psycopk Posted May 6 Report Posted May 6 Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డి సహా దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సీబీఐ కోర్టు 06-05-2025 Tue 16:28 | Both States ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు ఐదుగురిని దోషులుగా ప్రకటించిన సీబీఐ కోర్టు యావజ్జీవ శిక్షకు మీరంతా అర్హులన్న జడ్జి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చిన హైదరాబాద్ సీబీఐ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన పీఏ ఏ7 అలీఖాన్, ఏ3 వి.డి. రాజగోపాల్ లకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెప్పున జరిమానా విధించింది. వీరిలో ఐదో దోషిగా ఓబులాపురం మైనింగ్ కంపెనీని కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. శిక్షను ఖరారు చేస్తున్న సమయంలో జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యావజ్జీవ శిక్షకు మీరంతా అర్హులని ఆయన అన్నారు. మీకు పదేళ్ల జైలు శిక్షను ఎందుకు విధించకూడదని ప్రశ్నించారు. శిక్ష ఖరారైన వారందరినీ కాసేపట్లో జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, వీరు అప్పీల్ కు వెళ్లవచ్చా అనే విషయాన్ని కోర్టు ఇంకా ప్రకటించలేదు. Quote
psycopk Posted May 6 Author Report Posted May 6 Gali Janardhan Reddy: ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సహా మరో నలుగురిని దోషులు ప్రకటించిన సీబీఐ కోర్టు... సబితకు క్లీన్ చిట్ 06-05-2025 Tue 16:04 | Both States వి.డి. రాజగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ లను దోషులుగా ప్రకటించిన కోర్టు సబితతో పాటు మాజీ ఐఏఎస్ కృపానందంకు క్లీన్ చిట్ ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసులో ఐదుగురికి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పును వెలువరించింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్ధన్ రెడ్డి (ఏ2), ఆయన పీఏ అలీఖాన్ (ఏ7)), వి.డి.రాజగోపాల్ (ఏ3), శ్రీనివాస్ రెడ్డి (ఏ1), ఓబులాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వె మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2004 - 2009 మధ్య గనుల శాఖ మంత్రిగా సబిత పని చేశారు. అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ కేసులో లుగా మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని ఇప్పటికే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వీరిలో ఒక నిందితుడు (లింగారెడ్డి) మృతి చెందారు. మిగిలిన ఏడు మందిలో ఇద్దరికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వగా... మిగిలిన ఐదుగురిని దోషులుగా తేల్చింది. దోషులకు కోర్టు ఇంకా శిక్షను ఖరారు చేయలేదు. కాసేపట్లో శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. Quote
psycopk Posted May 6 Author Report Posted May 6 7 ante anna ki jujubi... ala time pass chesi kallu musi teriche lopu aaipotadi anukune rakam... inka vadu enduku neetiga untadu.... jagga enjoy Quote
psycopk Posted May 6 Author Report Posted May 6 eedike 7 yrs padindi ante.. sajjala ki one day vestara?? Sajjala Ramakrishna Reddy: సజ్జల కుటుంబం భూకబ్జా నిజమే.. కమిటీ నిర్ధారణ 06-05-2025 Tue 10:50 | Andhra వైఎస్సార్ జిల్లా సీకే దిన్నెలో సజ్జల కుటుంబం భూ ఆక్రమణలు మొత్తం 63.72 ఎకరాలు కబ్జా చేసినట్లు విచారణ కమిటీ నిర్ధారణ ఆక్రమణలో 52.40 ఎకరాల అటవీ భూమి, పాయవంక రిజర్వాయర్ భూమి అక్రమిత భూముల్లో నిర్మాణాలు, ప్రభుత్వ రాయితీల వినియోగం భూమి స్వాధీనానికి, కఠిన చర్యలకు ప్రభుత్వానికి కమిటీ సిఫారసు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు విచారణలో తేలింది. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె గ్రామ పరిధిలో ఏకంగా 63.72 ఎకరాల భూమిని వారు కబ్జా చేశారని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆక్రమణలో అటవీ, ప్రభుత్వ భూములు విచారణ కమిటీ నివేదిక ప్రకారం, సజ్జల కుటుంబం ఆక్రమించుకున్న భూమిలో సింహభాగం అటవీ శాఖకు చెందినదే. సీకే దిన్నె గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1629లో ఏకంగా 52.40 ఎకరాల అటవీ భూమిని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమించినట్లు కమిటీ గుర్తించింది. దీంతో పాటు, గతంలో పాయవంక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, మరికొంత అసైన్డ్ భూమి కూడా ఈ ఆక్రమణలో ఉన్నట్లు తేలింది. ఈ భూముల చుట్టూ కంచె వేయడమే కాకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఒక అతిథి గృహం, నాలుగు గదులను నిర్మించారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అక్రమ సాగు.. ప్రభుత్వ రాయితీలు ఆక్రమించుకున్న అటవీ భూముల్లో సజ్జల కుటుంబ సభ్యులు పండ్ల తోటలు పెంచుతున్నారని, అడవిని ధ్వంసం చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించారని కమిటీ తెలిపింది. కేవలం అక్రమంగా సాగు చేయడమే కాకుండా, ఆ భూముల్లో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు, మామిడి కాయల నిల్వ కోసం 'హార్వెస్టింగ్ రూం' నిర్మాణానికి ప్రభుత్వ పథకాల కింద రాయితీలు కూడా పొందారని నివేదిక స్పష్టం చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న కుమారుడైన సజ్జల సందీప్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులను ఈ భూముల ఆక్రమణదారులుగా కమిటీ గుర్తించింది. గతంలో ఫిర్యాదులు.. హైకోర్టు జోక్యం కడప నగరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 'సజ్జల ఎస్టేట్' భూముల కబ్జాపై రాజా నాయక్ అనే స్థానికుడు 2022 నుంచి పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వ హయాంలో అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఈ విచారణను వ్యతిరేకిస్తూ సజ్జల సందీప్‌రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. సీకే దిన్నె పరిధిలో తమకు 184.32 ఎకరాలు ఉన్నాయని, అందులో పండ్ల తోటలు సాగు చేస్తున్నామని, ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరారు. దీనిపై హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూనే, విచారణ కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. సర్వేలో వెల్లడైన వాస్తవాలు.. 2014లోనే నోటీసులు హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్, కడప ఆర్డీవో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్, బద్వేల్ సబ్ డివిజనల్ అటవీ అధికారితో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సజ్జల కుటుంబ సభ్యుల ప్రతినిధుల సమక్షంలోనే సర్వే నిర్వహించింది. సర్వేలో మొత్తం 201.17 ఎకరాలు సజ్జల కుటుంబం ఆధీనంలో ఉన్నట్లు తేలింది. అయితే, వారి పేరిట ఉన్న పట్టా భూమి కేవలం 137.45 ఎకరాలు మాత్రమేనని, మిగిలిన 63.72 ఎకరాలు ఆక్రమిత భూమేనని కమిటీ నిర్ధారించింది. కాగా, ఈ అటవీ భూముల ఆక్రమణపై 2014లోనే సంబంధిత ఫారెస్ట్ రేంజ్ అధికారి సజ్జల కుటుంబానికి నోటీసులు జారీ చేసినట్లు కూడా కమిటీ తన నివేదికలో పేర్కొంది. భూములు స్వాధీనం చేసుకోవాలని సిఫారసు సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూముల్ని ఆక్రమించి పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేశారని కమిటీ అభిప్రాయపడింది. ఆక్రమణకు గురైన 52.40 ఎకరాల అటవీ భూమిని తక్షణమే అటవీ శాఖ స్వాధీనం చేసుకుని, పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. అటవీ, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 1 Quote
psycopk Posted May 6 Author Report Posted May 6 ipudu anandi jai jagan ani.. G Dinesh Kumar Reddy: ఏపీలో ఓ న్యాయవాదికి కీలక పదవి ఇచ్చారు .. వైసీపీ సానుభూతిపరుడని తెలియడంతో పీకేశారు .. 06-05-2025 Tue 08:28 | Andhra ఏపీ సర్కార్‌లో కీలక పరిణామం పొన్నవోలు అనుచరుడు దినేశ్ కుమార్ రెడ్డికి కీలక నామినేటెడ్ పదవి సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం నియామకాన్ని రద్దు చేసిన సీఎండీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒక న్యాయవాదికి ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. అనంతరం, ఆ న్యాయవాది వైసీపీ సానుభూతిపరుడని పేర్కొంటూ కేటాయించిన నామినేటెడ్ పదవిని రద్దు చేసింది. దీంతో ఆ న్యాయవాది కుటుంబంలో ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. విషయంలోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన న్యాయవాది జి. దినేశ్ కుమార్ రెడ్డిని ఎస్‌పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిల్ (బీఎల్‌సీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకంపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి పేరిట అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అంగళ్లు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం, వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘటనలో చంద్రబాబు సహా వందలాది మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనల విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, దినేశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు దినేశ్ కుమార్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టడంతో, నాడు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. దీంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో దినేశ్ కుమార్ రెడ్డి నియామకాన్ని రద్దు చేస్తూ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పార్టీ శ్రేణులు శాంతించారు. ఇదే క్రమంలో అసలు ఈ నియామకానికి సిఫారసు చేసింది ఎవరు అనే దానిపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ పరిణామంతో దినేశ్ కుమార్ రెడ్డి కుటుంబంలో కీలక పదవి వచ్చిందన్న ఆనందం రోజు వ్యవధిలోనే ఆవిరైంది. Quote
Pavanonline Posted May 6 Report Posted May 6 Oh my cbi, idi kala nijamga 😯 Ina appeal chesi higher courts judgement ki inko 10 years easy peasy Quote
Copilot Posted May 6 Report Posted May 6 Lol, manam inni sankalu naaki em peekutham, manchi gaa eecottuptions better emo Quote
karna11 Posted May 6 Report Posted May 6 So, MLA contest cheyochuu but not as CM is it right ? After prison term @Android_Halwa @Sizzler Quote
Android_Halwa Posted May 6 Report Posted May 6 10 minutes ago, karna11 said: So, MLA contest cheyochuu but not as CM is it right ? After prison term @Android_Halwa @Sizzler Not even as an MLA or perhaps any elected post. More than two years makes ineligible for elections. Eediki 7 years padindi.. 1 Quote
Sizzler Posted May 6 Report Posted May 6 11 minutes ago, karna11 said: So, MLA contest cheyochuu but not as CM is it right ? After prison term @Android_Halwa @Sizzler Case judgement kooda ichesaka Malli Jagan ni Enduku involve chestaru … Quote
Copilot Posted May 6 Report Posted May 6 1 minute ago, Sizzler said: Case judgement kooda ichesaka Malli Jagan ni Enduku involve chestaru … Lol raa Quote
Android_Halwa Posted May 6 Report Posted May 6 Paisal tho ahankaram ekkuvayyi manaki evadra addu ani athinilgudu niligithd jarigedi ide… Akrama sampadana kosam akariki grama devathala gudi ni kuda kulakottinav….This sentence is nothing but karma. Entha peddodivi aina chinnodivi aina daivam mundu a baluou supisthe daridram jiddu pattinattu padtadi… Animal Fat ani abadhalu seppina yedhavalu kuda line la vunnaru….day is not far away. 1 Quote
aratipandu Posted May 6 Report Posted May 6 2 hours ago, Pavanonline said: Oh my cbi, idi kala nijamga 😯 Ina appeal chesi higher courts judgement ki inko 10 years easy peasy but appeal chesina time lo jail lone undaali ga? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.