Jump to content

పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముంపు ముప్పు


snoww

Recommended Posts

పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముంపు ముప్పు 

తెలంగాణలో ప్రభావంపై అధ్యయన కమిటీ పరిశీలన

21main5a_2.jpg

భద్రాచలం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రవాహ సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచితే భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉంటుందని నీటిపారుదల శాఖ అంతర్‌రాష్ట్ర వ్యవహారాల సీఈ నరసింహారావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల పరిస్థితిని ఆదివారం ప్రత్యేక అధికారుల అధ్యయన బృందం పరిశీలించింది. సీఈ నరసింహారావు, ఈఈ రాంప్రసాద్‌, ఐఐటీ ప్రొఫెసర్‌ డా.శశిధర్‌ నేతృత్వంలో అధికారులు భద్రాచలంలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా సీఈ నరసింహారావు విలేకరులతో మాట్లాడారు. జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్టును ముందుగా అనుకున్న 36 లక్షల క్యూసెక్కులకు మించి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తున్నందున భద్రాచలం తీరప్రాంతంలో ముంపు ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేశామని తెలిపారు. 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికే భద్రాచలం వద్ద సాధారణ రోజుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 43 అడుగుల మేర నీటిమట్టం ఉంటుందని స్పష్టం చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోలవరం నిర్మిస్తే ఆ ప్రాజెక్టు నుంచి 120 కి.మీ. మేర వెనుక జలాలు ఉంటాయని వివరించారు. ఈ 120 కి.మీ.లలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటాయని తెలిపారు. తెలంగాణలో సుమారు 30 కి.మీ విస్తీర్ణంలో ఉంటాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వరకు వరద పోటెత్తే ప్రమాదం ఉందనే అంచనాకు వచ్చామని వివరించారు. పినపాక నియోజకవర్గంలోని భారజల కర్మాగారం, ఐటీసీ కాగిత పరిశ్రమ, సీతారామ ప్రాజెక్టుకు ఈ వరద ప్రభావం ఉంటుందా? లేదా? అనేది అంచనా వేస్తున్నామని చెప్పారు. సమగ్ర సమాచారాన్ని సేకరించి సుప్రీంకోర్టుకు వివరాలను అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలకు పరిహారం అందిస్తున్నందున కొత్తగా చేరే ప్రాంతాలకు కూడా న్యాయం చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ముంపు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల నుంచి తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన నెల్లిపాక వరకు కరకట్టను నిర్మించాలన్న ఆలోచనలు కూడా అధికారులు చేస్తున్నారు.

1986 తీరులో వరద వస్తే అపార నష్టం 

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరింత పెంచితే వెనుకజలాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో ముంపు నష్టం తీవ్రత పెరుగుతుందని తాజాగా అధ్యయనం చేపట్టిన నీటిపారుదల శాఖకు చెందిన బృందం అంచనా వేసింది. గోదావరి నదిలో నీటి ప్రవాహంపై ఈ నష్టం తీవ్రత ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వ్యాజ్యాల నేపథ్యంలో క్షేత్రస్థాయి సమాచారం కోసం బృందం పర్యటన చేపట్టింది. ఈ సందర్భంగా బృందం పలు రకాల సమాచారం సేకరించి కొన్ని అంశాలపై ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇంజినీరింగ్‌ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం.. పోలవరం పూర్తయితే వెనుక జలాలతో భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగుల వరకు ఉంటుంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఉన్న ప్రైవేటు జలవిద్యుత్తు కేంద్రం కూడా ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తాజాగా తేలింది. 1986లో గోదావరికి భారీ వరద వచ్చినట్లు మళ్లీ వస్తే పోలవరం వెనుక జలాల ఒత్తిడి కారణంగా పరివాహకమంతా చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలవరంతో కిన్నెరసాని నదిలోకి ఇప్పటికే నాలుగు కిలోమీటర్ల మేర నీరు పోటెత్తనుండగా భారీ ప్రవాహం వస్తే కిన్నెరసాని ప్రాజెక్టు వరకు ఈ ప్రభావం ఉంటుంది. ముర్రేడు వాగు జంక్షన్‌ కూడా పోటెత్తుతుంది. దీనివల్ల అనేక గ్రామాలకు ముంపు ఉంటుంది.
Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    6

  • manadonga

    5

  • bhaigan

    5

  • kittaya

    3

Top Posters In This Topic

7 minutes ago, manadonga said:

Discharge capacity penchite backwater problem enti asalu 

penchindi discharge capacity kaadu, Dam capacity.

That will increase dam storage capacity and increase back waters which will cause flooding. 

Link to comment
Share on other sites

21 minutes ago, snoww said:

penchindi discharge capacity kaadu, Dam capacity.

That will increase dam storage capacity and increase back waters which will cause flooding. 

Dam capacity enta nunchi enta ki pencharu cheppu 

Link to comment
Share on other sites

India lo ide problem BAA. Munde danger ani oka idea and report vunna appudu local lo vunna pressure meeda Ila CM la pressure meeda chestharu. Future lo ademaina theda vasthe veella ki yendi laddu lo di power lo vundaru happy ga hyd lo intlo kurchuntaru. Rules prakaram kattukukondi andaru happy ga vundani _-_

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

Thank You CBN for making a mess of a project like Polavaram.

40 years industry experience thelivi baaga use chesav ee project issues resolve cheyyatam lo. 

Apadaniki 100 cheptharu... Mi istam le va..

Aelago jagan tintaadu ga...

Happy ga undham

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...