Jump to content

టీడీపీకి రాయపాటి గుడ్‌బై


snoww

Recommended Posts

టీడీపీకి రాయపాటి గుడ్‌బై.. ఏ పార్టీలో చేరేదీ చెప్పేశారు! 
22-07-2019 09:54:25
 
 
636993860681962919.jpg
తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కమ్ముకొస్తోంది. కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టిన వెంటనే ఇరు రాష్ట్రాల్లో కుదేలైన ప్రధాన ప్రతిపక్షాల స్థానాన్ని ఆక్రమించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రెండు చోట్లా అధికార పక్షాన్ని ఢీకొట్టే ప్రధాన శక్తిగా ఎదిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ముఖ్యంగా టీడీపీ నేతలే టార్గెట్‌గా బీజేపీ పన్నాగం పన్నుతోంది. ‘ఆపరేషన్‌ కమల్‌’ను బీజేపీ తీవ్రతరం చేసింది. ఎన్నికల్లో పరాజయ భారం నుంచి పూర్తిగా కోలుకోకమునుపే టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో విలీనం అయిపోయింది. గుంటూరు టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. పార్టీ మారే విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. త్వరలోనే బీజేపీలో చేరతానని ప్రకటించారు. బీజేపీలో చేరుతానని స్పష్టం చేస్తూనే.. తాను ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని చెప్పుకొచ్చారు. రాయపాటి టీటీడీ చైర్మన్ పదవి మెలికతోనే టీడీపీలో చేరారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ పదవి పుట్టా సుధాకర్ యాదవ్‌కు దక్కింది. దీంతో అప్పటి నుంచి రాయపాటి ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించడం గమనార్హం.
 
 
మరోవైపు సాంబశివరావును బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ ముఖ్యులు రంగంలోకి దిగారు. ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ రెండ్రోజుల క్రితం గుంటూరులోని రాయపాటి నివాసానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన వస్తున్న విషయం ముందుగానే తెలియడంతో రాయపాటి ఆయనకు విందు కూడా ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా బలమైన కేడర్‌ ఉన్న రాయపాటిని చేర్చుకోవడం ద్వారా పార్టీని పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు. రాంమాధవ్‌ కూడా నేరుగా తమ పార్టీలో చేరాల్సిందిగా రాయపాటిని కోరినట్లు తెలిసింది. ఇద్దరి నడుమ సానుకూల చర్చలే జరిగినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

44 minutes ago, snoww said:

గుంటూరు టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు.

TDP ki pedhadikku ah party lo unnadhi 5 elle ga @3$%

Link to comment
Share on other sites

49 minutes ago, snoww said:

BJP statement for next 5 years

There was No Corruption in Polavaram project  . It was the most corruption free project ever executed in India @3$%

Anthe anthe...  

 

Even Nadikudi - Srikalahasthi railway line construction lo eeyana companies ki involvment undani talk..

Link to comment
Share on other sites

Transtoy padi kalala paatu sukanga vundalante rayapati BJP lo cheralsinde kada...

Polavaram will now be a corruption free project India has ever seen....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...