psycopk Posted February 10 Author Report Posted February 10 Pawan Kalyan: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి పట్ల తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్ 10-02-2025 Mon 15:12 | Both States చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి ఖండించిన పవన్ కల్యాణ్ రంగరాజన్ కు అండగా ఉండాలని జనసేన శ్రేణకుల నిర్దేశం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందనితెలిసితీవ్ర ఆవేదనకు గురయ్యానని వెల్లడించారు. రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది ఒక వ్యక్తిపై కాదు... ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని స్పష్టం చేశారు. "కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మపరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు... పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగరాజన్ నాకు పలు విలువైన సూచనలు అందజేశారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. రంగరాజన్ పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్లి రంగరాజన్ ను పరామర్శించి, అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. Quote
Telugodura456 Posted February 10 Report Posted February 10 Rangarajan thakkuvami kaadhu. Pedda loose talk gaadu. Full politics lo dhoorathaadu. Quote
psycopk Posted February 12 Author Report Posted February 12 Rangarajan Attack Case: రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి! 12-02-2025 Wed 18:14 | Telangana చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై ఇటీవల దాడి 22 మందిపై కేసు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు నిందితులు అరెస్ట్ పరారీలో 16 మంది నిందితులు వెలుగులోకి రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు! చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిపై అబిడ్స్, గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరరాఘవరెడ్డి విచారణలో నేరాన్ని అంగీకరించాడు. గత జనవరిలో వీరరాఘవరెడ్డి అర్చకుడు రంగరాజన్ ను కలిశాడు. వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో, నిందితులంతా జనవరి 25న పెనుగొండ ఆలయంలో కలుసుకున్నారు. ఫిబ్రవరి 4న మరోసారి దమ్మాయిగూడలో సమావేశమయ్యారు. తమ మాట వినకపోతే రంగరాజన్ పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న వారు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తాము చెప్పినట్టు చేయకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక, రంగరాజన్ పై దాడిని వీడియో చిత్రీకరించిన నిందితులు... ఆ వీడియోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.