psycopk Posted April 18, 2024 Author Report Posted April 18, 2024 one month patindi eedu tagindi digataniki... K Kavitha: కవిత అరెస్ట్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 18-04-2024 Thu 19:05 | Telangana కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనని వ్యాఖ్య మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శ బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపణ బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్న కేసీఆర్ అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే అన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శించారు. బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో తాము బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్నారు. అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తాము అప్పుడు బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశామని, పోలీసులు బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దుర్మార్గుడైన ప్రధాని నరేంద్ర మోదీ... బీఆర్ఎస్‌పై కక్ష కట్టారన్నారు. కవితపై ఎలాంటి కేసు లేదు... కక్ష కట్టి అరెస్ట్ చేశారని విమర్శించారు. అందుకే కవితను కుట్రపూరితంగా మనీలాండరింగ్ కేసులో ఇరికించారన్నారు. Quote
Android_Halwa Posted April 18, 2024 Report Posted April 18, 2024 40 minutes ago, psycopk said: బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపణ బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్న కేసీఆర్ అందుకే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని ఆగ్రహం This was KCR’s biggest mistake till date. Idea and implementation rendu fail..Edo ilanti scheme lo CBN dorikindu ani same formula applied, result disaster…B L Santosh mida Non bailable case pettadam, phones tap cheyadam etc lanti panulu cheyadam… Vapu ni chusi balupu anukunadu bapu…scene cut chesthe bidde tohar, koduku mida Repo mapo caselu, alludu mida jara pressure pedithe adu BJP jump.. 1 Quote
psycopk Posted April 19, 2024 Author Report Posted April 19, 2024 Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం... సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి 19-04-2024 Fri 16:20 | National అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి ఈడీ కేసులో గతంలోనే అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి నమోదు చేశారు. శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే ఈడీ కేసులో అప్రూవర్‌గా మారారు. సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అతను అప్రూవర్‌గా మారినట్లయింది. మద్యం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ్, దినేశ్ అరోరా అప్రూవర్లుగా మారారు. కాగా, తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ గత నెలలో అరెస్ట్ చేసింది. Quote
Anta Assamey Posted April 19, 2024 Report Posted April 19, 2024 Sarath uncle manode kada...Why is Jagan not helping KCR in this case... Quote
psycopk Posted April 20, 2024 Author Report Posted April 20, 2024 15 hours ago, Anta Assamey said: Sarath uncle manode kada...Why is Jagan not helping KCR in this case... Appatlo ktr annavi anna manasulo petukunadu ani tadepalli lo gusa gusa https://www.instagram.com/reel/C59zI-1J4fY/?igsh=dmJnYW5ieWM5cGFn Quote
psycopk Posted April 23, 2024 Author Report Posted April 23, 2024 K Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు 23-04-2024 Tue 14:58 | National కేసు పురోగతి వివరాలను కోర్టుకు తెలిపిన ఈడీ న్యాయవాది కవిత కస్టడీని 14 రోజులు పొడిగించిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కవిత కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో మే 7వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవితకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం చూపుతుందని... అందుకే కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. వాదనల అనంతరం కేసు పురోగతి వివరాలను ఈడీ న్యాయవాది... కోర్టుకు అందించారు. కవిత అరెస్ట్‌పై త్వరలో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని తెలిపింది. వాదనలు ముగిసిన అనంతరం కోర్టు కస్టడీని పొడిగించింది. Quote
Spartan Posted April 23, 2024 Report Posted April 23, 2024 Kejri gadu dorikwnta varaku.. idi baitaki raadu Quote
psycopk Posted April 24, 2024 Author Report Posted April 24, 2024 K Kavitha: కవితకు 33 శాతం వాటా కోసం అతను పని చేశాడు... వాట్సాప్ చాట్ ఆధారాలున్నాయి: కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ వాదనలు 24-04-2024 Wed 16:06 | Telangana మనీలాండరింగ్ కేసులో చాలామంది నిందితులకు బెయిల్ రాలేదన్న ఈడీ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయని వెల్లడి మద్యం వ్యాపారం అంశంపై కవితను కలవమని మాగుంటకు కేజ్రీవాల్ చెప్పారన్న ఈడీ రూ.50 కోట్లు ఇవ్వాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కవిత చెప్పారన్న ఈడీ ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో మూడోరోజైన బుధవారం విచారణ జరిగింది. ఈడీ వాదనలు వినిపిస్తూ... మనీలాండరింగ్ కేసులో చాలామంది నిందితులకు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ తిరస్కరించాయని పేర్కొంది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయన్నారు. ఈడీ తరఫున జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశామని... అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదనలో పసలేదని ఈడీ పేర్కొంది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని... హోల్ సేల్ వ్యాపారులు వందల కోట్లు సంపాదించారని... కమీషన్‌ను ఐదు నుంచి 12 శాతానికి పెంచారని పేర్కొంది. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు మద్యం వినియోగదారులకు నష్టం జరిగిందని తెలిపింది. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని... దీని ద్వారా అక్రమాలు జరిగాయని కోర్టుకు వివరించింది. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని ఆరోపించింది. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపినట్లు తెలిపింది. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని, అసాధారణ లాభాలు గడించారని పేర్కొంది. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌ను బలవంతంగా పక్కకు తప్పించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ అంశంలో కేజ్రీవాల్‌ను మొదట కలిసింది మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని పేర్కొంది. సౌత్ నుంచి కొందరు వ్యాపారం చేయడానికి ముందుకొచ్చారని ఈడీ పేర్కొంది. అయితే కవితను కలవమని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేజ్రీవాల్ చెప్పారని వెల్లడించింది. కేజ్రీవాల్ తనను రూ.100 కోట్లు అడిగినట్లు కవితకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని... అయితే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత అడిగారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబుకు... రాఘవ రూ.25 కోట్లు ఇచ్చారని తెలిపింది. వాదనల సందర్భంగా బుచ్చిబాబు చాట్‌లను కోర్టులో ఈడీ న్యాయవాది ప్రస్తావించారు. మద్యం వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పని చేశారని... ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భాగస్వామ్యం పొందారని మాగుంట రాఘవ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపింది. మాగుంట రాఘవ సిబ్బంది గోపీకుమార్ రూ.25 కోట్లను రెండు విడతలుగా బుచ్చిబాబు, బోయినపల్లికి ఇచ్చినట్లు వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. కవితను శరత్‌చంద్రా రెడ్డి హైదరాబాద్‌లో కలిశారని... ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులో శరత్‌చంద్రా రెడ్డి కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. Quote
psycopk Posted May 2, 2024 Author Report Posted May 2, 2024 K Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు 02-05-2024 Thu 09:19 | National ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా కవిత జ్యుడీషియల్ రిమాండులో వున్న కవిత సీబీఐ కేసులో బెయిల్ కావాలంటూ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై గురువారం తుది తీర్పు రానుంది. మొదట మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు సీబీఐ కేసులో బెయిల్ కావాలని ఆమె రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, సీబీఐ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో కవిత కీలకమైన వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో కవిత బెయిల్‌పై నేడు న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్‌ను న్యాయస్థానం తిరిస్కరించిన విషయం తెలిసిందే. Quote
psycopk Posted May 6, 2024 Author Report Posted May 6, 2024 K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో స్వల్ప ఊరట 06-05-2024 Mon 19:48 | Telangana భౌతికంగా కోర్టు ఎదుట హాజరుపరచాలని కోర్టులో కవిత పిటిషన్ ఆమె విజ్ఞప్తికి అంగీకారం తెలిపిన న్యాయస్థానం రేపు కవితను కోర్టులో హాజరుపరిచే అవకాశం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో సోమవారం స్వల్ప ఊరట లభించింది. ఆమెను ప్రత్యక్షంగా కోర్టు ఎదుట హాజరుపరచాలని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. తన జ్యుడీషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... ఆమె విజ్ఞప్తికి అంగీకరించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఆమె మొదటిసారి కోర్టుకు హాజరైనప్పుడు మీడియాతో మాట్లాడటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెండుసార్లు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రేపు ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. Quote
Spartan Posted May 6, 2024 Report Posted May 6, 2024 @psycopk bail petition rejected. No Bail For Kalvakuntla Kavitha కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పిటిషన్లను తిరస్కరించిన కోర్టు#KavithaArrested — M9 NEWS (@M9News_) May 6, 2024 2 Quote
Android_Halwa Posted May 6, 2024 Report Posted May 6, 2024 Koduku exam ayipoyi, exam result kuda vachi vuntayi… First class lo pass ayevuntadu…hopefully. 2 Quote
psycopk Posted May 6, 2024 Author Report Posted May 6, 2024 1 hour ago, Spartan said: @psycopk bail petition rejected. No Bail For Kalvakuntla Kavitha కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పిటిషన్లను తిరస్కరించిన కోర్టు#KavithaArrested — M9 NEWS (@M9News_) May 6, 2024 Kcr bus tour chusi posukunadu judge antuna pinkies 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.