత ఫైనాన్స్ కమిషన్ సాక్‌గా చూపించి హోదా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్రానికి హోదా ఎందుకు అవసరమన్నది కూడా చంద్రబాబు వివరించారు. వెనుకబడిన 7 జిల్లాలకు ఇస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని, ఎక్కువ చేయాలని కోరారు. రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నారు. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన నిధులు త్వరగా విడుదల చేస్తే వాటి నిర్మాణాలు పూర్తి అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, సీట్ల పెంపు విషయాన్ని కూడా ఈ సందర్బంగా చంద్రబాబు ప్రస్తావించారు. స్టీల్ ఫాంట్, వైజాగ్-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, విశాఖ, విజయవాడ మెట్రోరైల్, పోర్టు వీటన్నిటితోపాటు 1971ని ఆధారంగా చేసుకుని నిధులు ఇవ్వాలన్నారు.

 

నిధుల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని, పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశమంతటా వ్యాపించిందని, చిరు వ్యాపారులు, రైతులు ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీలైన రాజ్‌నాథ్ సింగ్ సమయాభావంవల్ల ప్రసంగాన్ని ముగించాల్సింగా చంద్రబాబును కోరారు. అయినా అదేమీ సీఎం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొత్తం 35 పాయింట్లపై చంద్రబాబు మాట్లాడారు. తర్వాత ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు.

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

 

Hoda ye sanjivani kadhu. Hoda vaste ani ayipotaya. Hoda vachina states develop kaledhe ani Chepina nakka video veyyi Bro. Modi anni vintunnadu. After 2019 elections Cbi will look into note ki vote

Link to comment
Share on other sites

3 minutes ago, kingcasanova said:

vaadi mundu alaa bend avvadam endi raaa pichi flowers, vennu poosa nilavadaaa?kingcasanova

Vennu Posa unte vennupotu ani chadiva

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...