Jump to content

తాగునీటికి తల్లడిల్లుతున్న చెన్నై


snoww

Recommended Posts

తాగునీటికి తల్లడిల్లుతున్న చెన్నై

15ap-main6a_3.jpg

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడువ్యాప్తంగా తాగునీటికి కటకట ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో సమస్య తీవ్రంగా ఉంది. చెన్నైకి నీటిని అందించే పూండి, పుళల్‌, చోళవరం, చెంబరంబాక్కం, రెడ్‌హిల్స్‌, వీరాణం తదితర జలాశయాలు దాదాపు అడుగంటాయి. వానలు కురవకపోవడం, భూగర్భజలాలు పడిపోవడం, తెలుగు గంగ పథకం కింద చెన్నైకి రావాల్సిన కండలేరు జలాలు కూడా సరఫరా కాకపోవడం లాంటి కారణాలతో నీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. చెన్నై, శివారులోని పలు ఐటీ సంస్థలు, బహుళ ప్రయోజనాల కార్యాలయాలు తాగునీరు లేక క్యాంటీన్లను మూసివేస్తున్నాయి. అంతేకాక సిబ్బందిని ఇంటి నుంచే భోజనం, తాగునీరు, వాడి పారేసే ప్లాస్టిక్‌, పేపర్‌ ప్లేట్లు తెచ్చుకోవాలని కూడా సూచిస్తున్నాయి. ఓ ప్రముఖ హోటల్‌ గ్రూపు యాజమాన్యం కూడా నీటి సమస్య పరిష్కారమయ్యేవరకు భోజనం తయారీ పూర్తిగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. 40 మిలియన్‌ లీటర్ల నీటిని జోలార్‌పేట రైల్వేస్టేషన్‌ నుంచి చెన్నైకి ట్యాంకరు రైలు ద్వారా తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నీటి ఎద్దడి వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మద్రాసు హైకోర్టు కూడా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీటి కొరత నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు హోటల్‌ యజమానులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి శనివారం చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కొరతను అధిగమించే చర్యలు చేపట్టేందుకు బృందాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Link to comment
Share on other sites

chetlu motham kottesi unna land meeda motham apartments kattesi borewells esthe water ela untay. Kotla lo apartments, houses unna water kosam road meediki ravalsinde. Chala states lo summer lo water crisis drought undi but still full apartments floors kaduthunnaru. Future lo enni kotlu umna water undavu. 

  • Upvote 1
Link to comment
Share on other sites

30 minutes ago, Anta Assamey said:

Hyderabad Future kuda ide ... Baga perigipoindi .... [IMG]

mission bhagiratha valla save ayinaru hyd out skirts leka pote ee summer la kukka savu untunde

Link to comment
Share on other sites

kuntalu, cheruvulu, konerlu boodchesaru prati chota. maa oorla galeej gaalu tobacco barns kosam unna chinta/vepa chetlannni chaala rojula kritam kottesaru.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...