Popular Post dasari4kntr Posted January 14, 2021 Author Popular Post Report Share Posted January 14, 2021 3 ఉదయం 6:30 AM.. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు అవినాష్ తన బెడ్ పైనుంచి...ఒక పక్క రాత్రి నుంచి TV ఇంకా ప్లే అవుతూ వుంది... క్షణకాలం అలోచించి...ఆ పీడ కలని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు... అంతలో “ధడ్ … ధడ్... మంటూ ఎవరో తెలుపు బాదుతున్నారు....” వెళ్లి తలుపు తీశాడు అవినాష్ ఎదురుగా....ఒక పోలీస్ నిలుచుని ఉన్నాడు … పోలీస్: గుడ్ మార్నింగ్ సర్ , మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి … [గంభీరంగా…] అవినాష్ : గుడ్ మార్నింగ్ …. పర్లేదు , విషయం చెప్పండి … [కొంచెం అయోమయం తో] పోలీస్: నిన్నరాత్రి...ఇక్కడికి 10 మైళ్ళ దూరం లో ఒక హత్య జరిగింది…ఎవరుచేశారనేది ఇంకా తెలియదు… సాధారణంగా మా పోలీస్ విచారణ లో భాగంగా ఎవరైనా ఇలాంటి హత్య జరిగిన ప్రాంతానికి కొత్తగా వస్తే, వాళ్ళ వివరాలు తీసుకుంటాం... ముందు ముందు విచారణలో పనికొస్తాయని... మీ వివరాలు కొన్ని రిసెప్షన్ రిజిస్టర్ లో తీసుకున్నాం...కానీ అందులో మీరు “purpose of visit” ని ఖాళీ గా వదిలేశారు..అందుకే మీ తలుపు తట్టాల్సిన అవసరం వచ్చింది.... ఇందులో మీరు భయపడాల్సినదేమి లేదు…ఇది మా రెగ్యులర్ ఫార్మాలిటీ… మీరు అనుమతిస్తే మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి…[అంటూ సూటిగా చూస్తున్నాడు] అవినాష్: ఓకే..అడగండి పోలీస్: మీరు ఏమి చేస్తుంటారు? అవినాష్: software engineer పోలీస్: మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అవినాష్: ఇది నా వెకేషన్ హాలిడేస్, Travel Photography నా హాబీ, అంటూ తన కెమెరా, ట్రయ్ పాడ్ ని చూపించాడు … పోలీస్ : మీరు ఎంత కాలం వుంటారు ఇక్కడ ? అవినాష్ : మరో రెండు గంటలు … పోలీస్ : ఎక్కడికి వెళ్తున్నారు? అవినాష్ : నార్త్ డైరేక్షన్… [అన్నాడు… ముక్తసరిగా…] పోలీస్ : థాంక్ యు మిస్టర్ అవినాష్...అన్నట్టు నార్త్ డైరెక్షన్ అంటే hidden hills county మీదుగా పోవలిసి ఉంటుంది … కొంచెం జాగ్రత్త … సూర్యాస్తమయం కంటే ముందే ఆ కౌంటీ దాటేయండి… [ అని కరచాలనం చేసి వెళ్ళిపోయాడు ] అవినాష్ : ఓకే థాంక్యూ … అవినాష్, ఒక గంటలో రెడీ అయిపోయి … రిసెప్షన్ లో రూమ్ తాళాలు ఇచ్చేసి, అక్కడ ఏవో కొన్ని న్యూస్ పేపర్స్, local attraction మ్యాప్స్ ఉంటే తీసుకుని, తన ప్రయాణం దారి పట్టాడు … నెమ్మదిగా మధ్యాహ్నం సమయానికి … రోడ్డు పైన కొంచెం పక్కగా … “welcome to hidden hills county” అనే బోర్డు కనిపించింది …అందులో కొన్ని అక్షరాలూ ఊడిపోయి , పెయింట్ పెచ్చులు లేచిపోయి ఉన్నాయి … ఎవరు దీనిని సంవత్సరాలుగా పట్టించుకోనట్లు… hidden hills county పేరుకు తగ్గట్టే ఎత్తైన కొండలు , దట్టమైన అడవులు, జలపాతాలతో… ప్రకృతి కి పుట్టినిల్లు లా ఉంది. రోడ్డుకు అటు పక్క ఇటు పక్క చెట్లు … ముందు , వెనుక రోడ్డు తప్ప …వేరే జనసంచారం కానీ వాహన సంచారం కానీ లేదు. దాదాపు రెండు గంటలు అవుతుంది అవినాష్ ఇంకొక వాహనం చూసి రోడ్ పైన… అక్కడక్కడ తుప్పు పట్టి విరిగిపోయిన STOP బోర్డు లు … కొన్ని సంవత్సరాలు గా వెలగట్లేదా అన్నట్లు ఉండే ట్రాఫిక్ లైట్స్...గతుకులు గుంతలతో వంకర టింకర గా వున్నా ఘాట్ రోడ్డు....ఇలానే వెళ్తున్నాడు రెండు మూడు గంటలు … డిసెంబర్ మాసం అవ్వడం వలన సూర్యాస్తమయం తొందరగా అయిపోయి చీకటిపడుతుంది...ఇంతలో పోలీస్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి అవినాష్ కి.. ఎందుకు సూర్యాస్తమయం కొంటె ముందే వెళ్ళిపో అన్నాడా అని ఆలోచిస్తూ...బహుశా రోడ్లు ఇలా ఉంటే చీకట్లో ప్రయాణం కష్టమని చెప్పిఉండొచ్చు అని తనకుతానే సమాధాన పరుచుకున్నాడు... ఇంకా చీకటి పడుతూ ఉండడం తో ప్రయాణం కష్టం అవుతుండడంతో..కార్ ని రోడ్ మధ్య లోనే ఆపి...తన దగ్గరున్న పాత ప్రింటెడ్ మ్యాప్ బుక్ (atlas) తీసి తాను వెళ్తున్న దారిని చూసుకున్నాడు… [ఇప్పుడు మనం వాడుతున్న GPS లాంటి సదుపాయాలు 2000 సంవత్సరం వరకు లేవు] అప్పుడు అర్థం అయింది...తానూ దారి తప్పి చాలా సమయం అయింది అని…అడవిలోకి చాలా దూరం వచ్చేసాడని… ఇంక చేసేదేమి లేక...దెగ్గరలో ఏదయినా టౌన్ ఉంటుందేమో అని చూసాడు... ఒక 50 మైళ్ళు దూరం లో కొండ పైన Hills Church అనే ఊరొకటి ఉందని అర్థమైనది... అప్పటికే ఆకలితో, అలసటతో వున్న అవినాష్ ఆ ఊర్లో తనకి ఆ రోజు రాత్రికి తినటానికి , ఉండడానికి ఏదయినా దొరుకుతుందేమో అని ఆశగా ఆ ఊరివైపు బయలుదేరాడు.... [సమయం 7:30 PM] hills church శివారుకు చేరుకున్నాడు...ఊరు కొండ పైన ఉండడంతో...అప్పుడప్పుడే పొగమంచు మొదలవుతుంది.. నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ టౌన్ లోకి ప్రవేశించి…సెంటర్ లో కార్ ఆపి దిగి ఒక సారి చుట్టూ పక్కల చూసాడు … చూడడానికి కొంచెం పెద్ద ఊరు లాగానే కనిపిస్తున్నా …ఏ ఒక్క ఇంట్లో లైట్ వెలగడం లేదు … అద్దాలు పగిలిపోయిన షాపులు .. చెక్కలతో అడ్డమ్ గా కొట్టేసిన కిటికీల ఇల్లు, కాలిపోయి మొండిగా నిల్చున్న చర్చి శిఖరం … నర మానవుడి సంచారం లేదు ఆ టౌన్ లో … కొంచెం కొంచెం గా పెరుగుతున్న ఆ పొగ మంచు లో … ఆ టౌన్ చూడటానికి .. ఒక haunted ghost town లా వుంది… తనకి ఇక్కడ తినడానికి , ఉండడానికి ఏమి దొరకదు అని నిర్దారించుకుని … మళ్ళి తన అట్లాస్ బుక్ ని ఓపెన్ చేసి చూస్తున్నాడు… ఇంతలో తను motel లో తీసుకున్న అట్రాక్షన్ మ్యాప్ బుక్ పక్కన ఉంది …దాని పైన hills church అని చర్చి బొమ్మ వేసి వుంది… కొంత ఆశ్చర్యం తో ఆ మ్యాప్ ని తీసి చూస్తున్నాడు …hills church (new town) అని వ్రాసి ఉంది … దాని పక్కన … ఒక చర్చి ఫోటో వుంది … దాని గురుంచి ఎదో కొంత సమాచారం కింద రాసి వుంది.. ఆ చర్చి ఫోటో ని చూచి అర్థం చేసుకున్నాడు …కొన్ని నిమిషాల క్రితం తానూ చూసిన చర్చి ఇదేనని ...కాకపోతే అది తగల బడి శిథిలావస్థలో వుంది … మ్యాప్ ముద్రించిన సంవత్సరం చూసాడు … రెండు సంవత్సరాల క్రితం అని వుంది … అదే మ్యాప్ లో తాను ఉన్న ప్రదేశం నుంచి నాలుగు మైళ్ళ దూరం లో hills church (old town) అని వుంది… అక్కడికి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది … newtown నే ఇలా ఉంటే … oldtown ...ఇంకెలా ఉంటుందో... వెల్దామా? వద్దా? అని ఆలోచించుకుంటూ … తనకు అంత కన్నా వేరే దారి లేదని గ్రహించి … బ్రిడ్జి వైపుకు బయలుదేరాడు … ఆ పొగ మంచులో .. (ఇంకా వుంది) 4 Quote Link to comment Share on other sites More sharing options...
friesNfrappe Posted January 14, 2021 Report Share Posted January 14, 2021 Hi bro how are u? Long time! Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 14, 2021 Author Report Share Posted January 14, 2021 Just now, friesNfrappe said: Hi bro how are u? Long time! beautyqueen? i am good...how are you...? Quote Link to comment Share on other sites More sharing options...
friesNfrappe Posted January 14, 2021 Report Share Posted January 14, 2021 Just now, dasari4kntr said: beautyqueen? i am good...how are you...? Yah 😊 fine bro .. nice to see u again 1 Quote Link to comment Share on other sites More sharing options...
SGB Posted January 14, 2021 Report Share Posted January 14, 2021 Karachalanam ante hand shake aa? cop tho hand shake aa? are you supposed to touch a cop in the US?? Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted January 14, 2021 Report Share Posted January 14, 2021 Story manchi interesting ha undhi bro 👏👏 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted January 14, 2021 Report Share Posted January 14, 2021 1 hour ago, SGB said: Karachalanam ante hand shake aa? Yes Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 14, 2021 Author Report Share Posted January 14, 2021 5 hours ago, JustChill_Mama said: Story manchi interesting ha undhi bro 👏👏 thank you... edina spelling mistakes vunte cheppu paidi.. you are helping a lot 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 14, 2021 Author Report Share Posted January 14, 2021 7 hours ago, SGB said: Karachalanam ante hand shake aa? copy tho hand shake aa? are you supposed to touch a cop in the US?? good point... but this story setup was 1997...i assumed situations were different ...back in days Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post dasari4kntr Posted January 15, 2021 Author Popular Post Report Share Posted January 15, 2021 4 పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది… నెమ్మదిగా బ్రిడ్జి పైకి చేరుకున్నాడు…రెండు కొండలను కలుపుతూ...పొడవుగా ఉంది..సుమారు రెండు మైళ్ళు ఉండొచ్చు... ఆ పొగమంచు లో ముందరున్నదేమి కనిపించడం లేదు … డ్రైవింగ్ చాలా కష్టం గా ఉంది … బ్రిడ్జి పైకి రాగానే...సన్నని హోరు గాలి...ఆ హోరు గాలి శబ్దం ఎంతో భయంకరంగా ఉంది...రెండు కొండల మధ్య చిక్కుకున్న గాలి వేగంగా పారిపోతున్నట్టు ఉంది… ఆ హోరు శబ్దంతో అర్థమైంది అవినాష్ ఆ బ్రిడ్జి ఎత్తు ఎంత ఉంటుందో అని… ఒక మోస్తరు వేగంతో కార్ పోతుంది…పొగమంచు వలన కంటి ముందంతా అస్పష్టత...కానీ ఎదో మొండి దైర్యం ఏమి కాదు అని… అలా పొగమంచులో వెళ్తున్న అవినాష్ కార్ కి హఠాత్తుగా ఎదురుగా మరొక కార్ కనిపించింది...తను ఎంత బ్రేక్స్ వేసి ఎంత ప్రయత్నించినా...యాక్సిడెంట్ అవ్వకుండా ఆపలేక పోయాడు… బ్రిడ్జి నడిమధ్యలో ...అవినాష్ కార్ మరొక కార్ ని గుద్దేసింధి… పది నిమిషాలు అలానే కార్ స్టీరింగ్ పైన సొమ్మసిల్లి పడిపోయాడు… ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు...ఎవరో తట్టి లేపినట్టు… కార్ అద్దం లో చూసుకున్నాడు...నుదిటిపైనా గాయమై రక్తం కారుతుంది... అంతలో ఎదో గుర్తుకొచ్చిన వాడిలా...గబగబా తన కార్ దిగి ముందున్న కార్ దెగ్గరికి పరుగున చేరుకున్నాడు...ఎవరైనా ప్రమాదం లో ఉన్నారేమో అని… ఎవరూ లేరూ ఆ కార్ లో...ఎలాంటి రక్తం మరకలు లేవు… పైగా ఆ కార్ వాలకం చూస్తుంటే...అది అలానే నడి రోడ్డు మధ్యలో చాలా కాలం గా అలా ఉన్నట్లుంది … చిరిగిపోయిన సీట్స్, తుప్పు పట్టిపోయిన డోర్ రేకులు, పంక్చర్ అయ్యి అణిగిపోయిన టైర్లు … కార్ వెనుక డిక్కి పైన…”just married” అని బోర్డు ఉంది...అది కూడా శిథిలావస్తలోవుంది... ఇది ఇలా రోడ్డు మధ్యలో ఇంత కాలం ఉందంటే… ఇక్కడకి ఎవరూ రావట్లేదా? అని ఆలోచిస్తున్నాడు… తరిగి వెళ్ళి తన కార్ ని స్టార్ట్ చేయటానికి.. ప్రయత్నించాడు … అది కిఱ్ఱు కిఱ్ఱు మని రెండు మూడు సార్లు అరిచి … ఆగిపోయింది … ఇంజిన్ ఏమైందో అని కార్ బానెట్ ఎత్తి చూసాడు... యాక్సిడెంట్ వలన ఇంజిన్ బాగా దెబ్బతింది… చేసేదేంలేక సిగెరెట్ వెలిగించి..దిక్కులు చూస్తున్నాడు… కొన్ని అడుగుల దూరంలో ....బ్రిడ్జి ఎడమ పక్క పిట్టగోడ (railing)...దెగ్గర ఎదో కదులుతున్నట్టు ఆ పొగమంచులో చూచాయగా కనిపించింది… కొన్ని అడుగులు ముందుకు వేసాడు ఆ దిశగా...కొంచెం కొంచెంగా స్పష్టత వస్తుంది తాను ఏమి చూస్తున్నాడో.... ఒక అమ్మాయి...వెడ్డింగ్ గౌన్ (అమెరికన్ పెళ్లి దుస్తులు) లో ఉంది...బ్రిడ్జి పిట్టగోడ (railing) పైన నిలుచొని ఉంది...సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉండొచ్చు...అమెరికన్ వైట్ లేడీ … ఆ అమ్మాయి కి ఎదురుగా ఒకనిండైన చందమామ రెండు కొండల మధ్య పొందికగా ఉన్నాడు...ఆ వెన్నల వెలుతురుకి...ఆ పొగమంచు లో ఆమె వేసుకున్న తెల్లని వెడ్డింగ్ గౌన్ ట్యూబెలైట్ లా వెలిగిపోతుంది...ఇది చాలదన్నట్లు ఆమె ఎదో కూనిరాగం పాడుతుంది...ఆ శబ్దం అద్భుతం చాటున ప్రళయం లా, ఆనందం చాటున దుఃఖం లా వుంది… అవినాష్ కి ఏమిఅర్థంకావట్లేదు...ఈమె మనిషేనా...దేవకన్య...మరేదయినా...అని సందేహం మొదలయింది…ఆమె వాలకం చూస్తుంటే...నీళ్ళల్లోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది... కొంచెం దైర్యం చేసుకుని...మరో రెండు అడుగులు ముందుకు వేసి.. వణుకుతున్న స్వరం తో …”ఎవరు మీరు ...ఇక్కడేం చేస్తున్నారు…” అన్నాడు… ఎలాంటి సమాధానం రాలేదు ఆమె నుంచి…ఆ కూనిరాగం తప్ప... మరో రెండు అడుగులు ముందుకు వేసి...కొంచెందెగ్గరగా వెళ్ళాడు..అవినాష్… ఆమె.. రెప్పపాటులో...అలా నీళ్ళలోకి దూకేసింది… ఒక్క సారిగా షాక్ తిన్న అవినాష్...పరిగెత్తుకుంటూ ఆ బ్రిడ్జి పిట్టగోడ దెగ్గరికెళ్ళి కిందకు చూస్తున్నాడు...కింద నదిలో ఎదో పడినట్టు నీళ్ల శబ్దం.... అవినాష్ కి ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు...నిర్మానుష్యం గా ఉన్న ఊరు, కార్ యాక్సిడెంట్ … ఇప్పుడు ఇలా కంటి ముందు ఒకళ్ళు దూకేయడం …షాక్ మీద షాక్ లా ఉంది … అంత లో మరో షాక్ … తన వెనకాల నుంచి ఆ కూనరాగం వినపడుతుంది...ఆ శబ్దం కొన్ని నిమిషాలముందు విన్నదే.... తలతిప్పి వెనక్కి చూసాడు...అటుపక్క వున్న బ్రిడ్జి పిట్ట గోడ (railing) పైన అదే మనిషి నిలుచొని ఉంది... అప్పటికే..వరుసగా జరుగుతున్న సంఘటనలతో బుర్ర చెడి వున్నా అవినాష్ మళ్ళి ఆపడానికి దెగ్గరికి వెళ్తున్నాడు… మరొక్కసారి ఆమె నీళ్ళలోకి దూకేసింది… ఇలా ఈ వికృత క్రీడ కొంతసేపు జరిగింది… కొంత మతి భ్రమణం కోల్పోయి..ఆమె వెనుక అటూ ఇటూ తిరుగుతూ ..... అప్పటికే ఆకలి అలసట తో ఉన్న అవినాష్ రోడ్డు మధ్యలో కూలబడిపోయాడు… తనలో శక్తి నశించిపోయింది…నీరసంతో అలానే కూర్చుని చూస్తున్నాడు.. ఎదురుగా మళ్లా ప్రత్యక్షం అయింది ఆమె... ఈ సారి తన వైపే నెమ్మెదిగా వస్తుంది … ఆమె రాక చూస్తుంటే .. ఎదో తెల్లని మేఘం గాల్లో తేలుతూ తన దెగ్గరికి వస్తున్నట్లు వుంది .. ఆ తెల్లని మేఘం అవినాష్ ని చుట్టుముట్టింది … ఒక్కసారిగా .. ఎవరో తన చెవిలో “ పారిపో...ఇక్కడికి రాకు...పారిపో “ అని మెల్లగా చెప్పినట్లు వినిపించింది …. తనకి ఒక్కసారిగా...ఆ రోజు ఉదయాన వచ్చిన పీడకల గుర్తకొచ్చింది... ఆ మరుక్షణమ్ …. ఆమె అదృశ్యం అయింది… (ఇంకా వుంది) 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
dasari4kntr Posted January 15, 2021 Author Report Share Posted January 15, 2021 give me your feedback guys....and suggestions... Quote Link to comment Share on other sites More sharing options...
summer27 Posted January 15, 2021 Report Share Posted January 15, 2021 35 minutes ago, dasari4kntr said: give me your feedback guys....and suggestions... Going good continue 1 Quote Link to comment Share on other sites More sharing options...
Pashuvu Posted January 15, 2021 Report Share Posted January 15, 2021 1 hour ago, dasari4kntr said: give me your feedback guys....and suggestions... Super bro 1 Quote Link to comment Share on other sites More sharing options...
AndhraPickles Posted January 15, 2021 Report Share Posted January 15, 2021 2 hours ago, dasari4kntr said: give me your feedback guys....and suggestions... Ikkada nunchi ee story and thread ni nenu take up chesi.....nee autobiography ni aripinchamantaavaa bro.....🤣 2 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted January 15, 2021 Report Share Posted January 15, 2021 3 hours ago, dasari4kntr said: give me your feedback guys....and suggestions... Good going & very interesting story . 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.