Jump to content

మా ఆస్తులు కొట్టేసిన నువ్వేంటి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది?: కేసీఆర్ ను నిలదీసిన చంద్రబాబు


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-643555-telugu.html

tnews-07e28ecbc1c6a32692e98a306239fc0b4a

  • నీ ఆటలు సాగనివ్వం
  • మా ప్రజలు నీకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు
  • నా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను

దమ్ము, ధైర్యం ఉంటే జగన్, కేసీఆర్, మోదీ ముందుకు వచ్చి నేరుగా తనను ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుంటూరు జిల్లా రేపల్లె ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఫ్యాన్ కు స్విచ్ హైదరాబాద్ లో ఉంటే, దానికి కరెంట్ ఢిల్లీలో ఉన్న మోదీ ఇస్తారని ఎద్దేవా చేశారు. మోదీ కరెంట్ ఇచ్చినప్పుడు, కేసీఆర్ స్విచ్చేస్తేనే ఆ ఫ్యాన్ తిరుగుతుందని అన్నారు. ‌

"మనల్ని ఓడించి జగన్ కు పట్టం కడితే నీ కాల్మొక్తా బాంచన్ అనుకుంటూ లోటస్ పాండ్ లో కూర్చొని కేసీఆర్ ను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాడు.  అసలీ కేసీఆర్ ఏనాడైనా సెక్రటేరియట్ కు వచ్చాడా? ఎప్పుడన్నా గ్రామాలు తిరిగాడా? ఎప్పుడన్నా కష్టపడ్డాడా? ఆయన మహానాయకుడు. మనం ఏమీలేని దశ నుంచి అభివృద్ధి చెందుతున్నాం. ధనిక రాష్ట్రాలకు దీటుగా ఎదుగుతున్నాం. తెలంగాణలో పార్టీలన్నింటిని మింగేసిన కేసీఆర్ ఇప్పుడు మన జోలికి వస్తున్నాడు. నేను చెబుతున్నా, నా జోలికి రావొద్దు. మా రాష్ట్రం జోలికి వస్తే ఖబడ్దార్ కేసీఆర్. జాగ్రత్తగా ఉండు, మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం. తెలంగాణకు ఏమీచేయకపోయినా ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి 88 సీట్లు గెలిచాడు. ఎన్నికల్లో గెలిచామని, గెలిచినవాళ్లను తమ పార్టీలోకి లాక్కున్నామని విర్రవీగుతున్నాడు. తానేదో పరాక్రమవంతుడ్నని అనుకుంటున్నాడు కేసీఆర్. నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నాడు. మా ఆస్తులు కొట్టేసిన నువ్వేంటి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది? 5 కోట్ల మంది ప్రజలు నీకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు" అంటూ నిప్పులు చెరిగారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...