Jump to content

హెచ్‌-1 బీ వీసాకు దెబ్బ అమెరికా మాస్టర్స్‌కే స్వాగతం!


lapakilotupaki

Recommended Posts

Opt లకు మంచి వార్త 

 

 

 

636756899805548244.jpg
  •  బ్యాచిలర్‌ టెక్‌ కోర్సులతో ఉద్యోగం ఇక కష్టం
  •  హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ దశలోనే వడపోత
వాషింగ్టన్‌, అక్టోబరు 20: భారత టెక్‌ కంపెనీలను పూర్తిగా దెబ్బతీసే చర్యలకు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. ఇకపై హెచ్‌-1బీ వీసాల జారీలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో లేదా ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ చేసిన విదేశీయులకే ఎక్కువ సంఖ్యలో పర్మిట్లు (వీసాలు) ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇన్నాళ్లూ భారతీయ టెక్‌ కంపెనీలు ఎక్కువగా బ్యాచిలర్‌ కోర్సులు చేసిన టెక్‌ యువతకే ఉద్యోగావకాశాలు కల్పిస్తూ వారికే హెచ్‌-1బీ వీసాలను ప్రతిపాదించేవి. ఇక మాస్టర్స్‌ను తప్పనిసరి చేస్తూ బిల్లులో ప్రతిపాదన చేరిస్తే హెచ్‌-1బీ నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల సంఖ్య తగ్గుతుందని, తద్వారా అమెరికన్లకు ఆ ఉద్యోగాలు లభిస్తాయని ట్రంప్‌ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అమెరికా సాధారణ సేవల పాలనా విభాగం ఓ అంతర్గత నోట్‌లో తాజా మార్పుల్ని వెల్లడించింది. ‘‘ఇన్నాళ్లూ మొదట మాస్టర్స్‌ చేసిన వారికి జారీ చేసే 20వేల వీసాల దరఖాస్తులను ప్రాసెస్‌ చేసి అందులో మిగిలిన వారిని 65,000 సాధారణ వీసాల సంచయంలో కలిపేవారు.
 
ఇక మీదట అలా కాదు... మొత్తం అందరినీ 65,000 వీసాల లిస్టులో కలిపేసి, ఆ పరిమితి నిండాక ఎవరైనా మిగిలితే వారిని 20వేల సంచయంలో కలుపుతారు. . అంటే... రెండు సంచయాల్లోనూ ఎక్కువగా మాస్టర్స్‌ హోల్డర్లకే ప్రాధాన్యం. దీని వల్ల అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో టెక్‌ కోర్సులు చేసి హెచ్‌-1బీ వీసా పొందే వారి సంఖ్య కనీసం 15 శాతం పెరుగుతుంది. ఇది కంపెనీల్లో నిపుణుల సంఖ్య పెరగడానికి దోహదపడి చివరకు దేశ ఆర్థికవ్యవస్థకు లాభిస్తుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది’’ అని హోంల్యాండ్‌ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. 2018లో హెచ్‌-1బీ వీసాలు పొందినవారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. అక్టోబరు 5 నాటికి జారీ అయిన ప్రతి నాలుగు హెచ్‌-1బీ వీసాల్లో మూడు భారతీయులే పొందారు. 4,19,637 హెచ్‌-1బీ వీసాదారుల్లో 3,09,986 మంది భారతీయులే ఉన్నారు.
Link to comment
Share on other sites

dheeni moolam gaa kooda manake kadha advantage....masters chesi H1 visa apply chestollalo mana valle 95% untaru.....India nunchi direct H1 pettukoni vacchetollni mathrame filter cheyyatam valla emi sadhisthunnaru? assala emi cheyyalani veedi prayatnam?

anywayz...MS chesinollaki plus ye...

Link to comment
Share on other sites

Judgements pass chesestunaru

evado oka panikimalina third class telugu reporter gadu vadiki vunna sagam dhamak petti chetta raasthe, adi sadivi...public ikada wah re wah ani feel ayitunaru

vaarthalu sadivithe saripodu ra ayya...a information source kuda chusi savandi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...