Sign in to follow this  
ekunadam_enkanna

గుప్త నిధుల కోసం వెళ్లి అదృశ్యమయ్యారు

Recommended Posts

ekunadam_enkanna

ఒంగోలు: గుప్త నిధుల కోసం వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు అదృశ్యమైన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం..తుర్లుపాడు మండలం తాడివారిపల్లె అటవీప్రాంతంలోకి మూడు రోజుల క్రితం గుప్త నిధుల అన్వేషణకు ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఇంటికి చేరుకోగా, మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియలేదు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి అదృశ్యమైన ఇద్దరి కోసం గాలింపు చేపట్టాయి. గుప్త నిధుల కోసం వెళ్లిన వారిలో ఇద్దరు గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన వారు కాగా, మరో వ్యక్తి హైదరాబాద్‌లోని కెనరాబ్యాంకు అధికారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Share this post


Link to post
Share on other sites
naralokeshreddy
35 minutes ago, ekunadam_enkanna said:

ఒంగోలు: గుప్త నిధుల కోసం వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు అదృశ్యమైన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం..తుర్లుపాడు మండలం తాడివారిపల్లె అటవీప్రాంతంలోకి మూడు రోజుల క్రితం గుప్త నిధుల అన్వేషణకు ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఇంటికి చేరుకోగా, మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియలేదు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి అదృశ్యమైన ఇద్దరి కోసం గాలింపు చేపట్టాయి. గుప్త నిధుల కోసం వెళ్లిన వారిలో ఇద్దరు గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన వారు కాగా, మరో వ్యక్తి హైదరాబాద్‌లోని కెనరాబ్యాంకు అధికారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

 

vorney, black mailer Ravi Prakash and Garuda Puranam Shivaji gurunchi anukunna....

Share this post


Link to post
Share on other sites
ekunadam_enkanna

Update. Good news: no 'paranormal' business; bad news: one died.

గుప్త నిధులపై ఆశ ఒకరి ఆయువు తీసింది... మరొకరు అడవిలో అదృశ్యమయ్యారు... బతుకు జీవుడా అంటూ బయపడిన మూడో వ్యక్తి ద్వారా ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కెనరా బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న కట్టా శివకుమార్‌(45) మృతి చెందారు. తాడివారిపల్లె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివకుమార్‌ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ధరావత్‌ కృష్ణానాయక్‌(45), బోడు హనుమంత నాయక్‌(64)లతో కలిసి ఈ నెల 12వ తేదీ ఉదయం నాగెళ్లముడిపి - తాడివారిపల్లె గ్రామాల మధ్య నుంచి వెలుగొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ వారు విడిపోయి దారి తప్పినట్లు ప్రాథమిక సమాచారం. కృష్ణానాయక్‌ 13వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన అలసట, నిస్సత్తువతో అడవి నుంచి బయటపడ్డాడు. కర్నూలు - ఒంగోలు రహదారిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద రోడ్డెక్కాడు. స్థానికులు అతడికి తాగునీరు ఇచ్చి, భోజనం పెట్టారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు అడవిలో ఏం జరిగింది? నిజంగానే వారు దారి తప్పారా? శివకుమార్‌ మృతికి కారణాలేమిటి? తప్పిపోయిన హనుమంత నాయక్‌ సురక్షితంగా ఉన్నారా? అనేవి పోలీసుల మదిలో ఉన్న ప్రశ్నలు.

 

అతడు కూలి కోసమే వచ్చాడా?

ఈ ఉదంతంలో మున్నంగి గ్రామానికి చెందిన కృష్ణా నాయక్‌ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం ఉదయం ముగ్గురూ అడవిలోకి వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేశారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పి, ముగ్గురూ విడిపోయారు. అతికష్టం మీద కృష్ణా నాయక్‌ సోమవారం మధ్యాహ్నానికి బయటపడ్డాడు. ప్రస్తుతం ఇతడు పోలీసుల వద్దే ఉన్నాడు. గుప్తనిధుల గురించి తనకేమీ తెలియదని, రోజుకు రూ.400 కూలీ ఇస్తానని చెప్పటంతో తానూ వారి వెంట వచ్చినట్లు అతడు చెబుతున్నాడు. అతడి మాటల్లో నిజమెంతో నిర్ధరించుకునే పనిలో పోలీసులు ఉన్నారు.


పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే..

కృష్ణానాయక్‌ సోమవారం మధ్యాహ్నమే అడవి నుంచి బయటకు వచ్చాడు. స్థానికుల సపర్యలతో తేరుకున్నాడు. వెంటనే శివకుమార్‌ తప్పిపోయిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు చేరవేశాడు. దీంతో వారు హైదరాబాద్‌ నుంచి సోమవారం రాత్రికి మార్కాపురం వచ్చారు. రెండు రోజుల పాటు శివకుమార్‌ కోసం అడవిలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే వారు వెంటనే రంగంలోకి దిగేవారు. అడవులను జల్లెడ పట్టడంలో అనుభవజ్ఞులైన ఏఎన్‌ఎస్‌(యాంటీ నక్సల్స్‌ స్క్వాడ్‌) బృందాలు జిల్లాలో ఉన్నాయి. వారు కూంబింగ్‌ చేపడితే ఫలితం దక్కే అవకాశం ఉండేది. కానీ గుప్తనిధుల అన్వేషణకు సంబంధించిన విషయం కావటంతో బాధితులు పోలీసులకు చెప్పేందుకు భయపడి జాప్యం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగిన అయిదు గంటల్లోనే శివకుమార్‌ ఆచూకీ కనుగొన్నా... ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

హనుమంత నాయక్‌ ఏమయ్యాడు?

అడవిలోకి వెళ్లిన వారిలో ఒకరి కథ సుఖాంతమైతే, మరొకరి జీవితం విషాదాంతమైంది.. ఇప్పుడు మూడో వ్యక్తి బోడ హనుమంత నాయక్‌ పరిస్థితి ఏంటన్నది అంతు చిక్కటం లేదు. దట్టమైన అటవీప్రాంతంలో అయిదు రోజుల పాటు తిండీ నీరూ లేకుండా బతికి ఉండటం సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఉదంతంలో హనుమంత నాయక్‌ కు గుప్త నిధుల వేటలో అనుభవం ఉండొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అతడిని నమ్మే శివకుమార్‌ అడవిబాట పట్టినట్లు అర్థమవుతోంది. తీవ్రమైన ఎండల ధాటికి తిండీ నీరూ లేక శివకుమార్‌ మృతి చెంది ఉంటాడని భావిస్తున్నప్పటికీ, పోలీసుల్లో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవిలో ముగ్గురూ ఒకేచోట ఉన్నప్పుడు, నీటి కోసమైనా, తిండి కోసమైనా, ఒకర్ని ఒకరు విడిచి పోవాల్సిన అవసరమే లేదు.. కలిసే వెదుకులాడే అవకాశం ఉంది.. మరెందుకు విడిపోయారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హనుమంత నాయక్‌ ఆచూకీ లభ్యమైతే ఈ సందేహాలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.

గతంలోనూ ఇదే ప్రాంతంలో గుప్త నిధుల కోసం వేట

కొనకనమిట్ల మండలంలోని శ్రీవెలుగొండస్వామి ఆలయం మొదలుకోని తిరుమల తిరుపతిలోని శేషాచలం అటవుల వరకు తాడివారిపల్లె మీదుగా ఒకే కొండ ఉంది. ఈ కొండపై ఎక్కడా ఖాళీ లేదు. దీనికి అటూ ఇటూ ఎన్నో గ్రామాలు ఉన్నాయి. వీటికి సమీపంలో కొండను ఆనుకుని పలు ఆలయాలను కూడా పూర్వీకులు నిర్మించారు. ఒంటరిగా ఎవరూ వెళ్లలేని ప్రాంతం కావడంతో గుప్త నిధులు ఉంటాయనే ఉద్దేశంతో ఎంతోమంది ఎన్నోసార్లు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. 

Share this post


Link to post
Share on other sites
kevinUsa

cellphones GPS trackers tesukoni vellaleda ??

Share this post


Link to post
Share on other sites
ekunadam_enkanna
14 minutes ago, kevinUsa said:

cellphones GPS trackers tesukoni vellaleda ??

Cellphones are useless, when there are no towers within 4 miles radius. One needs PLBs(personal locater beacons). Many folks end up missing in American national parks. When one goes out for running or hiking, if he falls off a cliff, and if no one is around, he will end up dying. Even rescue teams end up not finding that person. This happened in some Colorado national park. Usually, going out with another person is helpful. PLBs are good too,

 

Share this post


Link to post
Share on other sites
ekunadam_enkanna

 

 

Share this post


Link to post
Share on other sites
chicchara

45 45 64 are their ages... 45 aged guys antey ok...

64 aged thaatha..what will he achieve by going these type of expeditions? finally lost his life in search of not present money. sorry for their loss

Share this post


Link to post
Share on other sites
ekunadam_enkanna

These guys have never hiked these hills. Second, they have not carried enough water. Usually in Indian summers or  in any desert hikes, one needs a liter water per hour. Each liter weighs 1 kilo. These guys crossed six hills(kondalu). At least they would have walked/hiked 30 miles or for 18 hours.  20Kg worth of water. Carrying that much really sucks, unless you have trained yourself.

If this incident had happened 50 years ago, no one would have found dead bodies. Then we would be hearing "dayyam" stories.

Share this post


Link to post
Share on other sites
JohnSnow
1 hour ago, chicchara said:

45 45 64 are their ages... 45 aged guys antey ok...

64 aged thaatha..what will he achieve by going these type of expeditions? finally lost his life in search of not present money. sorry for their loss

64 age lo money vasthe theerani korikalu theerchukovacchu laxmirai and hamsanandini lanti figures ni 10gi sacchipovacchu ani

Share this post


Link to post
Share on other sites
ekunadam_enkanna

Update: third one found dead. No 'dayyam' involvement.

 గుప్త నిధుల అన్వేషణ కోసం వెలుగొండ అటవీ ప్రాంతంలో అయిదు రోజుల కిందట అదృశ్యమైన బ్యాంకు ఉద్యోగి కట్టా శివకుమార్‌, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి వాసి బాణా హనుమంత నాయక్‌లు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో పోలీసులు వీరిద్దరి మృతదేహాలను వెలుగొండ అటవీ ప్రాంతంలో కనుగొన్నారు. దురాశ దుఃఖానికి చేటు అని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది

https://www.eenadu.net/districts/mainnews/116594/Prakasam/19/8

Share this post


Link to post
Share on other sites
shamsher_007
17 hours ago, kevinUsa said:

cellphones GPS trackers tesukoni vellaleda ??

signals levanta dora. nuv cheppinav ga next time try chestharu le @3$%

Share this post


Link to post
Share on other sites
shamsher_007
16 hours ago, ekunadam_enkanna said:

These guys have never hiked these hills. Second, they have not carried enough water. Usually in Indian summers or  in any desert hikes, one needs a liter water per hour. Each liter weighs 1 kilo. These guys crossed six hills(kondalu). At least they would have walked/hiked 30 miles or for 18 hours.  20Kg worth of water. Carrying that much really sucks, unless you have trained yourself.

If this incident had happened 50 years ago, no one would have found dead bodies. Then we would be hearing "dayyam" stories.

true vuncle

Share this post


Link to post
Share on other sites
Anti_Pulka

దురాశ దుఃఖానికి చేటు అని మన @Undavalli vankul చెప్పిండు ఫోన్ తెరిస్తే అన్ని గివె 

Share this post


Link to post
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

Sign in to follow this