Wednesday at 12:10 PM5 days Author తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్06-05-2026 Wed 16:19 | Nationalలోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం నేపథ్యంలో కలిసిన విజయ్నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లుటీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగిన బలం ఉందని చెప్పడానికి లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు.ఇప్పటికే, చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. కానీ ఎన్నికల అనంతరం, టీవీకేకు మెజారిటీ కొన్ని సీట్లు తగ్గడంతో కాంగ్రెస్ టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమైంది.
Wednesday at 12:11 PM5 days Author విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత06-05-2026 Wed 16:53 | Nationalఇండియా కూటమి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కర్ణాటక బీజేపీ నాయకుడుడీఎంకుకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శకాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధామంతమంటూ లేదని వ్యాఖ్యడీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు రావొచ్చని హెచ్చరికడీఎంకేను పక్కన పెట్టి, టీవీకే అధినేత విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడంపై కర్ణాటక బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ గురించి ఇండియా కూటమి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది. తమిళనాడులో కాంగ్రెస్ తన మిత్రపక్షం డీఎంకేను మోసం చేసిందని ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ బీజేపీ నేత ఆర్. అశోక్ బెంగళూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి, ఫలితాల తర్వాత ఆ పార్టీని వదిలేసిందని విమర్శించారు.కాంగ్రెస్ అసలు స్వరూపం మరోసారి బయటపడిందని, ఆ పార్టీని నమ్మిన డీఎంకే నాయకులు ఇప్పుడు దిగ్భ్రాంతికి గురవుతున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే కలిసి పోటీ చేశారని, కానీ ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక స్థిరమైన సిద్ధాంతం ఉండదని విమర్శించారు. టీవీకేతో కలవడమంటే డీఎంకేకు వెన్నుపోటు పొడవడమే అన్నారు.తమను నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అవసరానికి అనుగుణంగా ఎలా వ్యవహరిస్తుందో ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఆలోచించాలని అన్నారు. డీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు ఎదురుకావొచ్చని హెచ్చరించారు.
Wednesday at 12:11 PM5 days Author స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. ఓటమి వేళ సంఘీభావం06-05-2026 Wed 16:04 | Nationalఅసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీకష్టకాలంలో అండగా ఉంటానని స్టాలిన్‌కు హామీ ఇచ్చిన రజనీ108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకేప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు కోరుతున్న విజయ్చెన్నైకి చేరుకున్న గవర్నర్.. మరింత పెరిగిన రాజకీయ ఉత్కంఠతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. డీఎంకే ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇవాళ చెన్నైలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో స్టాలిన్‌కు సంఘీభావం తెలిపేందుకే రజనీకాంత్ ఆయన్ను కలిశారని సమాచారం. ఈ కష్టకాలంలో తాను ఆయనకు అండగా ఉంటానని రజనీ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతసేపు జరిగిన ఈ భేటీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకే కూటమిలోని వీసీకే, వామపక్షాల నేతలు కూడా పార్టీ ప్రధాన కార్యాలయం 'అన్నా అరివాలయం'లో స్టాలిన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో 234 స్థానాలకు గాను స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కేవలం 59 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీకి చేరువలో ఆగిపోయింది.దీంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన మద్దతు ప్రకటించగా, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలతో కూడా టీవీకే సంప్రదింపులు జరుపుతోంది. ఈ రాజకీయ పరిణామాల మధ్య తమిళనాడు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ చెన్నైకి చేరుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం సంకీర్ణ రాజకీయాల శకంలోకి అడుగుపెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Wednesday at 12:43 PM5 days 2 hours ago, psycopk said:@CADNMALODU nuvvena kotinchindi??Aina Ninnane kadha Samara, Vellalar ani post vesavu. Naaku teslisundhi entante, Madhurai area lo thevar laki SC laki fan wars unnayi. Thevars emo Ajith (Sindhu, Brahmin mix) ni own chesukunnaru, SC lu Vijay ni own chesukunnaru. Akkada fan base kooda ekkuva, Chennai bayata. Vellalars, Mudaliyars ki already valla actors unnaru.
Wednesday at 04:39 PM5 days 23 minutes ago, psycopk said:Looks like dmk and aidmk in talks to share power 2.5yrs each…Idhe jarigithe paytm galla arthanadhalu mana valla kadhu, hopefully vijay will be cm, Amen!
Wednesday at 04:44 PM5 days 4 minutes ago, allbakara said:Idhe jarigithe paytm galla arthanadhalu mana valla kadhu, hopefully vijay will be cm, Amen!Eellu naakinathala sagam kooda aravollu cheyatamle🤣🤣🤣happy ga peggesi thonguni untaar🤣🤣🤣mana langa jaffas ooke tearing drawers🤣🤣🤣
Wednesday at 04:45 PM5 days 30 minutes ago, psycopk said:Looks like dmk and aidmk in talks to share power 2.5yrs each…don;t think they trust each each other for this to happen.
Wednesday at 04:45 PM5 days Popular Post 5 minutes ago, allbakara said:Idhe jarigithe paytm galla arthanadhalu mana valla kadhu, hopefully vijay will be cm, Amen!stalin tho pics ready ga unnai sambaralu cheskotaniki
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.