Jump to content

జల్‌పల్లి మామిడితోటలో రేవ్‌ పార్టీ 


kakatiya

Recommended Posts

 

అర్ధనగ్నంగా యువతుల నృత్యాలు 
పోలీసుల దాడి.. నలుగురు పురుషులు, 
ఐదుగురు యువతులు అరెస్టు 

hyd-brk2a_35.jpg

మీర్‌పేట, న్యూస్‌టుడే: అర్ధరాత్రి నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేసి నలుగురు యువకులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్న సంఘటన పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ ఠాణాలో ఆదివారం వివరాలు తెలిపారు. హమీద్‌ఖాన్‌ అనే వ్యక్తి జల్‌పల్లి పురపాలిక సమీపంలోని తన మామిడితోటలో గల ఫామ్‌హౌజ్‌లో తన పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీకి తన మిత్రులను ఆహ్వానించి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందుకుగాను ఈవెంట్‌ ఆర్గనైజర్‌, నర్తకి, గాయని దీపాశెట్టిని సంప్రదించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో బెల్లీ డ్యాన్స్‌ చేయడానికి మరో నలుగురు డ్యాన్సర్లను తీసుకురావాలని దీపాశెట్టిని కోరారు. డ్యాన్స్‌తో పాటు వ్యభిచారం చేయాలని కోరారు. ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున చెల్లిస్తామని మాట్లాడుకున్నారు. దీపాశెట్టి మరో నలుగురు యువతులను తన వెంట తీసుకొని సికింద్రాబాద్‌ నుంచి హమీద్‌ఖాన్‌ ఏర్పాటు చేసిన ఇన్నోవా (12జి 5890) కారులో జల్‌పల్లిలోని మామిడి తోటకు వచ్చారు. రాత్రి ఒంటి గంట సమయంలో సౌండ్‌ బాక్సులు ఏర్పాటు చేసుకొని పెద్ద శబ్దంతో ఫామ్‌హౌజ్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పహాడీషరీఫ్‌ ఏఎస్సై ఎం.నందగోపాల్‌ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. గమనించి పరిశీలించగా అక్కడ జరుగుతున్న తంతు వారి కంటపడింది. అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న దీపాశెట్టితోపాటు నలుగురు యువతులను, హమీద్‌ఖాన్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులను ఠాణాకు తరలించారు. యువతులను తుక్కుగూడలోని ప్రజావాలా హోమ్‌కు తరలించారు. నిందితులను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై జి.శ్రీశైలం ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసినట్లు ఏసీపీ వివరించారు

Link to comment
Share on other sites

Chandranna nirminchina hyd ni cheda mingaru kadha raa chavatallara? 

Chee ... mee bathukucheda 

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, sattipandu said:

damn deniki

akkada ACP strict aaaa???

Aa station anthe

Night unte matram chukkale

Night evado vastadu addamaina tittlu tidutadu

Tarvata koddi sepatiki inkodu vastadu nalugu tanni potadu ala ala iathe ne untadi

Intlo pella la medha kopam ikkada chupistaru emo

Madhi oka case iathe IG tho phone cheyinchina kavali ani late chesi mari afternoon 3 ki court lo produce chesaru

Edo gatti recommendations valla okka debba padakunda bayata paddam

 

Link to comment
Share on other sites

5 minutes ago, Smallpappu said:

Aa station anthe

Night unte matram chukkale

Night evado vastadu addamaina tittlu tidutadu

Tarvata koddi sepatiki inkodu vastadu nalugu tanni potadu ala ala iathe ne untadi

Intlo pella la medha kopam ikkada chupistaru emo

Madhi oka case iathe IG tho phone cheyinchina kavali ani late chesi mari afternoon 3 ki court lo produce chesaru

Edo gatti recommendations valla okka debba padakunda bayata paddam

 

damn  by god's grace no PS visits till now 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...