Jump to content

280 sq yds lo G+5


Hydrockers

Recommended Posts

1 hour ago, Hydrockers said:

Kattocha pulkas ?

Depends on road width but 280 square yards ante even 60 feet road facing vunna kuda g+5 kastame...g+4 quite possible...Gram Panchayat layout aithe Paisal ichi manage cheyochu

Link to comment
Share on other sites

municipal permission ivvaddu.

you will have to mortgage 1 floor to add a penthouse.

after everything is complete municipality people will come and check you built according to rules and mortgage clear chesi noc certificate istharu.

these rules apply within Huda limits 

Link to comment
Share on other sites

తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు చెందిన భవనం కూల్చివేత విషయంలో జీవీఎంసీ అధికారులు తొందరపాటు ప్రదర్శించారనే విమర్శలు వినిపించాయి. భవన యజమాని ఊర్లో లేని సమయంలో...అందులోనూ నోటీసు ఇచ్చిన గంటల వ్యవధిలో కూల్చివేయడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాము నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని జీవీఎంసీ అధికారులు పేర్కొంటుండగా, రాజకీయకక్ష సాధింపులో భాగంగా వైసీపీ నేతలు తెచ్చిన ఒత్తిడితో అధికారులు అలా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ ఆరోపిస్తున్నారు.
 
అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణకు జీవీఎంసీ పరిధిలోని రేసపువానిపాలెం సర్వేనంబర్‌ 32/3లో సుమారు 280 గజాల స్థలం ఉంది. అందులో జీ+5 భవన నిర్మాణానికి ప్లాన్‌ కోసం తన భార్య విజయలక్ష్మి పేరిట 2017 ఫిబ్రవరిలో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో ప్లాన్‌ జారీ అయింది. నిర్మాణం జరుగుతుండగానే పోస్ట్‌ వెరిఫికేషన్‌కు వెళ్లిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఖాళీ స్థలం పన్ను బకాయి చెల్లించలేదంటూ ప్లాన్‌ రెగ్యులర్‌ చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. దీనిపై జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో వీఎల్‌టీ పూర్తిగా చెల్లించి నిర్మాణం చేశారు. అయితే దక్షిణం వైపున గెడ్డ సరిహద్దుగా వుండడంతో బఫర్‌ జోన్‌ కింద మూడు మీటర్లు వదిలేసి, సెట్‌బ్యాక్‌ను మినహాయించాల్సిందని, అలాగే తూర్పు సరిహద్దుగా వున్న ద్వారకానగర్‌ మెయిన్‌రోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో వంద అడుగులుగా వుండడంతో భవిష్యత్తులో విస్తరణకు ఆటంకం లేకుండా కొంత స్థలం వదలాలని... అవేవీ పాటించకపోవడంతో ప్లాన్‌ ప్రాసెస్‌ చేయలేమంటూ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు 2017 ఏప్రిల్‌లో నోటీసులు జారీచేశారు. తాను వాటన్నింటినీ పాటించే నిర్మాణం చేపట్టినందున ప్లాన్‌ ప్రాసెస్‌ చేయాలంటూ పీలా గోవింద్‌ కోరినప్పటికీ అధికారులు సంతృప్తి చెందలేదు.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భవనాల క్రమద్ధీకరణకు బీపీఎస్‌ను ప్రకటించడంతో పీలా గోవింద్‌ సత్యనారాయణ కూడా ఈ ఏడాది జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ దరఖాస్తును పెండింగ్‌లో వుంచిన జీవీఎంసీ అధికారులు భవన క్రమబద్ధీకరణకు ఆస్కారం లేదంటూ ఈనెల తొమ్మిదివ తేదీన తిరస్కరించారు. భవనంపై శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. దీనిని భవన యజమాని గోవింద్‌ సత్యనారాయణకు అందజేసేందుకు ప్లాన్‌ దరఖాస్తులో పేర్కొన్న సీతమ్మధారలోని చిరునామాకు జోన్‌-2 టీపీఓ రమణమూర్తి వెళ్లగా అక్కడ ఎవరూ లేరు. దీంతో ద్వారకానగర్‌లోని భవనం వద్దకు వెళ్లారు. అక్కడ ఆర్డర్‌ కాపీని వాచ్‌మన్‌కు అందజేసి అతని నుంచి సంతకం తీసుకున్నారు. మరొక కాపీని భవనానికి అతికించేశారు.
 
హైడ్రామా మధ్య కూల్చివేత
శనివారం తెల్లవారుజామున పీలా గోవింద్‌ భవనం కూల్చివేయాలని నిర్ణయించిన జీవీఎంసీ అధికారులు పోలీసు బందోబస్తు కోసం శుక్రవారమే నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనాకు లేఖ అందజేశారు. అలాగే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది అంతా అక్కడకు చేరుకున్నారు. ద్వారకానగర్‌ సిగ్నల్‌ నుంచి గురుద్వారా వైపు వాహనాలు రాకుండా రోడ్డును మూసేశారు. అనంతరం యంత్రాల సహాయంతో భవనాన్ని కూల్చివేసే పనులను మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి పీలా కుటుంబ సభ్యులు భవనం కూల్చివేతను నిలిపివేయాలంటూ కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆ కాపీతో రాగా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తీసుకోలేదు. దీంతో జీవీఎంసీ కమిషనర్‌ బంగ్లాకు వెళ్లి డాక్టర్‌ జి.సృజనకు అందజేయడంతో కూల్చివేతను ఆపేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
 
అంతా హడావిడి
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెల్లవారుజామున మూడు గంటలకే భవన నిర్మాణం కూల్చివేత చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వినిపించాయి. భవనం కూల్చివేతకు కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేసినప్పటికీ, కొంత గడువు ఇస్తారని, అందులోనూ భవన యజమాని వారం రోజులుగా ఊర్లో లేనందున కనీసం ఆయన వచ్చి తన వాదన వినిపించే అవకాశం కల్పించాల్సిందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
 
రాజకీయ కక్షసాధింపులో భాగమే: పీలా గోవింద, మాజీ ఎమ్మెల్యే
భవన నిర్మాణంలో తాను నిబంధనలను పాటించానని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ నేతలు తన భవనాన్ని ఆగమేఘాల మీద కూల్చేయాలంటూ జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ ఆరోపించారు. తాను తీర్థయాత్రలో భాగంగా ప్రస్తుతం తిరుమలలో వున్నానని, వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు కూడా అవకాశం లేని సమయంలో కూల్చివేయడం దారుణమన్నారు. తెల్లవారుజామున చీకటి వేళ భవనాలను కూల్చేసిన సంఘటన నగరంలో గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. తన భవనం పక్కనే వున్న గెడ్డ వైపు 13 అడుగులు మినహాయించి నిర్మాణం చేశానని, అధికారులు చూస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు.
 
నిబంధనలు విరుద్ధం కాబట్టే చర్యలు: ఆర్జే విద్యుల్లత, చీఫ్‌ సిటీప్లానర్‌
పీలా గోవింద్‌ భవన నిర్మాణం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వుండడం వల్ల బీపీఎస్‌లో క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. గెడ్డ వైపు బఫర్‌ జోన్‌ను మినహాయించి నిర్మాణం చేపట్టాల్సి వుండగా అలా చేయలేదు. అంతేకాకుండా ద్వారకానగర్‌ మెయిన్‌రోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో వంద అడుగులు కాగా ప్రస్తుతం 75 అడుగులు మాత్రమే ఉంది. భవిష్యత్తు విస్తరణ దృష్టిలో పెట్టుకుని రోడ్డుకు ఇరువైపులా 12.5 అడుగులు ఖాళీ వదిలేయాల్సిందే. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. వీటన్నింటి కారణంగానే గత నెల తొమ్మిదిన బీపీఎస్‌ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఆ విషయం ఆటోమెటిక్‌గా దరఖాస్తుదారుడికి చేరిపోతోంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...