Jump to content

కేసీఆర్ కేబినెట్‌లో మంత్రులు వీళ్లే.. జాబితా వచ్చేసింది!


snoww

Recommended Posts

కేసీఆర్ కేబినెట్‌లో మంత్రులు వీళ్లే.. జాబితా వచ్చేసింది!
17-02-2019 21:52:38
 
636860371574707793.jpg
హైదరాబాద్: ఈ నెల 19న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెలిసిందే. కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కబోతోందన్న విషయంపై టీఆర్ఎస్‌ మీడియా ద్వారా గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కేబినెట్‌‌ విస్తరణలో టీఆర్ఎస్ కీలకనేతలైన హరీశ్‌రావు, కేటీఆర్, ఈటలకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఈటలపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
 
 
కేబినెట్‌లో చోటు వీరికే..!
ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి, జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌కు కేబినెట్‌లో చోటు దక్కుతుందని వార్తలు వినవస్తున్నాయి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్‌ అని తెలుస్తోంది. కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో దఫా కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఎస్టీ సామాజిక వర్గం నుంచి, మహిళా కోటా నుంచి ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది.
 
 
జిల్లాల వారిగా చూస్తే...
హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆదిలాబాద్: ఇంద్రకరణ్‌రెడ్డి
కరీంనగర్ : కొప్పుల ఈశ్వర్
వరంగల్ : ఎర్రబెల్లి దయాకర్ రావు
నల్గొండ : జగదీష్‌రెడ్డి
నిజామాబాద్ : ప్రశాంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్ : నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌
 
కాగా.. కేబినెట్ విస్తరణపై ఇలా లీకులు రావడంతో ఆశావహులు అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆశావహులు ప్రగతి భవన్‌‌కు క్యూ కట్టిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

నవ అమాత్యులు

 

9 మంది ఖరారు! 

మంత్రిమండలి విస్తరణపై స్పష్టత 
ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు చోటు 
ఎమ్మెల్యేలకు సీఎం ఫోన్‌ 
కేటీఆర్‌కు పూర్తిగా పార్టీ బాధ్యతలే 
హరీశ్‌రావు, కడియం, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు అవకాశం లేనట్లే! 
ఈనాడు - హైదరాబాద్‌

17gh-main1a.jpg

రాష్ట్ర మంత్రిమండలి విస్తరణపై దాదాపు స్పష్టత వచ్చింది. పూర్తిస్థాయి కసరత్తు అనంతరం సీఎం కేసీఆర్‌ జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ జాబితా ప్రకారం ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో ప్రాతినిధ్యం దక్కనుంది. తొలి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు ఉండదని విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి పదవులకు తొమ్మిది మంది పేర్లు ఖరారయ్యాయి. మాజీ మంత్రి కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సీఎం.. ఆయనను పూర్తిగా పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు గత మంత్రివర్గంలో పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు మరోసారి అవకాశం దక్కనుండగా.. హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు అవకాశం లేనట్లేనని సమాచారం. ఇప్పటికే మెదక్‌ జిల్లా నుంచి సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మహిళా, గిరిజన కోటా కింద ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. ఆదివారం వరకు తొమ్మిది మంది ఎంపిక ఖరారు కాగా.. ముఖ్యమంత్రి ఈ మేరకు వారికి సంకేతాలు ఇచ్చారు. వారిలో కొందరికి ఆదివారమే ఫోన్‌ చేసి సమాచారం చెప్పారు. మరికొందరితో సోమవారం మాట్లాడనున్నట్లు తెలిసింది. చోటుదక్కని పలువురు ఆశావహులతోనూ సీఎం ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ జాబితాలో మార్పులుండవని తెలుస్తోంది. ఒకవేళ మరొకరికి సర్దుబాటు చేయాలనుకుంటే సంఖ్య పదికి చేరుకుంటుందని చెబుతున్నారు. రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు రెండోవిడతలో అవకాశం దక్కనున్నట్లు తెలిసింది. 

17gh-main1b.jpg

ఆచితూచి ఎంపిక 
మంత్రివర్గ విస్తరణలో తొలి విడత అవకాశాలపై సీఎం ఆచితూచి వ్యవహరించారు. ఇందులో మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాలకు రెండేసి స్థానాలు దక్కనున్నాయి. 
ఆదిలాబాద్‌: ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లాలో మిగిలిన వారి కంటే అనుభవజ్ఞుడైనందున ఇంద్రకరణ్‌రెడ్డి వైపు మొగ్గుచూపారు. ఈ జిల్లాలో గెలిచిన రేఖానాయక్‌కు ఎస్టీ, మహిళా కోటా కింద ఎంపిక చేస్తారని భావించినా.. మలి విడతలో ఆమె పేరును పరిగణనలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
హైదరాబాద్‌: రాష్ట్రంలో బలమైన బీసీ సామాజికవర్గం వ్యక్తి కావడంతో తలసానిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయ అనుభవాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. గతంలో జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన పద్మారావును ఉపసభాపతి లేదా చీఫ్‌ విప్‌ పదవిలో నియమించొచ్చని తెలుస్తోంది. 
నిజామాబాద్‌: సామాజిక సమీకరణాలతోపాటు సీఎంతో సాన్నిహిత్యం ప్రశాంత్‌రెడ్డి వైపు మొగ్గుచూపడానికి కారణంగా తెలుస్తోంది. గతంలో మిషన్‌ భగీరథ ఉపాధ్యక్ష పదవిలో కేబినెట్‌ హోదాలో ప్రశాంత్‌రెడ్డి పనిచేశారు. 
* కరీంనగర్‌: ఆది నుంచీ సీఎంకు ఉద్యమ సహచరుడైన కొప్పుల ఈశ్వర్‌కు గతంలోనే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నా సాధ్యం కాలేదు. ఈసారి ఎస్సీ కోటా కింద ఆయనకే నేరుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈటల రాజేందర్‌ ఎంపిక విషయంలో తొలుత కొంత ఊగిసలాట ఉన్నా.. చివరికి సీఎం ఈటల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 
మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాల్లో 13 స్థానాలు తెరాసకు దక్కాయి. ఈ జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన కేసీఆర్‌ ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెడుతున్నారు. కీలకమైన సామాజికవర్గ సమీకరణ, తనతోపాటు ఉద్యమంలో పాల్గొనడం వంటి అంశాల ప్రాతిపదికన నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. గెజిటెడ్‌ అధికారుల సంఘం తరపున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్‌కు గత మంత్రివర్గంలోనే చోటు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. బీసీల్లోని బలమైన సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించినట్లు  తెలుస్తోంది. 
* నల్గొండ: సామాజికవర్గంతోపాటు అనుభవాన్ని, తనతో సాన్నిహిత్యాన్ని పరిగణనలోకి తీసుకుని జగదీశ్‌రెడ్డిని సీఎం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రెండో విడతలో అమాత్య పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. 
వరంగల్‌: జిల్లా నుంచి సీనియర్‌ ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్‌రావును మంత్రి పదవికి సీఎం ఎంపిక చేశారు. కడియం శ్రీహరికి శాసనమండలి ఛైర్మన్‌ లేదా ఇతర బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. 
కేటీఆర్‌కు పార్లమెంటు ఎన్నికల బాధ్యతలు 
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో కేటీఆర్‌కు పార్లమెంటు ఎన్నికల బాధ్యతలను అప్పగించనున్నారని తెలిసింది. అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ఎంపిక చేయనుండగా.. కేటీఆర్‌ ప్రచార సారథిగా వ్యవహరించబోతున్నారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల తర్వాత సమీకరణాల ఆధారంగా కేటీఆర్‌కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

 

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం కసరత్తు

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఆదివారం సీఎం కేసీఆర్‌ కసరత్తు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం ఉదయం 11.30కి మంత్రివర్గ విస్తరణ ఉండగా.. వెంటనే శాఖల కేటాయింపు ఉత్తర్వుల జారీకి అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే శాఖల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. మొత్తం 34శాఖలను 18గా మార్చారు. వాటినే మంత్రులకు కేటాయించనున్నారని తెలుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్‌వద్దే నీటిపారుదల,పంచాయతీరాజ్‌, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖలు ఉంటాయి.
Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

I K Reddy ki bane istundu...I still doubt if IK Reddy will get a berth..

I k reddy is very close to us and a distant relative as well. Cabinet berth is confirmed and my family is attending the swearing in ceremony tomorrow at Raj Bhavan. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...