Jump to content

ఇలా చేస్తే చరిత్రను వక్రీకరించడమే అవుతుంది : Krish


snoww

Recommended Posts

కంగన ప్రశాంతంగా ఎలా నిద్రపోతోందో: క్రిష్‌

 

‘ఆమె చెప్పింది అబద్ధం.. మూర్ఖంగా ప్రవర్తించింది’

Kangana0_1.jpg

హైదరాబాద్‌: నటుడు సోనూసూద్‌ విషయంలో కంగనా రనౌత్‌ చెప్పిన మాటలు అబద్ధాలని దర్శకుడు క్రిష్ అన్నారు. ఆయన  దర్శకత్వంలో కంగన నటించిన చిత్రం ‘మణికర్ణిక’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది. కొన్ని కారణాల వల్ల సినిమాకు సంబంధించిన కొంత భాగానికి కంగన దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం గురించి క్రిష్‌ తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. గత ఏడాది జూన్‌కే సినిమా మొత్తం ఎడిటింగ్‌ పూర్తి చేసినట్లు చెప్పారు. అందరూ నటులు డబ్బింగ్‌ పూర్తి చేసుకున్నారని అన్నారు. కేవలం కంగన మాత్రం డబ్బింగ్‌ చెప్పాల్సి ఉందని, అప్పుడు ఆమె ‘మెంటల్‌ హై క్యా’ సినిమా షూట్‌ కోసం లండన్‌లో ఉన్నారని తెలిపారు.

* ‘కంగన లండన్‌ నుంచి తిరిగి వచ్చారు. సినిమా చూసి తనకు నచ్చిందని చెప్పారు. కానీ కొన్ని చిన్న మార్పులు చేస్తే బాగుంటుందని అన్నారు. తర్వాత ఇది మార్చండి, అది మార్చండి అంటూ వచ్చారు. అంతేకాదు కమల్‌ జైన్‌ (నిర్మాత)కు సినిమా నచ్చలేదని కంగన నాతో అన్నారు’.

* ‘నిజమే ఈ సినిమా కోసం ఆరు రోజులు రీ షూట్‌ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నేను ప్రసూన్‌ జోషి, మరికొంత మంది చిత్ర బృందంతో చర్చించా, ఎలా చేద్దామని అడిగా. ఈ సమయంలో కంగన ఉన్నట్టుండి సోనూసూద్‌ పాత్ర (సదాశివరావు) విరామం వచ్చేటప్పుడు చచ్చిపోవాలి అంది. ఇలా చేస్తే చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. పెద్ద వాదన జరిగింది. సినిమాకు ఏది మంచిదైతే అదే చేద్దాం అని చెప్పా’.

* ‘సోనూది సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఆయన ప్రతినాయకుడిగా నటించారు. 35 రోజుల షూట్‌లో పాల్గొన్నారు. సోనూ పాత్రలో చేస్తున్న ఈ మార్పును (విరామానికి ముందే చంపేయడం) నేను షూట్‌ చేయనని చెప్పా. కంగన డెరెక్ట్‌ చేస్తుందని కమల్‌ జైన్‌ సమాధానం ఇచ్చారు. నేను షూట్‌ చేయకపోతే షూటింగ్‌లో పాల్గొననని సోనూ అన్నారు’ అని క్రిష్‌ చెప్పారు.

Kangana1.jpg

* ఓ మహిళా దర్శకురాలితో కలిసి పనిచేయడం ఇష్టంలేక సోనూ సినిమా నుంచి తప్పుకున్నారని కంగన మీడియాతో గతంలో అన్నారు. దాని గురించి ప్రశ్నించగా.. ‘అలా చెప్పడం సరికాదు. అలా ఎప్పుడూ జరగలేదు. కంగన చెప్పింది అబద్ధం. ప్రాజెక్టు నుంచి తప్పుకున్నందుకు సోనూను నేను విమర్శించను. అతడి పాత్ర రన్‌టైమ్‌ 100 నిమిషాలు. కానీ దాన్ని 60 నిమిషాలకు కట్‌ చేశారు. ఇలా చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరూ ఒప్పుకోరు. సినిమాలో నటించిన అతుల్ కులకర్ణి పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. ఆయన పాత్రను కూడా చాలా భాగం తీసేశారు. కాశీబాయి పాత్రను కూడా చాలా వరకు డిలీట్‌ చేశారు. అనేక పాత్రల్ని ఎందుకు అలా కట్‌ చేశారో నాకు అర్థం కావడం లేదు. కథ మరో విధంగా ఇంకా బాగుండేది’ అని క్రిష్‌ పేర్కొన్నారు.

* కంగన చాలా మూర్ఖంగా, తప్పుగా ప్రవర్తించిందని క్రిష్‌ తెలిపారు. ‘నా పనితనం జీ స్టూడియోస్‌కు నచ్చలేదని కంగన నన్ను నమ్మించారు. ఇది ఓ భోజ్‌పూరి సినిమాలా ఉందన్నారని ఆమె నాతో అన్నారు. దీంతో నేను గట్టిగా నవ్వాను. ప్రజలకు నా పనితనం ఏంటో తెలుసని చెప్పాను. ఈ విషయంలోనూ మా మధ్య వాదన జరిగింది. కానీ ఆమె తన పద్ధతిలోనే పోయారు. నాకు అర్థం కాలేదు. ఆమె ప్రతిసారీ మూర్ఖంగానే ప్రవర్తించారు’.

* ‘‘మణికర్ణిక’ తొలి పోస్టర్‌లో నా పేరు (క్రిష్‌) ఉంటుంది. తర్వాత టీజర్‌కు వచ్చే సరికీ నా పేరును కాస్తా రాధా కృష్ణ జాగర్లమూడి అని రాశారు. ఆ పేరును నేను చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వాడలేదు. ఈ తప్పును వాళ్లకు (టీంకు) చెప్పా. ‘మీరు సోనూసూద్ ఎపిసోడ్‌లో మాకు సపోర్ట్‌ చేయలేదు. ఇప్పుడు మీ అవసరం ఉంది కాబట్టి వచ్చారు’ అని కంగన నాతో అన్నారు. నాకు కోపం వచ్చింది (నవ్వుతూ). సినిమా చూశా.. టైటిల్స్‌లో నా పేరును మళ్లీ అలానే వేశారు. సినిమా డైరెక్షన్‌కు మొదటి క్రెడిట్‌ తీసుకుని కంగన ఎలా ప్రశాంతంగా నిద్రపోతోందో నాకు తెలియడం లేదు. ఆమె దానికి అర్హురాలు కాదు’ అని క్రిష్‌ చెప్పారు.

Link to comment
Share on other sites

  • Replies 55
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    10

  • thillanaX5

    8

  • mettastar

    5

  • samaja_varagamana

    3

5 minutes ago, mettastar said:

Ipudu vedi medha pagabattava snow vuncle .. nee kastam evariki rakudadhu

Adhela bro yeevaraina commode gaala medha comment chesthe defend cheyyadaaniki digipothaav. Amazon lo on call vunna anni vadhili vacchi defend sesthaav

Link to comment
Share on other sites

1 minute ago, thillanaX5 said:

Adhela bro yeevaraina commode gaala medha comment chesthe defend cheyyadaaniki digipothaav. Amazon lo on call vunna anni vadhili vacchi defend sesthaav

Same feeling uncle .. eda eda no erukochi mari news lu estharu edustharu adela vuncle .. pani mrotta leda

Link to comment
Share on other sites

2 minutes ago, mettastar said:

Same feeling uncle .. eda eda no erukochi mari news lu estharu edustharu adela vuncle .. pani mrotta leda

Just coz you pulkas dont consider anything other than ABN n Etv as news doesnt mean other news sources r fake . Daily oka 30 min meelanti karudugattina pulkalatho aadukunte best work stress reliever. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...