Jump to content

దావోస్ లో మూడో రోజు మరింత బిజీగా చంద్రబాబు.. బిల్ గేట్స్ తో సమావేశంకానున్న సీఎం


psycopk

Recommended Posts

 

Chandrababu: దావోస్ లో మూడో రోజు మరింత బిజీగా చంద్రబాబు.. బిల్ గేట్స్ తో సమావేశంకానున్న సీఎం! 

22-01-2025 Wed 11:30 | Andhra
Chandrababu to meet Bill Gates today in Dawos
 

 

  • యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్ అధిపతులతో భేటీ కానున్న చంద్రబాబు
  • గ్రీన్ కో సంస్థతో ఎంవోయూ కుదుర్చుకోనున్న ముఖ్యమంత్రి
  • కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొననున్న చంద్రబాబు
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మూడో రోజైన ఈరోజు కూడా చంద్రబాబు పలు హైప్రొఫైల్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. 

ఈరోజు యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీ కో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఈరోజు చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఏపీ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చలు జరుపుతారు. 

సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. సస్టెయినబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. 

దీనితోపాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. సహజ వ్యవసాయం, గ్రీన్ హైడ్రోజన్ రెన్యువబుల్ ఎనర్జీ, ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలపై చంద్రబాబు చర్చలు జరుపుతారు. 

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వకమైన పాలసీలు, విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలపై పెట్టుబడిదారులకు చంద్రబాబు వివరిస్తారు. 

 

 

 

Link to comment
Share on other sites

Chandrababu: గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలం: దావోస్ లో సీఎం చంద్రబాబు 

22-01-2025 Wed 17:47 | Andhra
CM Chandrababu says AP suitable for Google Cloud expansion
 

 

  • విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని గూగుల్ కు విజ్ఞప్తి
  • మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం
  • దావోస్ లో మూడో రోజు కూడా చంద్రబాబు కీలక సమావేశాలు
సర్వర్‌ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్‌ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 

సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడో రోజు పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు.  

గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు 

క్లౌడ్ ప్రొవైడింగ్ రంగంలో  ప్రపంచంలో మూడో అతి పెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్.. తన ప్లాట్‌ఫామ్ కింద ఇప్పటికే భారత్‌లోని ఢిల్లీ, ముంబైలో రెండు క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో తమ ‘డేటా సిటీ’ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందకు ఏపీతో ఒప్పందం చేసుకుంది. 

పెట్రోనాస్ ప్రెసిడెంట్‌తో ముఖ్యమంత్రి చర్చలు 

పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ‘పెట్రోనాస్’ మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యులస్‌కు సంబంధించి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంటులో రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముహమ్మద్ తౌఫిక్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. 

పెప్సీకో అధిపతులతో సమావేశం

పెప్సీకో ఇంటర్నేషన్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సీకో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్‌. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్... విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. 

కుర్‌కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సీకో తమ సప్లై చైన్‌ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్‌ఎఫ్‌తో భాగస్వామ్యం కావాలని సూచించారు. 

బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయ ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించిన ముఖ్యమంత్రి... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఏపీకి రావాలని వారిని ఆహ్వానించారు.
20250122fr6790dfd6c64cd.jpg20250122fr6790dfe09474d.jpg20250122fr6790dfe9c558f.jpg20250122fr6790dff46476b.jpg20250122fr6790e00acf706.jpg
Link to comment
Share on other sites

 

Nara Lokesh: దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో సమావేశానికి కాలినడకన నారా లోకేశ్... వీడియో ఇదిగో! 

22-01-2025 Wed 15:56 | Andhra
Nara Lokesh reaches Congress Center in Davos by walk
 

 

  • దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
  • ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల వేట
  • కీలక సమావేశాలతో చంద్రబాబు, నారా లోకేశ్ బిజీ
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, పెట్టుబడుల సాధనకు శక్తిమేర కృషి చేస్తున్నారు. 

కాగా, దావోస్ లోని కాంగ్రెస్ సెంటర్ లో ఓ సమావేశానికి నారా లోకేశ్ కాలినడకన వెళ్లడం ఓ వీడియాలో కనిపించింది. తాము బస చేస్తున్న హోటల్ నుంచి వాహనంలో బయల్దేరిన లోకేశ్... మార్గమధ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ట్రాఫిక్ జామ్ లో వాహనం నిలిచిపోవడంతో, తన బృందంతో కలిసి ఆయన రోడ్డు మార్గంలో కాలినడకన కాంగ్రెస్ సెంటర్ చేరుకున్నారు. కీలక సమావేశానికి సకాలంలో చేరుకోవాలన్న ఆయన తపన పట్ల నెటిజన్లు అభినందిస్తున్నారు.

 

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Davos: దావోస్‌లో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు... రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఫడ్నవీస్ 

22-01-2025 Wed 18:15 | National
Three CMs set for a round table discussion on a plethora of themes
 

 

  • 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు 
  • దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమం
  • చర్చకు వచ్చిన వివిధ అంశాలు
దావోస్‌లో ఒకే వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కనిపించారు. ఇక్కడ జరిగిన 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాల అభివృద్ధి-సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
20250122fr6790ea02252ef.jpg20250122fr6790ea3e5526f.jpg20250122fr6790ea50c112e.jpg20250122fr6790ea6e8d8f4.jpg20250122fr6790ea83d9a79.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...