Jump to content

చకచకా పావులు కదుపుతున్న తెదేపా!

Hitman

Recommended Posts

అమరావతి: హస్తినలో జరుగుతున్న పరిణామాలను తెదేపా అధిష్ఠానం నిశితంగా గమనిస్తోంది. అగ్రనేతలు ఎంపీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. అవిశ్వాసంపై చర్చకు స్పీకర్‌ ఆమోదం తెలపడంతో చకచకా పావులు కదపాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యతిరేకుల మద్దతు కూడగట్టేలా మరింత దూకుడుగా వెళ్లాలని అనుకుంటున్నారు. ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై సమగ్ర సమాచారాన్ని ఎంపీలకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వ పెద్దలను ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు తెదేపా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు పార్టీ ఎంపీలతో మాట్లాడారు. ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం సభలో జరిగిన పరిణామాలను అశోక్‌గజపతి రాజు సీఎంకు ఫోన్‌లో వివరించారు.

తాజాగా, తెదేపా ఇచ్చిన అవిశ్వాస నోటీసు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పరిగణనలోకి తీసుకోవడం, ఎల్లుండి దీనిపై చర్చ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఫోకస్‌ కావాలనే దానిపైనే ప్రధానంగా తెదేపా దృష్టి సారించింది. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏ విధంగా మోసం చేసింది? హోదాతో పాటు అపరిష్కృతంగా ఉన్న 18 అంశాలను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చోపచర్చలు సాగుతున్నట్టు సమాచారం. దిల్లీలో ఉన్న నేతలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. భాజపాను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాలను లేవనెత్తుతూనే రాష్ట్రానికి భాజపా అన్యాయం చేసిందనే అంశాన్ని ఫోకస్‌ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. రేపు కూడా సీఎం చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

37 minutes ago, Hitman said:

0cd2ae6d47525c61e6708f54487e4445--clean-

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...