psycopk Posted July 10 Author Report Posted July 10 YS Sharmila: 'బంగారు పాళ్యం వైసీపీ మామిడికాయ సినిమా'ను రక్తి కట్టించారు: షర్మిల 10-07-2025 Thu 14:42 | Andhra తోతాపురి రైతుల కష్టాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవేదన కూటమి ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శ బంగారుపాళ్యంలో జగన్ పర్యటన ఓ రాజకీయ డ్రామా అని ఆరోపణ జగన్‌కు కూటమి ప్రభుత్వం, పోలీసులు సహకరించారని సంచలన వ్యాఖ్య రైతుల సమస్యపై తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని డిమాండ్ రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య "నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా" అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకవైపు తోతాపురి మామిడి రైతులు ధరలు పతనమై కన్నీరు పెడుతుంటే, మరోవైపు ఈ రెండు పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరలేపాయని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటనను ఆమె ఓ పెద్ద నాటకంగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ దర్శకత్వంలో, పోలీసుల సహకారంతో ఈ "బంగారుపాళ్యం వైసీపీ మామిడికాయ సినిమా"ను రక్తి కట్టించారని ఎద్దేవా చేశారు. పరామర్శల పేరుతో వేలాది మందితో బలప్రదర్శన చేస్తుంటే, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించిందని విమర్శించారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు కావడం, వారి మధ్య అక్రమ పొత్తు ఉండటం వల్లే రాష్ట్రంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ లభిస్తోందని, అందుకే ఎలాంటి చర్యలు ఉండటం లేదని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తోతాపురి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని షర్మిల దుయ్యబట్టారు. కిలోకు 16 రూపాయలు ఇస్తే తప్ప తాము కోలుకోలేమని రైతులు వేడుకుంటుంటే, మార్కెట్లో 4 రూపాయలకు మించి ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం 12 రూపాయలు ఇచ్చి న్యాయం చేశామని అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. ఇది రైతుల కోసం జగన్ చేస్తున్న పోరాటం కాదని, కేవలం డబ్బుతో కూడిన బలప్రదర్శన అని షర్మిల స్పష్టం చేశారు. రైతులపై జగన్ కనబరుస్తున్నది ముసలి కన్నీరేనని ఆమె వ్యాఖ్యానించారు. తోతాపురి రైతుల సమస్యలపై తక్షణం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. Quote
psycopk Posted July 10 Author Report Posted July 10 Show utter flop aaiye sariki eediki kida doubt vachinatu undi… arey puchi battai anduke AP lo unda manedi YS Jagan: మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా మాట్లాడుతున్నారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు 10-07-2025 Thu 14:27 | Andhra మామిడి రైతులపై తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు అంటూ జగన్ విమర్శ నిరసన తెలిపిన రైతులను రౌడీలుగా చిత్రీకరించడం దారుణమని వెల్లడి మీ ఫ్యాక్టరీల కోసమేనా ఈ కుట్ర అంటూ సర్కారుపై జగన్ ఆరోపణల వర్షం మామిడి రైతుల సమస్యలపై నిరసన తెలుపుతున్న వారిని రౌడీషీటర్లుగా, అసాంఘిక శక్తులుగా చిత్రీకరిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనకు మద్దతిస్తున్న ఎల్లో మీడియా సంస్థలు మరింతగా దిగజారిపోయాయంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి, ఆ మీడియాకు ఉన్న బాధ్యతారాహిత్యం, తేలికభావం ఈ వక్రీకరణలతో బయటపడిందని మండిపడ్డారు. బంగారుపాళ్యం ఘటనపై వక్రీకరణలా? బంగారుపాళ్యంలో తాను చేపట్టిన పర్యటనకు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందల మందికి నోటీసులు ఇచ్చి నిర్బంధించినా వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రమంతా చూసిందన్నారు. ఈ క్రమంలో, తమకు జరుగుతున్న తీవ్ర నష్టాన్ని దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో కొందరు రైతులు రోడ్లపై మామిడికాయలు పోసి నిరసన తెలిపారని, దీనిని నేరంగా చూపిస్తూ రైతులను, వారికి మద్దతిస్తున్న ప్రతిపక్షాన్ని దొంగలుగా చిత్రీకరించడం సిగ్గుచేటని అన్నారు. "మామిడి రైతులకు కష్టాలే లేనట్టు, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టు మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఉంటుందా? పాలకుడినని చెప్పుకోవడానికి చంద్రబాబుకు, పత్రికలమని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి?" అని జగన్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. మీ చర్యలే నష్టాలకు నిదర్శనం మామిడి రైతులు నిజంగా కష్టాల్లో లేకపోతే, ప్రభుత్వం ఎందుకు కిలోకు రూ.4 ఇస్తామని ప్రకటించిందని జగన్ నిలదీశారు. ఫ్యాక్టరీలు కిలో రూ.8 చొప్పున కొనాలని దొంగ ఆదేశాలు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. తన పర్యటన ఖరారు కాగానే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీకి ఎందుకు పంపారని అడిగారు. కర్ణాటకలో కిలో మామిడిని రూ.16 కనీస మద్దతు ధరకు కొంటామని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే భాగస్వామి జేడీఎస్ నేత కుమారస్వామికి లేఖ రాయడాన్ని ఆయన గుర్తుచేశారు. "ఒకవైపు రైతులు నష్టపోతున్నారని మీరే అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని మేం ఎత్తిచూపితే మాపై, రైతులపై ఈ దౌర్భాగ్యపు మాటలు, రాతలు ఎందుకు?" అని జగన్ నిలదీశారు. మా పాలనతో పోల్చుకోండి గత ఏడాది తమ ప్రభుత్వ హయాంలో మామిడికి కిలోకు రూ.25 నుంచి రూ.29 వరకు ధర లభించిందని, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ధరలు దారుణంగా పడిపోయాయని జగన్ విమర్శించారు. ప్రతి ఏటా మే 15లోగా తెరుచుకోవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను నెలరోజులు ఆలస్యంగా, అదీ కొన్నింటిని మాత్రమే ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. "మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కల్పించడం లేదా?" అని ఆయన ఆరోపించారు. కిలోకు రూ.2.5 నుంచి రూ.3కు రైతులు అమ్ముకుంటున్న దయనీయ పరిస్థితిని ప్రస్తావిస్తూ, దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని పథకాలకూ మంగళం పాడారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వరి నుంచి మామిడి వరకు ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడం లేదని జగన్ ఆరోపించారు. తమ హయాంలో రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నామని, ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా వంటి పథకాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్బీకేలు, ఈ-క్రాప్, టెస్టింగ్ ల్యాబ్‌ల వంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రైతులకు అండగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు తోడుగా నిలబడాలని చంద్రబాబుకు జగన్ హితవు పలికారు. Quote
psycopk Posted July 10 Author Report Posted July 10 Vadini inka yedavani cheynandi Bhuma Karunakar Reddy: జగన్ అంటే జనం అనే విషయం మరోసారి నిరూపితమయింది: భూమన కరుణాకర్ రెడ్డి 10-07-2025 Thu 10:45 | Andhra జగన్ బంగారుపాళ్యం పర్యటనను ప్రభుత్వం అడ్డుకుందని భూమన విమర్శ బంగారుపాళ్యంలో హిట్లర్ నాటి నాజీ పాలన కనిపించిందని మండిపాటు వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేసి భయోత్పాతం సృష్టించారన్న భూమన మామిడి రైతులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనకు వస్తే, ప్రభుత్వం హిట్లర్ కాలం నాటి నాజీ పాలనను తలపించేలా వ్యవహరించిందని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నించిందని, భయానక వాతావరణం సృష్టించిందని ఆయన ఆరోపించారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు, వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ బంగారుపాళ్యం వస్తే, కూటమి ప్రభుత్వం భయపడిపోయిందని భూమన అన్నారు. "మా నాయకులకు నోటీసులు ఇచ్చారు. పలువురిని గృహ నిర్బంధం చేశారు. బంగారుపాళ్యం వెళ్లే అన్ని దారుల్లో అడ్డంకులు సృష్టించారు. అయినా జగన్ అంటే జనం అని మరోసారి నిరూపితమైంది. గుట్టలు, కొండలు దాటుకుని ప్రజలు, రైతులు జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఈ జన ప్రవాహం చూశాక కూటమి ఓటమి ఖరారైంది" అని ఆయన జోస్యం చెప్పారు. జగన్ పర్యటన ఒక సెట్టింగ్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను భూమన ఖండించారు. జగన్ పర్యటన ఖరారైన తర్వాతే ప్రభుత్వం కిలో మామిడికి రూ.6 ఇచ్చేందుకు ముందుకొచ్చిందని, అంతకుముందు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. దగా పడ్డామన్న ఆవేదనతో వచ్చిన రైతులు, తమ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు రోడ్లపై మామిడికాయలు పారబోసి తమ కడుపుమంటను వెళ్లగక్కారని భూమన తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని ఆయన పేర్కొన్నారు. Quote
karna11 Posted July 10 Report Posted July 10 11 hours ago, psycopk said: I don't think true former did this, nijamina former ithee one year forming chesi ila waste cheyadu nijamnga rate leka pothee free ga icheevadu, mari inthaa cheap and worst politics anavasaramaa @Sizzler. I think some worst team misleading jagan. Quote
7691 Posted July 10 Report Posted July 10 Nenu cm gaa unnapudu issues emi untayi tammudu? Gpay lo unnav aa mathram teliyadha? issues levu kanukey 11gaadu ee veshalu vesthundi. ground level lo everything is very good tammudu Quote
Bendapudi_english Posted July 10 Report Posted July 10 18 minutes ago, karna11 said: I don't think true former did this, nijamina former ithee one year forming chesi ila waste cheyadu nijamnga rate leka pothee free ga icheevadu, mari inthaa cheap and worst politics anavasaramaa @Sizzler. I think some worst team misleading jagan. Adhi annaki and ayana followers inka artham kavatledhu anna, EVMs ani thiruguthunaru Quote
7691 Posted July 10 Report Posted July 10 18 minutes ago, karna11 said: I don't think true former did this, nijamina former ithee one year forming chesi ila waste cheyadu nijamnga rate leka pothee free ga icheevadu, mari inthaa cheap and worst politics anavasaramaa @Sizzler. I think some worst team misleading jagan. Abba tammudu. Delete this post. what if some one posts eenadu link which says farmers throwed away their crop because of low prices during 11reddy Quote
7691 Posted July 10 Report Posted July 10 1 minute ago, Bendapudi_english said: Adhi annaki and ayana followers inka artham kavatledhu anna, EVMs ani thiruguthunaru Tammudu gpay meedha unnapudu evm anodhu. Nenu court lo case ey vesanu. Aa mukka 11 fans vesthey nagundadu Quote
karna11 Posted July 11 Report Posted July 11 1 hour ago, 7691 said: Abba tammudu. Delete this post. what if some one posts eenadu link which says farmers throwed away their crop because of low prices during 11reddy enti @Sizzler nee Id banned, i don't think this reply by you. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.