Jump to content

update on kavita case

Recommended Posts

Posted

Khujliwal gadu malli 7 days extension adgindu health grounds meeda

reports chupinchi surrender escape aidam ani 

Posted

KCR: ఢిల్లీ మద్యం విధానం కేసు... కేసీఆర్‌కు ముందే తెలుసున్న ఈడీ 

28-05-2024 Tue 18:10 | Telangana
  • ఢిల్లీ మద్యం పాలసీ గురించి కేసీఆర్‌కు కవిత చెప్పారన్న ఈడీ
  • ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీమ్ సభ్యులను కవిత పరిచయం చేసినట్లు వెల్లడి
  • కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారన్న ఈడీ
  • కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపిన ఈడీ
 
ED says KCR know about Delhi Liquor policy issue

ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ... కోర్టుకు తెలిపింది.

కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని... ఆ తర్వాత బుచ్చిబాబు... సమీర్ మహేంద్రను కేసీఆర్‌కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ... కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు.

Posted

K Kavitha: మద్యం పాలసీ కేసులో కేసీఆర్ పేరును ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు: కవిత లాయర్ 

28-05-2024 Tue 20:05 | Telangana
  • ఈడీ కేసీఆర్ పేరును ఎక్కడా పేర్కొనలేదని వెల్లడి
  • మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ఈడీ ప్రస్తావించినట్లు వెల్లడి
  • రాఘవ తన వాంగ్మూలంలో తండ్రి శ్రీనివాసులు పేరును ప్రస్తావించారని వ్యాఖ్య
 
Kavithas lawyer responded on KCR name ED counter

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ ఎక్కడా కేసీఆర్ పేరును ప్రస్తావించలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. ఈడీ వాదనలలో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ... ఈడీ ఎక్కడా కేసీఆర్ పేరును రాయలేదన్నారు.

వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించిందని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావన మాత్రమే ఈడీ చేసిందన్నారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి మద్యం కేసులో ఉన్న వారిని పరిచయం చేశారని ఈడీ పేర్కొందన్నారు. 

Posted
2 hours ago, psycopk said:

KCR: ఢిల్లీ మద్యం విధానం కేసు... కేసీఆర్‌కు ముందే తెలుసున్న ఈడీ 

28-05-2024 Tue 18:10 | Telangana
  • ఢిల్లీ మద్యం పాలసీ గురించి కేసీఆర్‌కు కవిత చెప్పారన్న ఈడీ
  • ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీమ్ సభ్యులను కవిత పరిచయం చేసినట్లు వెల్లడి
  • కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారన్న ఈడీ
  • కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపిన ఈడీ
 
ED says KCR know about Delhi Liquor policy issue

ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ... కోర్టుకు తెలిపింది.

కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని... ఆ తర్వాత బుచ్చిబాబు... సమీర్ మహేంద్రను కేసీఆర్‌కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ... కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు.

anduke BJP leader B Santosh ni arrest chesi blackmail chese pla lo unde anta abba kodukulu... anta confident ga em pekkuntaro peekondi ani...

Correct arrest aye roju early morning B.Santosh was able to escape to Kerala

KCR got too furious about how he was able to do that..

inka chetulu ettesary appudu

@psycopk

  • Upvote 1
Posted
4 minutes ago, mettastar said:

Ee saapaniki vimochanam enti?

brs ni bjp lo vilenam cheyatame..

Posted
3 hours ago, psycopk said:

brs ni bjp lo vilenam cheyatame..

Hmm emundile next elections ki BJP tho tie up pettukuntaru 

Posted
6 minutes ago, mettastar said:

Hmm emundile next elections ki BJP tho tie up pettukuntaru 

Kcr gadu bayataku ravataniki ista padadu… its better to merge than tie up.. harish will go to congress..

Posted

K Kavitha: మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఛార్జిషీట్... పరిగణనలోకి తీసుకున్న కోర్టు 

29-05-2024 Wed 16:30 | Telangana
  • జూన్ 3న విచారణకు హాజరు కావాలని కవిత, మరో నలుగురికి సమన్లు
  • గోవా ఎన్నికల సమయంలో ఏఏపీ తరఫున ప్రచారం చేసిన నలుగురి పేర్ల ప్రస్తావన
  • మద్యం పాలసీ కేసులో గోవాకు డబ్బు ఎలా చేరిందో ఛార్జిషీట్‌లో పేర్కొన్న ఈడీ
 
Delhi liquor case hearings on June 3

ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జిషీట్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జిషీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.

గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేసిన దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్‌లను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ అనుబంధ ఛార్జిషీట్‌లో అన్ని వివరాలు వెల్లడించారు. మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరిందో ఇందులో ఈడీ పేర్కొంది. 

Posted

Delhi Liquor Scam: మరో నెల రోజులు జైలులోనే కవిత.. కారణం ఇదే! 

01-06-2024 Sat 08:56 | Telangana
BRS MLC K Kavitha in jail for another month
 
  • ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితపై ఆరోపణలు
  • మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్
  • ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • బెయిలు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
  • నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు
  • వచ్చే నెల మొదటి వారంలో బెయిలు పిటిషన్‌పై తీర్పు!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైలులో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్టయ్యారు. తీహార్ జైలులో ఉండగానే సీబీఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిలు కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బెయిలు కోసం కవిత పెట్టుకున్న పిటిషన్‌పై మే 27, 28న వాదనలు జరగ్గా తీర్పును కోర్టు రిజర్వు చేసింది.

ఈ నెలంతా సెలవులే
బెయిలుపై తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో కవిత మరో నెల రోజులు జైలులో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వు చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు. కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు నిన్న బెయిలు పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్ట్రార్ తెలియజేశారు. దీంతో కోర్టు సెలవులు ముగిశాక కానీ బెయిలుపై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. జూన్ 30 ఆదివారం కావడంతో జులై మొదటి వారంలోనే కవిత బెయిలు పిటిషన్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ నెల 3తో కవిత జుడీషియల్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోమారు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది.

Posted

PMLA act ni baga vadi dobutunaru ga...Inka enni rojulu unchutaru ra maa akka ni...33mtnj.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...