May 4May 4 Author కంగ్రాచ్యులేషన్స్ విజయ్: ఏపీ మంత్రి నారా లోకేశ్04-05-2026 Mon 15:26 | Andhraతమిళనాడు ఎన్నికల్లో విజయం దిశగా టీవీకేనటుడు విజయ్‌కు అభినందనలు తెలిపిన నారా లోకేశ్విజయ్ ఎన్నికల అరంగేట్రం అద్భుతమని ప్రశంసప్రజల అంచనాలకు అనుగుణంగా బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతూ, రాజకీయ అరంగేట్రంలో సత్తా చాటిన నటుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ ఎన్నికల ప్రస్థానం అద్భుతంగా మొదలైందని ఆయన ప్రశంసించారు.ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, "తమిళనాడులో విజయ్ పార్టీ (టీవీకే) నమోదు చేస్తున్న అద్భుతమైన ఎన్నికల విజయాల పట్ల నా అభినందనలు. ఈ ఫలితాలు రాష్ట్ర ప్రజల మారుతున్న ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయి. విజయ్ ఘనత తమిళనాడు రాజకీయ యవనికపై ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది" అని పేర్కొన్నారు.ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్న విజయ్‌కు శుభం కలగాలని లోకేశ్ ఆకాంక్షించారు. "ప్రజల అంచనాలను అందుకుంటూ, బాధ్యతతో, అంకితభావంతో విజయ్ పనిచేస్తారని ఆశిస్తున్నాను" అని లోకేశ్ తన సందేశంలో వివరించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
May 4May 4 Author గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు?... తమిళనాట ఎన్నికల ఫలితాల హోరులో విశాల్ ఆసకిక్తర ట్వీట్04-05-2026 Mon 14:41 | Nationalతమిళనాడు ఎన్నికల కౌంటింగ్‌లో విజయ్ పార్టీకి అనూహ్య ఫలితాలుఫలితాల సరళిపై ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్రాబోయే రోజుల్లో గవర్నర్ యాక్షన్ చూస్తారంటూ వ్యాఖ్యగవర్నర్ పేరు ఎంతమందికి తెలుసంటూ వ్యంగ్యంఫలితాల తర్వాత గవర్నర్ పాత్ర కీలకం కానుందన్న సంకేతాలుతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ, పెట్టిన రెండేళ్లకే అద్భుతమైన ఫలితాలతో దూసుకుపోతోంది. ఈ ట్రెండ్స్‌తో విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్న తరుణంలో, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.ఫలితాల సరళిపై స్పందిస్తూ విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇది తీర్పు వెలువడే రోజు. ఫలితాలు వస్తున్నాయి. ఇందులో అనేక మలుపులు, ట్విస్టులు ఉన్నాయి. ఇంతకీ మన తమిళనాడు గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు? రాబోయే రోజుల్లో ఆయన పూర్తి యాక్షన్‌లో ఉండటం చూస్తారు. ఆయన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఏదైనా రానివ్వండి. తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా" అని పోస్ట్ చేశారు. తమిళనాడులో హంగ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో విశాల్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.ఎన్నికల్లో ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, విశాల్ గవర్నర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఏమైనా ఊహించని పరిణామాలు చోటుచేసుకుని, గవర్నర్ పాత్ర కీలకం కాబోతోందా అనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, విజయ్ పార్టీ విజయాల వేళ విశాల్ చేసిన ఈ ట్వీట్, తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తుది ఫలితాలు వెలువడిన తర్వాతే రాజకీయ ముఖచిత్రంపై పూర్తి స్పష్టత రానుంది.
May 4May 4 Author ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు స్పందన04-05-2026 Mon 14:07 | Andhraప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమే ఎన్డీయే విజయం అన్న చంద్రబాబువికసిత భారత్ లక్ష్య సాధనకు ఈ ఫలితం మరింత బలాన్నిచ్చిందని వెల్లడిసబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ఎన్డీయే ముందుకు సాగుతోందంటూ ప్రకటనయువత విశ్వసనీయత, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ తీర్పు చాటిందని స్పష్టీకరణ ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే నేతలకు చంద్రబాబు అభినందనలుఅసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రక విజయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి, ఆయన దార్శనికతకు అద్దం పడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విజయం ‘వికసిత భారత్’ లక్ష్య సాధన ప్రయాణానికి మరింత బలాన్ని చేకూర్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి పట్ల ఎన్డీయేకు ఉన్న తిరుగులేని నిబద్ధతకు ప్రజలు తమ మద్దతును స్పష్టంగా తెలియజేశారని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఓ అభివృద్ధి చెందిన శక్తిగా మార్చాలనే సంకల్పానికి ఈ తీర్పుతో మరింత ఊపు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విజయం యావత్ దేశ ప్రజల విజయమని ఆయన కొనియాడారు.ఈ ఫలితాలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చాయని చంద్రబాబు అన్నారు. నేటి యువభారతం విశ్వసనీయత, అభివృద్ధి, పౌరులతో నిజాయతీపూర్వకమైన సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందనే వాస్తవాన్ని ఈ తీర్పు చాటి చెప్పిందని ఆయన విశ్లేషించారు. అభివృద్ధి అజెండాకే ప్రజలు పట్టం కడతారనడానికి ఈ విజయమే నిదర్శనమని స్పష్టం చేశారు.ఈ చారిత్రక విజయం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా, ఎన్డీయే తరఫున విజయం సాధిస్తున్నఅభ్యర్థులకు, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు, చారిత్రక తీర్పునిచ్చిన దేశ ప్రజలందరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.
May 4May 4 Author బెంగాల్ ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు04-05-2026 Mon 15:41 | Entertainmentబెంగాల్ ఓటర్లు ఎవరినీ క్షమించలేదన్న నిఖిల్ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పారని వ్యాఖ్యఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ బాధితురాలికి న్యాయం జరిగిందన్న నిఖిల్పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల ట్రెండ్ దేశ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. మమతా బెనర్జీ టీఎంసీ కోటను బద్ధలు కొట్టి బీజేపీ ఘన విజయం అంచున నిలిచింది. ఈ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎక్స్ వేదికగా నిఖిల్ స్పందిస్తూ... బెంగాల్ ఓటర్లు దేనినీ మర్చిపోలేదని, అలాగే ఎవరినీ క్షమించలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సామాన్య పౌరుల భద్రతను, ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి అక్కడి ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని నిఖిల్ విశ్లేషించారు. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అమానుష ఘటనను ఉద్దేశించి మాట్లాడిన నిఖిల్... ఇప్పుడు ఆ బాధితురాలికి నిజమైన న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.
May 4May 4 Author Thalapathy Vijay won't make any alliance with AIDMK...!! DMK will extend outside support to Thalapathy Vijays TVK ....!! TVK+DMK coalition will rule Tamilnadu
May 4May 4 5 minutes ago, psycopk said:Thalapathy Vijay won't make any alliance with AIDMK...!!DMK will extend outside support to Thalapathy Vijays TVK ....!!TVK+DMK coalition will rule TamilnaduGlass marchandi ammaaa
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.