citizenofIND Posted August 31 Report Posted August 31 1 hour ago, pichhipullayya said: Pulka did you see ur comment? Quote
ntr2ntr Posted August 31 Author Report Posted August 31 ఇటీవల కురిసిన భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఈ క్లిష్టమైన పరిస్థితులలో బాధితులకు తన వంతు సాయంగా రూ.50 లక్షలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. కథానాయకుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకొన్న ఏకైక నటుడిగా వరల్డ్ బుక్ రికార్డ్స్ సంస్థ బాలయ్యని ఈరోజు హైదరాబాద్ లో సత్కరించింది. ఈ సందర్భంగా బాలయ్య ఈ విరాళం ప్రకటించారు. జగిత్యాల, కామారెడ్డి వరదల వల్ల చాలామంది నష్టపోయారని, అపార పంట నష్టం వాటిల్లిందని, ఇదో ఉడతాభక్తి సాయమని, ఇక మీదట కూడా ఇలానే తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వరల్డ్ రికార్డ్ సందర్భంగా సన్మాన కార్యక్రమం అంతా అయిపోయిన తరవాత బాలయ్య ఈ ప్రకటన చేయడం విశేషం. ఇలా విరాళాలు ప్రకటించి, వాటిని రాజకీయాలకు వాడుకొనే ఉద్దేశ్యం లేదని, అందుకే ఆ హడావుడి అయిపోయిన తరవాత ప్రకటించానని బాలయ్య చెప్పడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు సినిమాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేయాలని, అక్కడ మౌళిక వసతులు కల్పించి, కళాకారులకు జీవనోపాధి అందించాలని కోరారు బాలయ్య. తెలుగు చిత్రసీమ ఆస్కార్ స్థాయికి వెళ్లిందని, ఇది తెలుగువాళ్లంతా గర్వపడాల్సిన సమయం అని చెప్పుకొచ్చారు. ఈ యేడాది తనకు బాగా కలిసొచ్చిందని, ఈమధ్య కాలంలో వరుసగా నాలుగు విజయాలు దక్కాయని, పద్మ భూషణ్ పురస్కారం కూడా అందిందని, అన్ స్టాపబుల్ కార్యక్రమం దేశంలోనే నెంబర్ వన్ షోగా కీర్తి గడించిందని, భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిందని ఇలాంటి సందర్భంలోనే యాభై ఏళ్ల ప్రస్థానం పూర్తి చేయడం గర్వంగా ఉందని, ఇక మీదట కూడా ఇలానే గొప్ప సందర్భాలలో అభిమానుల్ని కలుస్తానని బాలయ్య పేర్కొన్నారు Quote
psycopk Posted August 31 Report Posted August 31 Nandamuri Balakrishna: అందరికీ ఏజ్ పెరిగితే బాలయ్యకు క్రేజ్ పెరుగుతోంది... ఏ రంగంలోనైనా నెంబర్ వన్!: మంత్రి నారా లోకేశ్ 30-08-2025 Sat 22:26 | Andhra హీరోగా 50 ఏళ్లు పూర్తి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో ఘనంగా కార్యక్రమం చరిత్ర సృష్టించడం బాలయ్యకే సాధ్యమన్న మంత్రి నారా లోకేష్ సినిమా, రాజకీయాలు, ఓటీటీలో ఆయనే నంబర్ వన్ అని ప్రశంస పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినీనటి జయసుధ, ఇతర ప్రముఖులు చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బాలకృష్ణకు హైదరాబాద్ లోని ఒక హోటల్ లో పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, బాలయ్యను వేనోళ్ల కొనియాడారు. "50 ఇయర్స్ ఇండస్ట్రీ. సినిమా, సేవా కార్యక్రమాలు, టెలివిజన్ షోస్, పాలిటిక్స్ ఎందులోనైనా బాలయ్య నంబర్ 1. విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి తరువాత రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క మాస్ మహారాజ్ బాలయ్య. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మాస్ మహారాజ్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. 1974లో తాతమ్మ కలతో మొదలైన సినీ ప్రయాణం అఖండ 2 వరకూ వచ్చింది. అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్య కు క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటికి 109 సినిమాల్లో హీరోగా చేశారు. 100 రోజులు కాదు 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. ఏదైనా బాలయ్యకే సాధ్యం ఎవరైనా ఒక జానర్ లో సక్సెస్ అవుతారు. కానీ అన్ని జానర్స్ లో సినిమాలు తీసి ముద్ర వేసిన కథానాయకుడు బాలయ్య. పౌరాణికం, జానపదం, చారిత్రకం, ఆధ్యాత్మికం, సోషియో ఫాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా బాలయ్య కే సాధ్యం. గౌతమీ పుత్రశాతకర్ణి అని మీసం మెలేసినా ....అఖండ అని గర్జించినా బాలయ్యకే చెల్లింది. రాముడు, కృష్ణుడులో మనకు తెలిసిన రూపం నందమూరి తారక రామారావు గారిది. మళ్లీ అంతటి చూడచక్కని రూపం, నట విశ్వరూపం బాలయ్య బాబుదే. శ్రీరామరాజ్యం చిత్రంతో మళ్లీ మనందరికీ మరోసారి ఎన్టీఆర్‌ని గుర్తుకుతెచ్చారు. ఓటిటి లోనూ బాలయ్యే మేటి బాలయ్య నిర్మాతల హీరో, దర్శకుల హీరో, అభిమానుల హీరో. తన సినిమానే కాదు... సినిమా పరిశ్రమ కూడా బాగుండాలి అని భావించే నిజమైన హీరో. ఇప్పుడు ఓటీటీ వంతు వచ్చింది. బాలయ్య అక్కడా దుమ్ము రేపుతున్నారు. బాలయ్య షో చేస్తే రేటింగ్స్ రాకెట్లా దూసుకెళుతున్నాయి. ప్రేక్షకులకు అద్వితీయ వినోదాన్ని అందించారు. బాలయ్య అడుగు పెడితే ఎక్కడైనా అన్ స్టాపబుల్ అని ఆయన చేసిన రియాలిటీ షోనే నిదర్శనం. అన్ స్టాపబుల్ తో బాలయ్య ఓటీటీలో కూడా సత్తా చాటారు. మూడు నంది అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు వచ్చాయి. బాలయ్య భోళా శంకరుడు బాలయ్య అంటే భోలా శంకరుడు. స్వచ్చమైన మనసు బాలయ్యది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. దాపరికం లేదు... ముందొకమాట వెనుక ఒకమాట ఉండదు. అదీ బాలయ్య స్టైల్! ప్రజలకు కష్టం వచ్చినప్పుడు సాయంలో ముందుంటారు. 2009 కృష్ణా వరదల్లో ముందుకు వచ్చి సాయం చేశారు. కరోనా సమయంలో ధైర్యంగా అఖండ సినిమా పూర్తి చేసి ఇండస్ట్రీలో ధైర్యాన్ని నింపారు. ఆ సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున సాయం చేశారు. మరో రూ.25 లక్షలు కరోనా విపత్తు సహాయం కోసం ఇచ్చారు..." అని లోకేశ్ వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినీనటి జయసుధ, పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.