Jump to content

My telugu story


Murari_Murari
 Share

Recommended Posts

దేముడా... ఓ   దేముడా....

         కళ్ళు మత్తుగా మూతలు పడుతున్నాయి....మత్తు మందు వల్ల కావచ్చు. 5 సం. అయ్యింది ఈ బాధ మొదలయి. నడవలేను, తినలేను. చివరికి ఈ రోజు ఆపరేషన్ అన్నారు... ఆపరేషన్ థియేటర్ లో బెడ్ చుట్టూ నర్సులు ... నేను బతికున్నానో, లేదో తెలీట్లేదు....తెల్లగా పొడవుగా ఒకాయన వచ్చేడు...బహుశా దేముడయి ఉంటాడనుకుంటా.....అమ్మయ్య! అడిగేస్తా...నా మనసులో బాధ అంతా వెళ్ళ గక్కేస్తా....
        "దేముడా! ఓ దేముడా!నీకేం తక్కువ చేసా? ప్రతి పెళ్లిరోజు కీ నీ కళ్యాణం చేయించానే. ఒకసారి నడిచి మెట్లెక్కా కుటుంబం తో సహా....ఇంత నరకం నాకే ఎందుకు పెట్టావ్?"
        ఒక గొంతు గంభీరం గా వినిపించింది "నేనడిగిన ప్రశ్నలకు సమాధానం అబద్ధమాడకుండా చెప్తావా నాయనా" " అయ్యో!  మీతో అబద్ధాలా స్వామీ? అడగండి స్వామీ!"
దేముడు: తొందరగా లేచి ఎపుడైనా వాకింగ్ చేసేవా?
నేను:లేదు స్వామీ,రాత్రి పడుకునేసరికి లేటు అవుతుంది.
దే: అప్పటిదాకా ఏం చేస్తావు?
నే: సెల్ ఫోను, టీవీ చూస్తూ టైం గడుపుతాను స్వామీ!
దే:సెలవొస్తే ఏం చేస్తావు?
నే: భార్యతో కలిపి సినిమా కెళ్తా. పక్క ఊరిలో.
దే: మద్యం, ధూమపానం ....అలవాట్లు ఉన్నాయా?
నే: చదువుకునే రోజుల్లో అలవాటయింది స్వామీ, మానలేకపోయా.
దే:ఇంట్లో ఓవెన్ ఉందా? 
నే:ఉంది స్వామి, ఉదయం చేసినవి సాయంత్రం వేడి చేసుకుని తింటాం.
దే: ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
నే: నేను, నా భార్య.
దే:పిల్లలు...
నే:హాస్టల్స్ లో
దే: అమ్మా,నాన్నా....
నే:మాతో ఉండరు.
దే: ఎప్పుడూ తెచ్చి ఉంచుకోవాలి అనిపించలేదా?
నే: లేదు స్వామీ.
దే: పిల్లలు చిన్నప్పుడు ఎపుడైనా దగ్గరకి తీసి పాఠాలు చెప్పేవా?
నే: లేదు స్వామీ. కలిసి సినిమా లకు వెళ్ళే వాళ్ళం ఎపుడైనా.
దే: ఆఫీసు లో నీది కాని సొమ్మును ఎపుడైనా తీసుకున్నావా?
నే: తీసుకున్నా స్వామీ.
దే:నీ తోడ పుట్టిన వాళ్ళకి ఎపుడైనా ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కున్నావా?
నే: ఫోన్ బిల్ ఎక్కువైపోతోంది అని చెయ్యలే స్వామీ.
దే: ఎవరికీ చెయ్యకుండా జాగర్త పడితే బిల్ ఎక్కువ ఎలా అవుతుంది?
నే:నా భార్య వాళ్ళ తమ్ముళ్ళకి, మరదళ్ళకి చేసుకుంటుంది స్వామీ.
దే: భార్యకి వాళ్ళ కుటుంబం మీద ఉన్న ఆసక్తి నీకు నీ కుటుంబం మీద లేదన్నమాట.
నే:.................
దే:భార్య కాకుండా వేరే ఆడవాళ్ళతో.....
నే: ఆసక్తి గా చూసే వాడిని అంత వరకే.
దే:ఎపుడైనా, ఎవరి గురించైనా మంచిగా ఆలోచించావా?
నే: లేదు స్వామీ.నాకెవరూ మంచిగా అనిపించలేదు.
దే:కనీసం భార్యనైనా గౌరవం గా చూసేవా?
నే:పెద్దగా లేదు స్వామి. 
దే: నీ సుఖం కోసం కాకుండా, ఇతరుల గురించి ఎపుడైనా నీ టైం,కష్టం  వెచ్చించి ఎవరికైనా సహాయం చేసేవా?బహుశా నీ సమాధానం లేదనే.
     నేను నీకు మంచి శరీరాన్ని ఇచ్చాను,నీకు ఏ వ్యాధీ పుట్టుకతో రాలేదు. మంచి కుటుంబాన్ని ఇచ్చాను. అటు శారీరకం గా ఆరోగ్యాన్ని నీ చేతులారా పాడు చేసుకున్నావు, ఇటు మానసికం గా కుటుంబ విలువలని కాపాడు కోలేక పోయావు.అంతా అయిపోయేక నా దగ్గర కొచ్చి నాకే ఎందుకిలా చేసేవు స్వామీ? అంటే నేనేం చెయ్యను?ఇప్పటికైనా మించిపోయింది లేదు, దీని నుంచి నువ్వు బయట పడగలిగితే, నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మంచిగా ఆలోచించు. మంచి చెయ్యడానికి ప్రయత్నించు.నిన్ను నువ్వు మార్చుకోడానికి ఇంకో అవకాశం ఇస్తున్నాను.....
నే:తప్పకుండా స్వామీ.మరణం అంచున నుంచుంటే కానీ నాకు బుధ్ధి రాలేదు.ఇంతవరకు రాకుండా నా కథ నా లాంటి ఎంతో మందికి కనువిప్పు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....క్రమంగా మత్తు వదలసాగింది....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

 Share

×
×
  • Create New...

Important Information

We have placed cookies on your device to help make this website better. You can adjust your cookie settings, otherwise we'll assume you're okay to continue.