Jump to content

శ్రీరాముని ఆదర్శవర్తనం


Crazy_Robert

Recommended Posts

10 minutes ago, Crazy_Robert said:

*శ్రీరాముని ఆదర్శవర్తనం*
తప్పక చదవవలసిన వ్యాసం.

రామరావణయుద్ధం ముగిసింది. రావణుని మరణవార్తను విన్న మండోదరి రణక్షేత్రానికి పరుగు తీసింది. రావణుడు మరణించడం, మానవుడైన రాముడు గెలవడం ఆమెకు నమ్మలేని సత్యమైంది. ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్టులు. 
దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచిన మహావీరుడు. 
అల్పులైన మానవులు గెలవడం ఎలా సంభవం. సత్యమైనా జీర్ణించుకునే మానసికస్థైర్యం లేని స్థితి ఆమెది.

మండోదరి విడి పోయిన కొప్పు ముడితో సరైన వస్త్రధారణ లేక శోకిస్తూ పరుగు పరుగున వస్తుంది. మనసులో రాముని మీద కోపం, రాముని నిందించాలనే ఆత్రుత.  రాముడిని ఇదివరకు తాను చూడలేదు. అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. అతనిపై ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. ఆవేదనతో కూడిన ఉక్రోషం ఉంది. రాముడు కూడా ఇదివరకు ఆమెను చూడలేదు. 

రావణవధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం చాలించి యుధ్ధభూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా 
ఒక బండరాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడంవల్ల తన నీడ దూరంగా పడుతున్నది. 
దూరం నుండి వస్తున్న మండోదరి యొక్క నీడ కూడా దూరం నుండి కనిపించిందతనికి. 
ఎవరో తెలియదు కాని నీడను చూస్తే 
ఆ ఆకారం స్త్రీమూర్తిదని అతని కర్ధమైంది. దగ్గరగా వచ్చే *ఆ స్త్రీమూర్తి నీడ తన నీడను తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు*.

ఆ సన్నివేశాన్ని చూచిన మండోదరి అంతటి దుఃఖసమయంలో కూడా అతని చర్యను *వివేకంతో గమనించింది*. 
అతని వ్యక్తిత్వవిలువలు ఎంత గొప్పవో గ్రహించింది. *తన నీడ కూడా పరాయి స్త్రీపై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది.* వెంటనే రామునిపై తనకున్న క్రోధం ఆమెలో మాయమైంది. 

 యుధ్దంలో శత్రువును జయించామా లేదా అన్నది కాదు ప్రశ్న. 
జయం అపజయం శాశ్వతం కావు. *విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వవికాసం మాత్రమే.* 
డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్ని అహంకారపూరితమైనవి, వ్యక్తుల నుండి విడదీసేవి.
*మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం* 

అధమాః ధనమిచ్ఛంతి,
ధనం మానంచ మధ్యమాః
ఉత్తామాః మానమిచ్ఛంతి
మానోహి మహాతాం ధనం!

*ధనం కోసం ఏమయినా చేసేందుకు వెనుకాడనివారు, 
*ధనం మానం రెంటికై యత్నించేవారు, 
*మానం కోసమే జీవించేవారు 
*ఈ మూడు రకాలయిన వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తారు. 
*మొదటి రకం అధములు.
*రెండవ రకం మధ్యములు. 
*మూడవ రకం ఉత్తములు 

ఎలాగైనా గెలుపే పరమావధి అనుకోవడం *Result oriented attitude*. 
ధర్మ బధ్దమైన రీతిలో విజయం పొందాలనుకోవడం *Process oriented attitude.*
గెలుపు ఇతరులపై సాధించేది కాగా *విజయం అందరి భాగస్వామ్యంతో పొందేది.*
*గెలుపులో అసూయ ఉంటుంది, అభద్రత ఉంటుంది. 
*విజయంలో శాంతి ఉంటుంది, సౌమనస్యత ఉంటుంది*. 
ఇదే రామాయణం మనకు బోధించే నీతి.

whatsapp lo forward message 

segatry, good post...thanks

Link to comment
Share on other sites

13 minutes ago, Amrita said:

Enduku thammi ila posts estav...evaro vachi ramudini ramayanam ni tidataru and comment chestaru badhestundi $s@d

jai sri ram ..... we all love ramudu & rgv

Link to comment
Share on other sites

Just now, WHAT said:

jai sri ram ..... we all love ramudu & rgv

achinava.. mana gurinche antunnaru so ilanti threads lo inka fingering vaddu valla prapancham valladi..andulo manaku place ledu..

Link to comment
Share on other sites

4 minutes ago, WHAT said:

jai sri ram ..... we all love ramudu & rgv

 

1 minute ago, Demigod said:

achinava.. mana gurinche antunnaru so ilanti threads lo inka fingering vaddu valla prapancham valladi..andulo manaku place ledu..

*n$

Link to comment
Share on other sites

2 minutes ago, Demigod said:

achinava.. mana gurinche antunnaru so ilanti threads lo inka fingering vaddu valla prapancham valladi..andulo manaku place ledu..

no pingering .... jai sri ram 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...