Jump to content

Recommended Posts

Posted

Chandrababu: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు వర్క్ షాప్ 

23-03-2024 Sat 11:09 | Andhra
  • ఈ మధ్యాహ్నం 1.30 గంటల వరకు వర్క్ షాప్
  • కీలక ప్రసంగం చేయనున్న చంద్రబాబు
  • వ్యూహాలను ఎలా అమలు చేయాలనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు
 
Chandrababu workshop to TDP candidates

రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలను రచిస్తున్నారు. చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను టీడీపీ విడుదల చేసింది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ఛార్జీలకు ఈరోజు టీడీపీ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ వర్క్ షాప్ కు చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వర్క్ షాప్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. 11 గంటలకు వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ వర్క్ షాప్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు... వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా హాజరుకాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార వైసీపీ పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి, అభ్యర్థులు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

Posted

 

Chandrababu: పొత్తుల వల్ల కొందరికి టికెట్లివ్వలేకపోయా: చంద్రబాబు 

23-03-2024 Sat 13:33 | Andhra
  • మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లు ఉన్నారని వెల్లడి
  • వారి త్యాగం మరువలేనన్న టీడీపీ అధినేత
  • పార్టీపరంగా, సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరణ
 
Chandrababu Speech

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. టీడీపీ కోసం పనిచేసిన 31 మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. అయితే, పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని, ఇకపైనా మర్చిపోబోనని స్పష్టం చేశారు. మూడు పార్టీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లు ఉన్నారని చెప్పారు. పొత్తుల కారణంగా అందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదని వివరించారు. పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఈ మూడు పార్టీల నేతల త్యాగాల పునాది రాష్ట్ర భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.

రాగద్వేషాలకు, రికమెండేషన్లకు అతీతంగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే వారిని, నిలబెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. టికెట్ దక్కని నేతల త్యాగాన్ని పార్టీ గుర్తుంచుకుంటుందని, ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలుగుతోందని, రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు ప్రజాసేవకు ముందుకు వస్తారని పేర్కొన్నారు.

రాజకీయాలను జగన్ వ్యాపారం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే అని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తారని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. పురంధేశ్వరిపై, పవన్ కల్యాణ్ పై, జనసేన పార్టీపై.. అందరిపైనా తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

Posted

Chandrababu: వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలి: చంద్రబాబు 

23-03-2024 Sat 14:14 | Andhra
  • పెద్ద నోట్ల రద్దు కావాలనేది తన ఆలోచన అన్న చంద్రబాబు
  • మోదీ కూడా ఆ దిశగా ఆడుగులు వేస్తున్నారని వెల్లడి
  • రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలని వ్యాఖ్యలు 
 
Chandrababu says digital currency must be implemented to tackle parties like YSRCP

దేశంలో పెద్ద నోట్లు రద్దు కావాలనేది తన ఆలోచన అని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ వంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని అభిప్రాయపడ్డారు. రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని చంద్రబాబు తెలిపారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని విమర్శించారు. అసలు, జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటాడని ధ్వజమెత్తారు.

Posted

Chandrababu: పురందేశ్వరి నా కుటుంబ సభ్యురాలే కావొచ్చు... కానీ...!: చంద్రబాబు 

23-03-2024 Sat 14:27 | Andhra
  • పురందేశ్వరి రాజీనామా అంటూ ఫేక్ లెటర్
  • విజయవాడ పోలీసులకు ఏపీ బీజేపీ ఫిర్యాదు
  • వైసీపీ చేసే ప్రతి పని ఫేక్ అంటూ చంద్రబాబు విమర్శలు
 
Chandrababu reacts on fake letter about Purandeswari

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా అంటూ ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర బీజేపీ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ సోషల్ మీడియా వారికే ఇలాంటి ఫేక్ లెటర్లు వ్యాప్తి చేసే అవసరం ఉందని తన ఫిర్యాదులో పేర్కొంది. 

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ చేసే ప్రతి పని ఫేక్ అని ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేశారని ఫేక్ లెటర్ తో ప్రచారం చేశారు, ఇది టెంపరరీ పొత్తు అని నా పేరుతోనూ ఫేక్ లెటర్లు వదిలారు అని చంద్రబాబు మండిపడ్డారు. 

"దగ్గుబాటి పురందేశ్వరి నా కుటుంబానికి చెందిన వ్యక్తే కావొచ్చు... కానీ ఆమె 30 ఏళ్లుగా ఇతర పార్టీల్లో ఉన్నారు. ఆమె విషయంలో అనేక ఫేక్ వార్తలు తీసుకువచ్చారు. జనసేన, పవన్ కల్యాణ్ పైనా ఫేక్ వార్తలు వచ్చాయి" అని చంద్రబాబు వివరించారు.

Posted

Chandrababu: ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖాయం: చంద్రబాబు ధీమా 

23-03-2024 Sat 14:44 | Andhra
  • ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు
  • అందుకే అందరికీ న్యాయం చేయలేకపోయామన్న చంద్రబాబు
  • చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశామని వెల్లడి
  • కూటమికి చెందిన ప్రతి అభ్యర్థి గెలవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటన
 
Chandrababu says he never forget leaders who sacrificed seats

సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఓ కూటమిగా ఏర్పడిన సంగతి  తెలిసిందే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా... టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా... టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. 

మూడు పార్టీల పొత్తు అనంతరం అన్ని విషయాలు లోతుగా పరిశీలించిన మీదటే అభ్యర్థుల ఎంపిక చేశామని, బరిలో దింపే ప్రతి అభ్యర్థి గెలవాలన్నదే కూటమి లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఏపీలో మూడు పార్టీల కూటమి 160కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి 400కి పైగా లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు. 

అభ్యర్థి ఏ పార్టీ వారైనా ఎన్డీయే అభ్యర్థిగానే చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడు పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవితకు నాంది అని ఉద్ఘాటించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...