Jump to content

TDP ki America lonu asammathi sega!


Recommended Posts

Posted

హైదరాబాద్: టిక్కెట్ దొరకని పలు పార్టీల 'ఆశావహు'ల అసంతృప్తి జ్వాలలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రాజకీయ అధికారం డబ్బు సంపాదనకు అనువైన మార్గంగా మారిన తర్వాత ప్రతి పార్టీకి టికెట్ ఆశావహుల బెడద చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రజారాజ్యం పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. ప్రజారాజ్యం పార్టీలో పార్టీ అభ్యర్ధుల జాబితాపై నిరసనలు తీవ్రమై చివరకు అరాచకానికి దారి తీస్తున్నాయి. హైదరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలతో ప్రారంభమై పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టే స్థాయికి ఈ అసంతృప్తి జ్వాలలు విస్తరించాయి.

శనివారంనాడు అనంతపురంలో టిక్కెట్ రానివారు పార్టీ కార్యలయానికి నిప్పు పెట్టటమే కాక టిక్కెట్ పొందిన అభ్యర్ధిపై దాడికి ప్రయత్నించారు. సురేంద్రబాబు సారధ్యంలోని సినిమా అభిమానుల సంఘం నాయకత్వంలో రాజ్యం కార్యాలయంపై దాడి జరిగింది. రోడ్లపై బైఠాయించి తమ నిరసనలను వ్యక్తం చేశారు. పార్టీ అధినే చిరంజీవికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం ప్రజారాజ్యంలో లేదని నినాదాలు చేశారు. అదే విధంగా పుట్టపర్తిలో కూడా ఈ సినిమా అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. అదే కోవలో ఆదివారంనాడు మహబూబ్ నగర్ జిల్లాలో అవే సంఘటనలు పునరావృతమైనాయి. జూపల్లి భాస్కరరావుకు కల్వకుర్తి టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

'రాజ్యం' కార్యాలయానికి టు లెట్ బోర్డ్

అదే సమయంలో, వరంగల్ లో కార్యకర్తలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ లోని ప్రజారాజ్యం కార్యాలయం ఒక ప్రైవేట్ భవంతిలో కొసాతుండేది. ఆ భవంతి యజమాని ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి కూడా కృషి చేసేవారు. ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన రెండవ జాబితాలో కూడా టిక్కెట్ రాక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. ఆ కోపంతో పార్టీ కార్యాలయానికి టు లెట్ బోర్డు పెట్టి తన నిరసనను వ్యక్తం చేసారు.

×
×
  • Create New...