Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి ప్రజలు కుచ్చు టోపీ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిరంజీవి ఇమేజ్ కూడా ఏ మాత్రం పనిచేయలేదని ఎన్నికల ఫలితాలు వెలువడతున్న తీరును బట్టి అర్థమవుతోంది. దాదాపు వంద డివిజన్ల ఫలితాల తీరు తెలిసినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ ఒక్క డివిజన్ లో కూడా అధిక్యతలో లేదు. ఏ ఒక్క సీటును కూడా చిరంజీవి గెలుచుకునే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ప్రజారాజ్యం పార్టీ 64 డివిజన్లలో పోటీ చేసింది. చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారం చేపట్టారు. అయినా ఫలితం మాత్రం గుండు సున్నానే అయింది.

కాంగ్రెసు పార్టీతో పొత్తు ప్రయత్నాలు జరిగిన తీరు, అది బెడిసి కొట్టిన వైనం కూడా ప్రజారాజ్యం పార్టీ ఫలితాలపై ప్రభావం చూపినట్లు భావించవచ్చు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనని, చిన్న పార్టీలకు ఓటేస్తే మురిగి పోతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన ప్రచారం ఫలించినట్లే కనిపిస్తోంది. కాంగ్రెసుకు చిరంజీవి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రత్యామ్నాయం కానేరదనేది స్పష్టమై పోయింది. అందువల్ల ఓటర్లు ప్రజారాజ్యం పార్టీ పట్ల విముఖత ప్రదర్శించినట్లు చెప్పుకోవచ్చు

Posted

Elantivi enni videos enni chesina.. google K.v.P aliasandharvijaykantha chimpangeechiru mundhu dhigadhodupoey..

mr..gajjimod..ali.lol.gifi15851_sunilloudlaugh.gif3168e8j.gif2jc7tjm.gif

×
×
  • Create New...