Jump to content

Papam e family

Athadu007

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=697896

  • కుమార్తె కళ్ల ఎదుటే మృతి
  • రోడ్డు ప్రమాదంలో కబళించిన మృత్యువు
  • మృతుడు నిరుపేద న్యాయవాది
  • శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటూనే పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసం
  • కేసులు వస్తేనే భోజనం చేసేది..
ఆయన నిరుపేద న్యాయవాది.. ఇద్దరు కుమార్తెలు.. ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు. శిథిలావస్థలో రేకులు ఊడిపోయి సగం కూలిన గోడల ఇంట్లో నివసిస్తున్నారు. కేసులు వస్తేనే ఆ రోజు పూటగడవడానికి బియ్యం తెచ్చుకుని ఇంట్లో భోజనం చేస్తారు. తాను అనుభవిస్తున్న దుర్భర జీవితాన్ని తన పిల్లలు అనుభవించవద్దని వారిని ఇంజనీరింగ్‌ చదివిస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే చిన్నకూతురును కాలేజీకి తన పురాతన స్కూటర్‌పై తీసుకువెళ్తున్నాడు. ఈ సమయంలో ఎదురుగా మృత్యురూపంలో వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. తన తండ్రి మృతిచెందిన విషయం తెలియక ‘‘నాన్నా కాలేజీ బస్సు వచ్చింది లే’’ అంటూ ఏడుస్తూ రక్తపుమడుగులో పడి ఉన్న తన తండ్రిని లేపుతూ రోదిస్తుంటే ఆ దారిగుండా వెళ్లే పలువురు కంటతడి పెట్టారు. ఈ ఘటన నగరంలోని నారాయణగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది.
 
అఫ్జల్‌గంజ్‌/హిమాయత్‌నగర్‌ ఆంధ్రజ్యోతి: సుల్తాన్‌బజార్‌లోని జైన్‌మందిర్‌ వెనుకాల శిథిలావస్థకు చేరి సగం కూలిన గోడలు, విరిగిపోయిన రేకుల ఇంట్లో రాణాప్రవీర్‌కుమార్‌(58) నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య అనురాధ, పెద్దకూతురు చందన, చిన్నకూతురు శివాని ఉన్నారు. రాణాప్రవీర్‌కుమార్‌ వృత్తి రీత్యా న్యాయవాది. కానీ వారి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది. కేసులు వస్తేనే ఆ రోజుకు సరిపడే సరుకులు తెచ్చుకుని వండుకునే పరిస్థితి వారిది. ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ అష్టకష్టాలు పడుతూ ఇద్దరు కుమార్తెలను ఇంజనీరింగ్‌ చదివిస్తున్నాడు. చిన్నకూతురు బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెను ప్రతి రోజూ తన పాత ద్విచక్రవాహనంపై నారాయణగూడ వరకు తీసుకొచ్చి కళాశాల బస్సులో కాలేజీకి పంపించేవాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 7.30గంటలకు ఇంటి నుంచి రామ్‌కోఠి మీదుగా నారాయణగూడ జలమండలి కార్యాలయం వరకు రాగానే బస్సు కోసం ఎదురుచూస్తున్న రాణాప్రవీర్‌కుమార్‌ స్కూటర్‌ను ఎదురుగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బుల్లెట్‌ వాహనంతో బలంగా ఢీకొట్టాడు. దీంతో స్కూటర్‌పై ఉన్న తండ్రీకూతుళ్లు రోడ్డుపైన పడిపోయారు. ఈ ప్రమాదంలో రాణాప్రవీర్‌కుమార్‌ తలకు బలమైన గాయాలు తగిలి రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇదే ప్రమాదంలో ఎడమచేయికి బలమైన గాయమైన శివాని తన తండ్రిని రక్షించాలంటూ అరుపులు పెట్టింది. అక్కడే ఉన్న స్థానికులు 108, పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారకుడైన ద్విచక్రవాహనదారుడు అక్కడి నుంచి రెప్పపాటులో వాహనంతో పారిపోయాడు. విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాణాప్రవీర్‌కుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శివానిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చేతులకు కట్టుకట్టించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
మృతుడి ఇంటి వద్ద విషాదం..
రాణాప్రవీర్‌కుమార్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలియగానే సుల్తాన్‌బజార్‌లోని జైన్‌మందిర్‌ బస్తీవాసులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. కుమార్తెలు, భార్య రోదించడం చూసి పలువురు కంటతడి పెట్టారు. అనంతరం అంబర్‌పేటలోని హిందూ శ్మశాన వాటికలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా న్యాయవాదిగా రాణాప్రవీర్‌కుమార్‌కు మంచి పేరుంది. అలాగే ఆయన కుమార్తెలు కూడ ట్యూషన్లు చెబుతూ కళాశాలల్లో ఫీజులు కట్టుకునే వారని పలువురు చెప్పారు.
 
పెద్ద దిక్కును కోల్పోయా..
మాది నిరుపేద కుటుంబం. కళాశాలకు వెళ్లే చిన్నకూతురుకు ఆటోచార్జీలు లేక కొన్ని సంవత్సరాలుగా ఆయన స్కూటర్‌పైనే తీసుకెళ్లి బస్సు వద్ద వదిలేవారు. శుక్రవారం కూడా ఉదయం 7.30గంటలకు కూతురిని తీసుకుని బయటకు వెళ్లి రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయా.. ఇప్పుడు మాకు దిక్కెవరు.
- అనురాధ, భార్య
 
ఎంతో కష్టపడి చదివించారు..
మా నాన్న చిన్ననాటి నుంచే మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించారు. నేను నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ ఇన్ఫోటెక్‌ టెక్నాలజీ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని ప్రతీసారి తండ్రికి చెప్పేదాన్ని.
- పి.చందన, పెద్దకూతురు
 
కళ్ల ముందే గిలగిలా కొట్టుకుని..
మూడేళ్లుగా మా నాన్న స్కూటర్‌పైనే కళాశాల బస్సువద్ద వదిలివెళ్లేవాడు. నేను బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదవుతున్నాను. చివరి సంవత్సరం పూర్తికాగానే మంచి ఉద్యోగంలో చేరి ఉన్నతంగా చూసుకుంటానని వాహనంపై వెళ్లేటప్పుడు ప్రతి రోజూ నాన్నకు చెప్పేదాన్ని. శుక్రవారం కూడా ఇద్దరం మాట్లాడుకుంటూ రామ్‌కోఠి నుంచి నారాయణగూడ వద్దకు రాగానే వేగంగా దూసుకువచ్చిన బుల్లెట్‌ వాహనం మా నాన్న స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరం స్కూటర్‌ పై నుంచి రెప్పపాటులో ఎడమవైపు పడిపోయాం. నాన్న తలకు బలమైన గాయం కావడంతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ నా ముందే ప్రాణాలు వదిలాడు. తన ఎడమచేయి విరిగింది.
- పి.శివాని, చిన్నకూతురు
 
కేసులు వస్తేనే..
హైకోర్టు, సివిల్‌ కోర్టులో ఏదైనా కేసులు వస్తే ఆ రోజు వచ్చిన డబ్బులతో ఇంట్లోకి రెండు, మూడు కిలోల బియ్యం కూరగాయలు తీసుకువచ్చేవాడు. ఏనాడు కూడా బంధువులు, స్థానికులను అప్పులు అడిగేవాడు కాదు. ఆయనకు రెండు జతల దుస్తులు, న్యాయవాది కోటు మాత్రమే ఉంది.
- ప్రభాకర్‌రావు, మృతుడి బావ
 
Link to comment
Share on other sites

10 hours ago, Athadu007 said:

Papam ayina testhene food anta kids going colleges inka valla life sunyam papam

its wrong of me to judge without knowing the full circumstances....

but, intha chaduvukunna person, ee rojullo Hyderbad laanti pedda market lo.....maree biyyam koodaa konukkoleni stage lo undatam enti ? Konchem prayatna lopam koodaa undochu

Link to comment
Share on other sites

2 hours ago, Raasko said:

Asalu ela koda vuntara anupinchindhi bro...

But tell you what asalu anakodhadu kani why people need to live a life like this ...asalu inni kastalu padi brathiki use yenti anipisthadi ...knowing future is empty ...morals ga answer chepodhu but just general ga thinking 

Link to comment
Share on other sites

26 minutes ago, Athadu007 said:

Asalu ela koda vuntara anupinchindhi bro...

But tell you what asalu anakodhadu kani why people need to live a life like this ...asalu inni kastalu padi brathiki use yenti anipisthadi ...knowing future is empty ...morals ga answer chepodhu but just general ga thinking 

anni kasthalu badulu chachipovadam better antava

panipoori

Link to comment
Share on other sites

39 minutes ago, Athadu007 said:

Asalu ela koda vuntara anupinchindhi bro...

But tell you what asalu anakodhadu kani why people need to live a life like this ...asalu inni kastalu padi brathiki use yenti anipisthadi ...knowing future is empty ...morals ga answer chepodhu but just general ga thinking 

Lol what a stupid reply..there were people who were homeless before they became bigshots..a.r.rahman was in poverty before he became big ippudu kashtalunnayani chachhipovatam better antava

Link to comment
Share on other sites

40 minutes ago, Athadu007 said:

Asalu ela koda vuntara anupinchindhi bro...

But tell you what asalu anakodhadu kani why people need to live a life like this ...asalu inni kastalu padi brathiki use yenti anipisthadi ...knowing future is empty ...morals ga answer chepodhu but just general ga thinking 

kastaalu andhariki vuntaayi bhayya dhaanike brathakatam anavasaram anukovadam konchem moorkathvam...ila anukuntey ee lokam atleast 75% population vundakoodadhu

Link to comment
Share on other sites

2 hours ago, Raasko said:

its wrong of me to judge without knowing the full circumstances....

but, intha chaduvukunna person, ee rojullo Hyderbad laanti pedda market lo.....maree biyyam koodaa konukkoleni stage lo undatam enti ? Konchem prayatna lopam koodaa undochu

nuvvu pedda pedda lawyers kaakunda chinna lawyers gurinchi eppudu choosinattu levu...chinna lawyers chaala mandhi paapam ilaane vuntaaru baa

Link to comment
Share on other sites

3 hours ago, Raasko said:

its wrong of me to judge without knowing the full circumstances....

but, intha chaduvukunna person, ee rojullo Hyderbad laanti pedda market lo.....maree biyyam koodaa konukkoleni stage lo undatam enti ? Konchem prayatna lopam koodaa undochu

The least  thing we can do is judging someone... we never know why someone could not do something that is real priority 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...