dweeliph Posted January 4, 2019 Report Share Posted January 4, 2019 Tweet మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డులతో దుమ్ము దుమారం చేసే విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా రంగస్థలం. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డులను తిరగరాసిన ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. 100 రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కుమ్మేసిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ 18 న నుండి సందడి చేయడానికి సిద్ధం అవుతుంది. ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల సమాచారం ప్రకారం ఈ సినిమా 18 న భారీ గా సుమారు 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అదెక్కడో తెలుసా…మలయాళంలో సినిమా ఈ నెల 18 న రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ పనులను పూర్తీ చేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి సినిమాల జోరు తగ్గగానే అక్కడ పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయబోతున్నారట. డేట్ చివరి నిమిషంలో మారే అవకాశం ఉన్నా కానీ ఈ సారి పక్కాగా అక్కడ అదే డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి. https://t2blive.com/rangasthalam-again-in-200-theaters-18th/ Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.